మెయిన్ ఫీచర్

ప్రత్యక్ష ప్రాణదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్జరీ చేసేందుకు వెళుతున్న ఆ వైద్యుడిని రోగి తండ్రి అడ్డగించి ‘‘మీరు ఇంత ఆలస్యంగానా వచ్చేది? నా కుమారుడి స్థానం లో మీ కుమారుడు ఉంటే ఇలాగే వస్తారా? పేషెం ట్ అపాయకర పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారా?’’ అని నిలదీశాడు. ఆ రోగి తండ్రిని ఆ వైద్యుడి సముదాయిస్తూ..‘‘నేను ఆసుపత్రిలో లేను. అప్పటికీ కబురు అందిన వెంటనే వేగంగా బయలుదేరాను. నా పని నన్ను చేసుకోనివ్వండి’’ అని సమాధానమిస్తూ లోనికి వెళ్లాడు. కొన్ని గంటల తరువాత ఆ వైద్యుడు బయటకు వస్తూ.. ధ్యాంక్ గాడ్! నీ కుమారుడికి ఎలాంటి అపాయం లేదు అని చెబుతూ.. మీరు ఏదైనా అడగాలనుకుంటే నర్స్‌ను అడగండి అని అంటూ అదే చిరునవ్వుతో వేగంగా తన బ్లాక్‌లోకి వెళ్లిపోయాడు. ఆయనకెందుకు అంత అహంకారం!నా కుమారుడి పరిస్థితి గురించి చెప్పటానికి కూడా ఆయనకు టైమ్ లేదా అంటూ ఆ తండ్రి అక్కడే ఉన్న నర్స్‌పై చిందులు తొక్కాడు. అపుడు ఆ నర్స్ ఇచ్చిన సమాధానం ఆ వృద్ధ తండ్రిని ఆశ్చర్యానికి గురిచేసింది.‘‘ నిన్న డాక్టర్‌గారి అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఈరోజు అంత్యక్రియలు. మీ అబ్బాయి కండిషన్ గురించి ఫోన్‌లో చెబితే అంత్యక్రియల కార్యక్రమం మధ్యలో నుంచి వచ్చారు.’’ వైద్యవృత్తి గొప్పదనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఘటన అందరికీ తెలిసినదే అని కొట్టిపారేస్తాం. వాస్తవానికి భగవంతుడి తరువతా భగవంతుడు వైద్యుడు అని మన సనాతన ధర్మం సైతం చెబుతుంది. అందుకే ఆ వృత్తికి అత్యంత పవిత్రతను కల్పిస్తూ... ‘‘శరీరం శుష్కించిపోతున్నప్పుడూ, దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడూ ఔషధం గంగాజలంతో సమానమని, వైద్యుడు సాక్షాత్తు నారాయణుడే’’నని ఉద్ఘాటించింది. ఈ సృష్టిలో భగవంతుడి తరువాత మనిషి అత్యంత ఆరాధనగా రెండు చేతులెత్తి దణ్ణం పెట్టేది తెల్లకోటు వేసుకుని నడిచివస్తున్న ఆ వైద్యుడికే అనే విషయం మరువలేనిది. ఇటువంటి పవిత్రమైన వృత్తిని పరిగణలోకి తీసుకుంటూ కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ జన్మదినోత్సవాన్ని జాతీయ వైద్యుల దినంగా ప్రకటించటం జరిగింది. డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన జూలై 1,1882లో జన్మించి, అదే రోజు 1962లో మృతిచెందారు. ఎనిమిది పదుల రాయ్ తన వైద్యవృత్తికి ఎంతో వనె్నతెచ్చారు. అందుకే ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న సైతం ఇచ్చి సత్కరించారు.
మరే వృత్తిలోనూ లభించవు
ఇంతటి మహోన్నతమైన వృత్తిలో లభించే సంతృప్తి, గౌరవం మరే వృత్తిలోనూ లభించవు అంటే అతిశయోక్తి కాదు. వైద్యుడు రోగిని చూడగానే చిరునవ్వుతో ఆత్మీయంగా పలుకరించే విధానమే ఆ రోగిని సగం జబ్బు నుంచి దూరం చేస్తోంది. వ్యాధిగ్రస్తులు ఎన్నో ఆశలు పెట్టుకొని తమ వద్దకు వచ్చినప్పుడు వైద్యుడి ప్రసన్నమైన పలుకరింపు, ఆత్మీయమైన ఆదరణ సగం రోగాన్ని నయం చేస్తాయి. మందులు కన్నా వారి ప్రవర్తనే రోగులకు సగం స్వస్థత చేకూర్చుతుంది.
కాని దురదృష్టం కొద్ది వైద్యవృత్తి నేడు వ్యాపారమయం అయిపోయింది. లక్షలు వెచ్చించి మెడికల్ సీటు కొనుక్కుంటున్నాం కాబట్టి ఆ లక్షలు రాబట్టుకోవటానికి రోగులను డబ్బు కోసం పీడించటం పరిపాటైంది. రోగాన్ని నిర్థారించుకునే పేరుతో కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకున్నా విపరీతంగా టెస్ట్‌లు రాయటం వైద్యులకు పరిపాటైంది. ఫీజు ఇస్తేనే చేయి పట్టుకునే పరిస్థితి నేడు కనిపిస్తోంది. ధానార్జనే ధ్యేయంగా దయాహీనులుగా వైద్యులు మారి రోగులను పీఢించటం దారుణం.
నేటి పరిస్థితుల్లో స్వప్రయోజనాలు ఆశించకుండా వృత్తిని నిర్వర్తించమని ఎవ్వరూ అడగారు. కాని వృత్తి ధర్మాన్ని విస్మరించి రోగులను జబ్బుపేరుతో జలగాల్లా పీడించటం ఆ వృత్తికే కళంకం. చాలా మంది వైద్యులు రోగులకు ఎన్ని మందులు రాస్తే అంత మంచి వైద్యం అందించినట్లు భ్రమపడుతున్నారు. అందుకే డాక్టర్ విలియమ్ ఓస్లేర్ ఇలా అంటారు..
మందులు అవసరం లేకుండా రోగికి రోగం పట్ల అవగాహన కల్పించినవాడే నిజమైన వైద్యుడు. వైద్యులు ఈ విలువైన మాటను మన్నించి, మందులు రాస్తే సరిపోతుందనే భ్రమను వీడి వైద్యం అందిస్తే చిరునవ్వుల భారతావనిని అందించినవారవుతారు.
***
మన దేశంలో వైద్యుల పరిస్థితి

