మెయిన్ ఫీచర్

శ్రీశ్రీ ఋషి ఉవాచ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశ్రీ సాహిత్య నిధి పేరుతో శ్రీశ్రీ సమస్త అక్షరాక్షర సృజన ప్రతిభను ఒకమారు చిన్నాపెద్ద, మరన్నీ చిరుచిరుపొత్తాలుగా తేవడానికి విజయవాడలో ఒక శ్రీశ్రీ సాహిత్య చైతన్యకారక సంస్థ పూనుకుంది. విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ అనే ముద్రణాలయం కూడా ఉంది. మంచి అక్షర వ్యాపారమున్నూ చేస్తున్నది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం, వాళ్ళ మనోభీష్టం మనకెందుకు? ఎవరి కృషి వారిది? కృషి ఉంటే ఋషి కావచ్చని సినిమా పాట కూడా ఉంది కదా? శ్రీశ్రీ సాహిత్య నిధి ధారావాహిక ప్రచురణ ప్రణాళికలో భాగంగా 79వ ప్రచురణగా ఒక 50 పేజీల చిరుపొత్తం కొనే్నళ్ళు అంటే రెండేళ్లకిందట వచ్చింది. దాని ఊసే ఇప్పుడు మనకు కావాలి. తెలుగు సినిమాలగూర్చి ఈ చిరుపొత్తం ఒక చిన్న విజ్ఞానదాయక సర్వస్వం అని చెప్పాలి. సినిమాల పట్ల అభిమానం ఉన్నవాళ్ళందరూ ఇది తప్పక చదవాలి. అంతేకాదు తెలుగు భాషపై, తెలుగువారి జనజీవనంపై ఏమాత్రం, కొంచెంపాటి మమత్వమో, అభిమానమో ఉన్నవారు తప్పక చదవాలి. శ్రీశ్రీ మేధోల్బణం గూర్చి చక్కని అంచనా వేయటానికి ఈ (క్రౌన్?) 50 పేజీల పుస్తిక బాగా తోడ్పడుతుంది. దీనికి ‘శ్రీశ్రీ సినిమా వ్యాసాలు’ అని ప్రచురణకర్తలు పెట్టారు. 40 రూపాయల మూల్యముంచారు కాని నిజంగా అమూల్యమైన పుస్తకం. ఇంతగా ఊరించటం ఎందుకు? ఇందులోంచి కొన్ని ఉదాహరణలు లేదా ఉట్టంకింపులు ఇస్తే సులువుగా బోధపడుతుంది. సుమారు అర్ధ శతాబ్దమేర శ్రీశ్రీగా సినిమా సమీక్షల ఋషిత్వం ప్రస్ఫుటమవుతుంది ఇందులో. ఇందులో మొదటి రచన (లేదా చిరు వ్యాసం) సినిమా పరిశ్రమ- హిందూ దేశం- అనేది. తక్కిన వీర మార్క్సిస్టులందరిలాగా కాకుండా మన (తన) దేశాన్ని హిందూ దేశం అని ఒప్పుకుంటున్నాడు శ్రీశ్రీ. ఇందుకైనా ఆయనకు జయహో పలకవచ్చు. ఈ వ్యాసాన్ని ఇట్లా మొదలెట్టాడాయన.
‘‘హిందూ దేశం (అదుగో మళ్ళీ హిందూ దేశమంటున్నాడే యుగ ప్రవక్త కవి) ఇతర పరిశ్రమలలో ఎట్లాగున్నా సినిమా పరిశ్రమలో మాత్రం విడవకుండా పనిచేస్తోంది. కొద్దోగొప్పో లాభంకూడా పొందుతోంది. పడిపోయిన హిందూ దేశపుటార్థిక (మళ్ళీ అదేమాట- ముమ్మాటికి తప్పుకదూ!) స్థితికి ఇదొక ఆధార సూచకమని చెప్పవచ్చును.’’ ఇంకా ఇట్లా పొడిగిస్తున్నారు తరువాత పేరాలో.
‘‘సినిమా పరిశ్రమ ప్రపంచపు పరిశ్రమలన్నిటికంటె ఆర్థిక విషయంలో గాని, సారస్వతాభివృద్ధికర విషయంలోగాని అనేక రెట్లు గొప్పది. కాని మనవారు కేవలం స్వలాభానికే పాటుబడుచుండిరిగాని వేరు విషయమును గమనించుట లేదు. ఈ దేశపు ఫిల్ములయొక్క ఛాయాచిత్రవిధానము (-్ద్యఆ్యఘూఔ్దక) ఏమాత్రము భాగుగాలేదు. ఇదియొక పెద్ద లోటు. తర్వాత ధన వ్యయమునకు వెరచి ఏ పురాణ కథలనో, లేక నెవరిచేతనో తక్కువ డబ్బుకు వ్రాయించిన వాటినో తీసికొని వచ్చి స్వల్ప వేతనములకు వచ్చిన విద్యాగంథముగాని, అర్థజ్ఞానం గాని లేనటువంటి వారిచే నటింపచేసి ఫిల్ములు తయారుచేసి డబ్బు సంపాదించుచున్నారు.’’
