మెయిన్ ఫీచర్

కొండల్ని పిండేస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...........
టీనేజ్ అమ్మాయికి పర్వతారోహణే ప్రాణం ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు తహతహ
ఏడింటిలో మూడు పర్వతాలు అధిరోహణ
...........
మీరు ప్రతిరోజూ టీవి చూస్తుంటే... డాబర్‌వారి యాడ్‌లో ఓ టీనేజ్ అమ్మా యి మిమ్మల్ని పలుకరించే ఉండాలి. ‘‘అందంగా ఉన్నా గట్టిదానే్న’’ అంటూ టీనేజ్ అమ్మాయిల సత్తా చాటుతోంది. ఆమే పదిహేనేళ్ల జాహ్నావి. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నది పసి వయసు నుంచే పర్వతారోహణకు సిద్ధమైందంటే ఆశ్చర్యపోకతప్పదు. మూడేళ్ల వయసులో ఎవరైనా పిల్లలు బొమ్మలతో ఆటలాడుకుంటారు. కాని ఈ టీనేజ్ అమ్మాయి కొండలెక్కటానికి ముచ్చటపడింది. తండ్రి చేయి పట్టుకుని పర్వతాన్ని ఎక్కేసింది. పనె్నండేళ్లు వచ్చేసరికి ఆఫ్రికాలో ఎత్తయిన పర్వత శిఖరం కిలిమంజరో అధిరోహించింది. ఆ తరవాత సంవత్సరం యూరోప్‌లోని ఎల్బెరస్ శిఖరాన్ని ముద్దాడింది. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో ఎత్తయిన రెండు పర్వతాల అంచులకు చేరింది. 16ఏళ్లకు ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పెందుకు ముందుకు సాగుతోంది.
పదిహేనేళ్ల జాహ్నావి పర్వతారోహాణపై మక్కువ పెంచుకోవటానికి ప్రకృతే దోహదం చేసిందని, పచ్చటి ప్రకృతిలో ఓ భాగమైన కొండలను చదువుతో పాటు ఇష్టపడతాను అని అంటోంది. మొట్టమొదటిసారి వారం రోజుల ట్రెక్కింగ్ క్యాంప్‌కు వెళ్లినపుడు ఉత్తరాఖండ్‌లోని రూప్‌ఖండ్‌కు వెళ్లింది. ఆ గ్రూపులో ఈమె అతి పిన్నవయస్కురాలు. ఈ ట్రెక్కింగ్ వల్ల ప్రకృతిని, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను అధ్యయనం చేయటానికి అవకాశం దొరుకుతుందని చెబుతోంది.

హైదరాబాద్ నివాసి

హైదరాబాద్‌కు చెందిన జాహ్నావి తల్లిదండ్రులు కృష్ణారావు, సరస్వతి. ఆమెకు సోదరుడు ఉన్నాడు. జాహ్నావికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు తండ్రి ఆమెను ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగాడు. నాకు ధ్రిల్లింగ్, సాహసం అంటే ఇష్టం అని చెప్పింది.
అందుకే చదువుతో పాటు పర్వతారోహణను ప్రవృత్తిగా చేపట్టింది. ఆమెకు పదేళ్ల వయసు ఉన్నపుడు గూగుల్‌లో సెర్చ్ చేయగా టీనేజ్ అమ్మాయి ప్రపంచంలోని ఏడు పర్వతాలను అధిరోహించినట్లు రికార్డు లు లేకపోవటంతో ఆ రికార్డును సాధించేందుకు లక్ష్యంగా చేసుకున్నానని చె బుతోంది. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పటంతో వెన్నుతట్టాడని పేర్కొంది.

ఐదు గంటలకే ప్రాక్టీస్

తెల్లవారుజామున ఐదు గంటలకు స్టేడియంకు వెళతాను. అక్కడ ఎక్కువ సమయం ఫిట్‌నెస్ ప్రాక్టీస్ చేస్తుంటాను. మధ్యాహ్నాం వరకు స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తాను. ఇంటికి వచ్చి లంచ్ చేసి స్కూలుకు వెళతాను. తిరిగి నాలుగు గంటలకు ఇంటికి వచ్చి రెండు గంటల పాటు చదువుకుంటాను. తరువాత 10 గంటల కల్లా నిద్రకు ఉపక్రమిస్తాను. ఫిట్‌నెస్ ప్రాక్టీస్ కోసం పాఠశాలలో పర్మిషన్ తీసుకున్నానని చెబుతోంది. సంవత్సరంలో ఎక్కువ కాలం ట్రెక్కింగ్‌లో గడిపే జాహ్నావి చదువులోనూ ఏమాత్రం వెనుకబడలేదు. దాదాపు 80 నుంచి 85 శాతం మార్కులు తెచ్చుకుంటోం ది.

