మెయిన్ ఫీచర్

నాలుక మంట ... తీరని తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవకాయ తిన్నప్పుడు ఆ కారానికి మనకు మంట పుడితేనే చాలా బాధగా ఉంటుంది. ముద్ద పప్పు తిన్నా మంట కలిగే వారి జీవితాలు ఇంకెంత బాధాకరంగా వుంటాయో ఊహించుకోండి. మజ్జిగ అన్నం తిన్నా మంట/నొప్పి పెట్టేవారికి తినాలంటేనే భయం వేస్తుంది, బ్రతకాలంటేనే బాధేస్తుంది. చాలామంది ఆ మంటకి భయపడి తిండి మానేసి నీరసంతో మంచాన పడతారనడంలో ఏ అతిశయోక్తి లేదు. అసలు ఈ మంట కలగడానికి గల కారణాలేంటో చూద్దాం.
నోట్లోని ఏ భాగం మంట / నొప్పికి లోనవుతోంది?
కొంతమందిలో మొత్తం నోరు, కొందరిలో బుగ్గలు, చాలా శాతం మందిలో నాలిక, చాలా తక్కువ మందిలో అంగుడి ఈ మంట లేదా నొప్పికి గురవుతుంటాయి.
ఇలా జరగడానికి కారణాలు?
కారణాలు చాలానే ఉంటాయి. శ్రద్ధగా నోటిని పరీక్షించాల్సి వుంటుంది. ఎర్రని ప్రదేశాలకోసం, ఉమ్మినీరు ఉత్పత్తి, ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కోసం, పుండ్లకోసం, నాలికమీద పొక్కుల కోసం, నాలికమీద తొర్రెలకోసం, నాలిక ఎర్రగా, నున్నగా ఉందా లేదా మామూలుగా గరుగ్గా వుందా అని పరీక్షించాల్సి వుంటుంది. ఇవి నోట్లో కనిపించే కారణాలైతే శరీరంలో కనిపించే కారణాలు కొన్ని ఉంటాయి. రక్తహీనత, విటమిన్‌ల లోపం, కొన్ని మందుల ప్రభావం, రోగ నిరోధక శక్తి లోపాలు (జషఆ్యనిౄౄఖశజఆక) ఇలాంటి కారణాలు కావొచ్చు.
వీరిలో అతి పెద్ద చికాకు కలిగించే విషయం ఏంటంటే, చాలామందిలో ఏ లోపాలు, కారణాలు కనిపించవు. దీనిని బర్నింగ్ వౌత్ సిండ్రోమ్ అంటారు. కారణాలు తెలిసినపుడు చికిత్స చెయ్యడం కష్టం అవుతుంది.
ఎవరిలో వస్తుంది?
ఎవరిలోనైనా రావొచ్చు. కాకపోతే ముసలివారిలో ఎక్కువగా ఈ మంట/నొప్పి కనిపిస్తుంటాయి. ఆడవారిలో మెనోపాజ్ తరువాత హార్మోన్ల లోపంవల్ల ఈ మంట కలగొచ్చని ఓ నమ్మకం. ఈ మంట నొప్పి ఉన్నవారిలో చాలామందికి రుచులు లేక వాసనలు తెలియకపోవడం మనం గమనించగలం.
దీనికి చికిత్స
కారణాలు తెలిసినవారిలో ఆ కారణాలకి / లోపాలకి తగిన చికిత్స చెయ్యాలి. ఏ కారణం / లోపం లేనివారిలో చికిత్స చెయ్యడం కష్టం అవుతుంది. వీరిలో వివిధ రకమైన మందులు , విధానాలని ప్రయత్నిస్తారు. ఏ మందువల్ల ఉపశమనం కలుగుతుందో తెలుసుకొని ఆ మందుని వాడే ప్రయత్నం చేస్తారు.
నేను ప్రత్యేకంగా నమ్మేది ఏంటంటే ఏ మందులు వాడినా ఎన్ని వాడినా ఉపశమనం వెంటనే కలగడం అరుదు. 10 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ 10 లేక 14 రోజులు కూడా మంట నొప్పి లేకుండా హాయిగా తినాలంటే ఓ మత్తు (తిమ్మిరి) కలిగించే మందుని మన నోట్లో ఎక్కడ మంట లేక నొప్పి కలుగుతుందో అక్కడ తినే రెండు మూడు నిమిషాల ముందు రాస్తే ఆ ప్రదేశంలో తిమ్మిరి కలిగి తినేప్పుడు పెద్ద బాధ కలగదు. ఈ తిమ్మిరి కలిగించే మందుని వాడుతూ మిగతా మందులు శాశ్వత విరుగుడు కోసం వాడాల్సి వుంటుంది.
ఈ సృష్టిలో ఎన్నో రోగాలు ఉన్నాయి. ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా అని కొన్ని చూసినపుడు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని జరిగిన కథలు వింటే ఇలా కూడా జరగచ్చా అని గగుర్పాటు కలుగుతుంది. పాటకి ప్రాణం పోసే గొంతు ఆమెది. పాడడమే జీవితం అని నమ్మే మనసు ఆమెది. పాటలు పాడి ఎంతో మందిని తన గానమాధుర్యంలో తడిపిన గొంతు చిన్నవయసులోనే అత్యాశ్చర్యంగా మూగపోయింది. పాటే కాదు మాట కూడా రాకుండా ఆమె నోరు వెలిసిపోయింది. ఆమె పేరు షీలా చంద్రా. బ్రిటన్‌కి చెందిన భారతీయ వనిత. ఆమెకి వచ్చిన జబ్బు పేరు బర్నింగ్ వౌత్ సిండ్రోమ్. నవ్వినా, ఏడ్చినా, మాట్లాడినా, తిన్నా తీవ్రమైన మంట. నవ్వు పెదాలతోనే కాదు, కళ్ళతో కూడా నవ్వొచ్చు, బయటికి కనిపించేలా మనసులో కూడా నవ్వొచ్చు అని ప్రపంచానికి చూపింది. ఇలాంటివారి గురించి చదివినపుడు మనసు నిబ్బరపడుతుంది. కష్టాలకి ఎదురెళ్లగలమన్న నమ్మకం మనకీ కలుగుతుంది. ఇలాంటి విచిత్రమైన రోగాలతో బాధపడుతున్న బాధితులకి మందులతోపాటు, ధైర్యాన్నీ, ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాలని నేను నమ్ముతాను. మందు శారీరక బలాన్ని ఇస్తే, ధైర్యం , ప్రోత్సాహం మానసిక బలాన్ని ఇస్తుంది. వచ్చేవారం మరో ప్రయోగంతో కలుద్దాం.

***

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com