ఇదండీ 1934నాటి శ్రీశ్రీగారి గ్రాంథిక శైలి.
సలక్షణ సంకీర్ణ వాక్య విన్యాసము.
‘నాటకాలలో పేరుకుపోయిన గాయకులంతా సినిమాలలో నాయకులవుతున్నారు. (అర్థమవుతున్నదా చదివే వారికి?) ‘మాటలాడని ఫిల్ములు తీయడంలోనే పరిపూర్ణతనొందని హిందూ దేశం టాకీలలో వొక్కసారిగా కంగారుపడి గంతేసింది. (మళ్ళీ హిందూ దేశమన్నారు ఋషి శ్రీశ్రీ.)
ఇక ఈ వ్యాసిక సంచలనంలో యోగివేమన, చంద్రలేఖ, సినిమాలో రచయితల స్థానం, అవ్వయార్, మనుషులు మారాలి, మన సినిమాలు, ఇత్యాది సమీక్షలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చదివి ఆహ్లాదం చెందవలసిన వ్యాసం, ‘అవినీతి’ (పుట 17) అనేది. ఇది ఈ పుస్తకంలో తొమ్మిదో వ్యాసం. ఇట్లా మొదలెట్టారు శ్రీశ్రీ ‘‘సినిమాల్లో మాత్రమే అవినీతి ఉందని నేను చెప్పడంలేదు. ఏనాడు కాంగ్రెస్‌వాళ్ళు స్వరాజ్యాన్ని హక్కు భుక్తంచేసుకుని ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారో అప్పుడే మన పతనం ఆరంభమయింది. (అంతకుముందు లేదని కాదు. కురుపుగా ఉండేదే నేటికి కుష్టుగా తయారైంది.) ఏ ఆఫీసుకి వెళ్లినా చాలు. అవినీతి, లంచగొండితనం, ఆశ్రీత పక్షపాతం, కులాభినివేశం వేయి పడగలువిప్పి వికట నాట్యం చేయటం మనకు రోజూ అనుభవమే. (పుట 17).
ఇక తరువాత సమాజంలో మద్యనిషేధం, వ్యభిచారం ఎంతగా ప్రబలిపోతున్నాయో నిదర్శనీకరించారు. ఆయన దార్శనికుడు కదా!
ఇక ఇంతలో వాల్మీకి మహర్షి జ్ఞాపకానికి వచ్చాడు శ్రీశ్రీకి. ఈ జ్ఞాపకానికి ఆయన ఇట్లా అక్షరీకరిస్తున్నారు. ‘‘నిజంగా ఇవాళ వాల్మీకి ఉంటే ఇప్పటి యథాశక్తి పతివ్రతలను గురించి మరో రామాయణం రాసేవాడు. వాల్మీకి కన్నా గొప్పవాణ్ణని చెప్పుకునే విశ్వనాథవారు మళ్ళీ ఆ పాత అబద్ధాలనే రాస్తారుగాని, మన కళ్ళెదుట కనపడుతున్న కఠోర సత్యాల జోలికిపోరు. నేటి అన్యాయాలను దుయ్యబడుతూ, తూర్పారబడుతూ ఎవళ్ళైనా రాస్తే వాళ్ళది ఈయనగారి దృష్టిలో నక్సలైట్ సాహిత్యం (పుట) గుర్రాజు పెళ్ళిలో సర్రాజుకొక పోచ అన్నట్లు విశ్వనాథ నక్సలైట్ బద్ధవిరోధి అని సిద్ధాంతీకరించారు శ్రీశ్రీ.
‘మన సినిమాలు’ అనే వ్యాసంలో ‘సమాజ క్షేమానికి హానికరమైన వ్యక్తి స్వాతంత్య్రానికి అర్థంలేదు. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. సమాజక్షేమాన్ని సంరక్షించాలి అంటున్నారు’ శ్రీశ్రీ. ఈ మాటలు ఆయన 1971లో రాశారు. అంటే సుమారు ఇంకో మూడేళ్ళలో అర్ధశతాబ్దం కింద అన్నమాట. మార్క్సిస్టులు, నక్సలైటులో ఈ ఆరు దశాబ్దాలలో సంఘాన్ని ఏమైనా పాప పంకిలక్షాళితం చేశారా?
సమాజంలో మార్పులు తెస్తాను. మార్పులువస్తాయి. అట్లానే ఫిల్ము ప్రపంచంలో కూడా వస్తాయి రాక తప్పదు. ఒకప్పుడు చలనచిత్ర రంగంలో 75 శాతం నిజాయితీ ఉండేది. 25 శాతం అవినీతి ఉండేది. ఇప్పుడీ లెక్క తారుమారైంది. లోకం బాగుపడాలంటే ఫిల్ము పరిశ్రమను జాతీయం చేయాలి. సామ్యవాదం నెలకొనాలి అన్నారు శ్రీశ్రీ. ఇవి ఋషి వాక్కులు కావా?

- అక్కిరాజు రమాపతిరావు