మెయిన్ ఫీచర్

‘అమ్మ’కు ఆకలి తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను రోజుకు రూ.400లు సంపాదిస్తున్నాను. ఒకప్పుడు కడుపు నిండా తిండి తినాలంటే రోజుకు రూ.150లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మిగిలిన డబ్బులు మా ఇంటికి పంపాలంటే గగనమయ్యేది. కాని నేడు రోజుకు రూ.20లు ఖర్చుచేస్తే చాలు కడుపునిండా తిండి దొరుకుతుంది. మిగిలిన డబ్బులు ఆనందంగా ఇంటికి పంపుతున్నాను’’- పంజాబ్ నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుడు.
‘‘నాకు ఇళ్లల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఇచ్చేవారు. దానినే తిని ఇళ్లల్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి చేరేదాన్ని. కాని ఇపుడు వేడివేడిగా ఇడ్లీలు, మధ్యాహ్నాం భోజనం, సాయంత్రం కూడా ఇక్కడే కడుపునిండా తిని తృప్తిగా వెళుతున్నాను. కేవలం రూ.20లు చెల్లిస్తే చాలు. రోజంతా కడుపు నిండా తిండి దొరుకుతుంది.’’-ఇళ్లల్లో పనిచేసే ఓ మహిళ.
**
నిజమే బిడ్డల ఆకలి అమ్మకే తెలుసు. ఓ మహిళ మనసు మరో మహిళకు తెలుసుకాబట్టే ఇలాంటి అమ్మక్యాంటీన్లు పెట్టి అభిమానాన్ని ఓట్లరూపంలో సంపాదించగలిగింది. ఆడదానికేమి తెలుసు అని ఎకసెక్కాలాడేవాళ్ల నోళ్లు మూస్తు తమిళనాడులో అమ్మ ప్రారంభించిన క్యాంటీన్లు అతివలే నిర్వహిస్తూ అందరి ఆకలి తీరుస్తున్నాయి. అతివల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ క్యాంటీన్ల మంచి హోటళ్లను తలదనే్నలా శుచిగానూ, రుచిగానూ ఆహారపదార్థాలను అందజేస్తున్నాయి. తొలుత వీటి నిర్వహణ మూణ్ణాళ్ల ముచ్చటే అని అనుకున్నారు. ఎందుకంటే ఎన్నో పథకాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయి వాటి ఉనికినే కోల్పోయినవి మనదేశంలో ఎన్నో ఉన్నాయి. కాని ‘అమ్మ’ అంటూ తమిళనాడు ప్రజలు నోరారా పిలుచుకునే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ‘అమ్మ క్యాంటీన్ల’పై ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. అతి తక్కువ రేట్లకు సబ్సిడీపై అందజేస్తున్న అమ్మ క్యాంటీన్‌లోని ఆహార పదార్థాలు రుచిగానూ, శుచిగానూ పేద,మధ్యతరగతి ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. రోజూవారీ కార్మికులే కాదు చిన్నాచితకా ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ ఎంప్లారుూస్, కాలేజీ విద్యార్థులు, ఆఖరికి ఐటీ ప్రొఫెనల్స్ సైతం ఈ క్యాంటీన్లలో కడుపునిండా భోంచేస్తున్నారు.
టార్గెట్ పదివేల క్యాంటీన్లు
రెండంకెలతో ప్రారంభమైన ఈ క్యాంటీన్లు రాబోయే కాలంలో ఐదంకెల స్థాయికి తీసుకువెళ్లేందుకు జయలలిత సన్నాహాలు చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లు వందలాది మంది మహిళలకు ఉపాధికల్పిస్తున్నాయ. ఒక్కొక్క క్యాంటీన్‌లో పదిమంది మహిళలు పనిచేస్తుంటారు. ఇప్పటివరకు 300 క్యాంటీన్లు ప్రారంభించగా ఇందులో సగం చెన్నైలోనే ఉన్నాయి. మహిళలే వండి నీట్‌గా సర్వ్ చేస్తుండటం వల్ల నేడు వేలాది మందికి ఉపాధి లభించటం వల్ల అనేక రాష్ట్రాల నుంచి ఈ క్యాంటీన్ల నిర్వహణ ఎలా జరుగుతుందని పరిశీలించి వెళుతుండటం విశేషం
ఏఏ పదార్థాలు ఎపుడెపుడు?