భారతదేశంలో ఒక వైద్యుడు 17000 మంది ప్రజలకు సేవలు అందిస్తున్నాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఒక వైద్యుడు వెయ్యిమందికి సేవలు అందించాలి.
బీహార్, మహారాష్టల్రలో వైద్య సేవలు దారుణంగా ఉన్నాయి. దేశంలో అల్లోపతి వైద్యులు 9.4 లక్షలు, డెంటల్ సర్జన్స్-1.54 లక్షలు, ఆయుష్ వైద్యులు 7.37 లక్షల మంది ఉన్నారు. వీరిలో సగం మంది మాత్రమే ఆయుర్వేద వైద్యులు ఉన్నారు.
దేశంలో 400 మెడికల్ కాలేజీలు ఉండగా 47,000 మంది వైద్యులు పట్ట్భద్రులవుతున్నారు.
**

దేశ ప్రధాని మోదీ సైతం
వినమ్రంగా చేసిన విజ్ఞప్తి

భగవంతుడి తరువాత భగవంతుడిగా భావించే రోగి మీ వద్దకు వస్తాడు. మీరు కూడా అలాంటి భావనతోనే వైద్యం చేయండి.
ప్రతి నెలా తొమ్మిదవ తేదీన ఒక రోగికి ఉచితంగా వైద్యం చేయాలనే సంకల్పం పెట్టుకోండి. ఎందుకంటే మనదేశంలో ప్రతి పదివేల మంది గర్భిణీలకు 174 మంది ప్రసూతి సమయంలో మృత్యువాత పడుతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని పేద గర్భిణీకి ఉచితంగా వైద్యం అందించి వారిలో చిరునవ్వులు పూయించండి. నేడు పెరుగుతున్న జనాభారీత్యా ప్రజలకు సంపూర్ణంగా వైద్య సేవలు అందటం లేదు. కాబట్టి వైద్యుల వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

-టి. ఆశాలత