అస్వస్థతకు గురైనా ...

పనె్మండేళ్ల వయసులో లడక్‌లోని స్టాక్ కంగరీ పర్వతాన్ని అధిరోహించటానికి వెళ్లినపుడు జరిగిన సంఘటన ఆమెను మరింత రాటుదేల్చింది. పర్వతం ఎక్కుతుండగా.. వాతావరణ ప్రభావమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ తీవ్ర అస్వస్థతకు గురైంది. విపరీతమైన తలపోటు వచ్చి కళ్లకు ఏమి కనపడని పరిస్థితి. వెంటనే తన యాత్రను మధ్యలో ముగించుకుని బేస్ క్యాంప్‌కు వచ్చేసింది. ఈమెతో పాటు వచ్చిన వారు కూడా వాతావరణం అనుకూలించక వెనుదిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కాని జాహ్నావి మాత్రం వారం రోజుల పాటు బేస్ క్యాంప్‌లోని ఉండే ఆ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఏర్పాటు చేసి వచ్చింది.

ఇప్పటివరకు 60 లక్షలు ఖర్చు

పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్యలేమిటి అని అడిగితే ప్రధానమైనది వారి ఫిట్‌నెస్ అని చెబుతోంది. స్పాన్సర్స్ లేక చాలా మంది ఫిట్‌నెస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవటం లేదని, ఫిట్‌నెస్ శిక్షణ కోసం, ప్రయాణ ఖర్చుల కోసం నాతండ్రి ఇంటినే అమ్మేశాడని వెల్లడించింది. ఇప్పటివరకు నా కోసం 60 లక్షల రూపాయలు ఖర్చుచేశాడని, రా బోయో కాలంలో అంటార్కిటికా ప్రయాణానికి రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించింది. ఎంత ఖర్చయినా దేశం గర్వించే పర్వతారోహకురాలిగా రాణించటమే తన ఏకైక లక్ష్యమని చెబుతోంది.

తండ్రి అనారోగ్యం పాలైనా ప్రోత్సహించారు...

నేపాల్‌లో ట్రెక్కింగ్ వెళ్లాల్సిన సమయంలో తన తండ్రికి క్యాన్సర్ సోకింది. ఆయన కిమో థెరిపీ తీసుకుంటున్నాడు. ఈ చికిత్స వల్ల ఎంత బలహీనమైనా.. బ్యాస్ క్యాంప్‌కు వచ్చి తన ట్రెక్కింగ్ పూర్తయ్యేవరకు ఉన్నాడని, తన తండ్రే తనకు కొండంత బలమని చెబుతూ.. ప్రతి క్షణం ఆయన ఇచ్చే ఉత్సాహాం, ప్రోత్సాహం వల్లనే నాకు ఎలాంటి గైడ్ లేడని, 40 కిలోల బరువును మోస్తూ పర్వతాలను అధిరోహించగలుగుతున్నానని అంటుంది.

ప్రపంచ రికార్డును నెలకొల్పిన జాహ్నావి

గత ఏడాది డిసెంబర్ లో కోసిసుజ్కో, ఆస్ట్రేలియాలోని పది పర్వతాలను అధిరోహించి ప్రపం చ రికార్డును సృష్టించింది. ఆడపిల్లలు అందంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, అపుడే రాణిస్తారని అంటోంది. ప్రపంచంలోని ఏడు ఖండాలలోని ఎత్తయిన పర్వతశిఖరాలను ముద్దాడాల ని తహతహలాడుతున్న జాహ్నావి ఇందులో ఇప్పటికే మూడింటిని అధిరోహించింది. ఇపుడు ఆమె వయసు 15 ఏళ్లు. ఇంకో ఏడాదిలో మిగిలిన నాలుగు పర్వతాలను అధిరోహించేందుకు సమాయత్తమవుతోంది. కళ్లు తెరిచే కలలు కనం డి. ఏమవ్వాలనుకుంటున్నారో అది నెరవేరే వరకు ప్రయత్నం నుంచి తప్పుంచుకోవద్దని అంటుంది. పర్వతారోహణతో పాటు భవిష్యత్తులో సివిల్స్ రాసి సామాజిక సేవ చేస్తానని చెబుతోంది.

-ఆశాలత