బ్రేక్‌ఫాస్ట్:ఉదయం ఏడు నుంచి 10 గంటలలోపు సర్వ్ చేస్తారు. ప్లేట్ ఇడ్లీ, సాంబారు రూపాయి మాత్రమే. పొంగల్ రైస్ ఐదు రూపాయలు. మధ్యాహ్నా భోజనం : 12 నుంచి 3 గంటల వరకు సప్లయ్ చేస్తారు. సాంబారు రైస్, లెమన్ రైస్, కరివేపాకు రైస్ ఐదు రూపాయలకు అందజేస్తారు. దీంతో పాటు మూడు రూపాయలకు పెరుగన్నం పెడతారు. డిన్నర్ :సాయంత్రం ఐదు నుంచి 7.30 గంటల మధ్య సప్లయ్ చేస్తారు. మూడు రూపాయలకు పప్పుతో రెండు రోటీలను అందజేస్తారు. ఇలాంటి పోషకవిలువలతో కూడిన ఆహార పదార్థాలను చౌకగా, రుచిగా అందజేయటం వల్ల ఈ క్యాంటీన్లకు వచ్చేవారి సంఖ్య రానురాను పెరిగిపోతోంది. 2013 ప్రారంభమైన ఈ క్యాంటీన్లు గత మూడేళ్ల నుంచి దిగ్విజయంగా మహిళలు నిర్వహిస్తూ అమ్మకు పేరు తెచ్చిపెట్టడమే కాకుండా ఆమెకు
మళ్లీ అధికారాన్ని సైతం కట్టబెట్టేందుకు దోహదం చేసాయని రాజకీయ విశే్లషకులు సైతం అంగీకరించే వాస్తవం. సమైక్యతా భావాన్ని చాటేవిధంగా అన్నివర్గాలవారు ఈ క్యాంటీన్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కొక్క క్యాంటీన్‌లో దాదాపు 16 మంది మహిళలు పనిచేస్తుంటారు. వీరంతా పేద మహిళలే. గతంలో మా ఇంటిలో నలుగురికి మాత్రమే వండిపెట్టేదాన్ని. ఇపుడు రోజుకు 400 వందల మందికి వండి పెట్టడమేకాకుండా.. రూ.300లు సంపాదిస్తున్నాను. వీక్లీ ఆఫ్ కూడా ఉంటుందని చెబుతుంది రజిత. ఏదిఏమైనప్పటికీ ఓ మగాడి ఆకలి మంటలను గ్రహించేది ఆడదే. ఆ ఆడదాని మనసును జయలలిత తెలుసుకున్నది.
**
రోజూవారీ కార్మికులే కాదు చిన్నాచితకా ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ ఎంప్లారుూస్, కాలేజీ విద్యార్థులు, ఆఖరికి ఐటీ ప్రొఫెనల్స్ సైతం ఈ క్యాంటీన్లలో కడుపునిండా భోంచేస్తున్నారు.
**
‘చెన్నైలో దాదాపు 200 క్యాంటీన్లను ఏర్పాటుచేశారు. ఇందులో ఓ క్యాంటీన్‌కి ఓ చిన్న పిల్లాడు వచ్చి మధ్యాహ్నాం భోంచేయ టం అక్కడివారు గమనించారు. ఆరా తీస్తే ఆ పిల్లాడి తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడు. తల్లి ఇళ్లలో పనిచేసి తీసుకువచ్చే డబ్బులు ఆ ఇంటిలో కడుపునిండా అన్నం వండే ఆర్థిక పరిస్థితి లేదు. దీంతో ఆ పిల్లాడి అమ్మ రోజు ఐదు రూపాయలు ఇస్తే క్యాంటీన్‌కు వచ్చి కడుపునిండా తింటున్నాడు.
**
‘‘మొదటిసారి అమ్మ క్యాంటీన్‌లో భోజనం చేశాం. చాలా బాగుంది. భోజనం తింటూ గుర్తుగా సెల్ఫీ తీసుకున్నాం. సేల్స్ గాల్స్‌గా పనిచేస్తున్నాం. ఈ సెల్ఫీని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తాం ’’- ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు.