మెయిన్ ఫీచర్

కహానీకిలకు... కాలం చెల్లింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** సినిమా వాళ్ళ మ్యాజిక్కులు జిమ్మిక్కులు పనిచేయడం లేదు. అసలు పట్టించుకోవడం లేదెవరు. మా పిక్చర్ సూపర్‌గా ఉంటుందహో అని టీవీల్లో దండోరా వేస్తే చూసి నవ్వుకుంటున్నారంతే.. మా‘పిక్చర్’ని మించిన ‘మిక్చర్’ ఇంతవరకూ రాలేదని చెబుతుంటే విని ఊరుకుంటున్నారంతే. మా చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి నెగెటివ్ టాక్ తెచ్చే కుట్ర పన్నుతున్నారంటూ.. ప్రేక్షకుల సానుభూతికోసం కొత్త ఎత్తుగడ వేస్తే... ప్చ్! అయ్యో పాపం అలానా!...అంటూ పెదవి విరుస్తున్నారంతే.
కాబట్టి దర్శక నిర్మాతలబాకా రాయుళ్ళారా... జర, మైండ్‌సెట్ మార్చుకోండి. సినిమాలకు పబ్లిసిటీ అవసరమే, కాదనరెవరు? అలాగే నాలుగు మంచి ముచ్చట్లూ సినిమా గురించి చెప్పాలి, వద్దనరెవరు. అందుకే ‘కహానీ’లు మానేసి... ‘సరుకు’ గురించి సంచీలు విప్పండి. నచ్చిందా, ప్రేక్షకుడు బాక్సాఫీసుని నింపుకుపోతాడు. గుచ్చిందా, చెప్పేదేముంది నరుక్కుంటూపోతాడు.
==================

సినిమా వినోదమే అయినా అదొక విచిత్రమేళం. విలక్షణ రంగం. రంగుల ప్రపంచమే అయినా సరికొత్త రంగులకోసం పరుగులు పెట్టాల్సిందే. సినిమాలో నటీనటులు నటిస్తే.. తెరవెనక అన్ని ఫ్రేములూ సినిమా ప్రమోషన్‌కోసం జీవించాల్సిందే.
వాస్తవానికి సినిమా మేకింగు పూర్తయ్యేవరకు... సినిమా తాలూకు ఏ విషయమూ బయటకు పొక్కనివ్వని దర్శక నిర్మాతలు... ఇక సినిమా విడుదలకు రెడీ అయ్యిందంటే చాలు. వారి పాట్లు చూడాలి. నా సామిరంగా... మీరు సినిమా చూడండి చాలు... కొండమీది కోతిని కూడా దింపేస్తాం. అనే వీర లెవెల్లో దంచుడు దంచేస్తున్నారు. తమతమ సినిమాకు సంబంధించిన మ్యాటరు భలే పసందుగా ఉంటుందంటూ... ఎక్కెడెక్కడికో అంతరిక్షానికి తీసుకెళ్లి బోలెడంత హైప్ సృష్టిస్తూ, తెగ హడావుడి చేసేస్తూ, భలే భలేగా ఊదరగొట్టేస్తున్నారు. మాలాంటి ‘గోప్ప’ సినిమా హాలీవుడ్‌లోనే రాలేదన్నంతదిగా (అవును మరి! ఇలాంటిలాంటి కాకరపీచు కహానీల సినిమా హాలీవుడ్‌లో ఎందుకొస్తుంది, భయ్యా! రాదుగా) బిల్డప్ ఇస్తూ.. మా హీరో ఆస్కార్ లెవెల్లో నట విన్యాసం చేసాడన్నంతిదిగా తెగ గోకేస్తూ... ప్రేక్షకులకు వీరలెవల్లో పల్స్‌రేటు పెంచే ప్రయత్నంలో తలమునకలై పోతున్నారు. ఎంతటి అబద్ధానికైనా శ్రీకారం చుడుతున్నారు. సరే... వలలో చేప పిల్ల పడ్డట్టు, సినిమా మోజుతో ప్రేక్షకుడు వారి ప్రకటనల మాయలో పడిపోవడం సహజమేకదా! అలా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల పాట్లు వీడియో తీసి మరీ చూడాలి తస్సాదియ్యా! థియేటర్లో టికెట్టు చించుకున్న ఖర్మానికి చొక్కా చించుకునే స్థితికి మారిపోతున్నాడు. శాపవశాత్తూ భూమీద.. అదీ తెలుగునేలపై... అతి అంచనాలతో వచ్చి బొక్కాబోర్లా పడి, బాక్సాఫీసుకి చిల్లులుపెట్టిన సదరు సినిమా హీరో వీరాభిమానులే తిరస్కరించబడే లాంటి చిత్రము చూడాల్సి వచ్చిన (్భగ్యము కలిగిన) ప్రేక్షకుడిగా పుట్టినందుకు...!
ఇక ఏయే దర్శక నిర్మాతలు తమ కొత్త సినిమా గురించి ఎంత ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి వెర్రెత్తిస్తారో ఓసారి అలాఅలా తిప్పేసి చదివేసి ఆనందించేసి తరిద్దామా? రెడీ మరి!
ఊదండి బాకా
ఇటీవల విడుదలైన మా సెనే్సషనల్ సినిమా ‘బాకా రాయుడు’ ట్రైలర్, టీజర్, ఆడియోలతోపాటు అబ్బబ్బా పోస్టర్లకు కూడా విపరీతమైన (తుఫానంత) స్పందన వస్తోంది. దీంతో సినిమాపై భారీ (ఏనుగంత) అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ సంబరాలు జాతరనుతలపోస్తూ అంతరాన్ని చుంబిస్తున్నాయి. సినిమా విడుదలైందా పండుగే పండుగ ప్రేక్షకులకు... కాచుకోండి! ఫలానా విడుదల తేదీ కోసం... త్వరలోనే ప్రకటిస్తాం.
కొట్టండి డబ్బా
ఈ ‘రొడ్డకొట్టుడు’ సినిమా కథ మీరెప్పుడూ విని ఉండరు. అంత వైవిధ్యంగా ఉంటుంది. ఇంటర్‌వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ మిమ్మల్ని (సీట్లోంచి బయటకు) కదిలిస్తుంది. అలాగే హీరో పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా (కొండంత) నిలవబోతోంది. ఇప్పటివరకు ఏ హీరో పోషించని పాత్ర మా హీరోగారు ఛాలెంజ్‌గా తీసుకొని అదుర్స్ అనిపించేలా నటించేసారు. బహుశా ఈయేటి ఉత్తమ హీరో జాతీయ అవార్డు రావచ్చని సర్వత్రా వినపడుతున్నాయి. (ఇదేందబ్బా! సినిమానే ఇంకా రిలీజ్ అవాలా! ఎట్టెట్టా ఎవరు సెప్పినట్టీ అవార్డు ముచ్చట?)
చేయండి భజన
మా ‘్భజన్‌రావు’ సినిమాలో హీరోగారు చేసే డాన్సులు, ఊరమాస్ ఫైట్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి హుషారు (పూనకం) తెప్పిస్తాయి. ఈలలతో థియేటరంతా ఊగిపోతుంది. పాపం డాన్స్ మాస్టారైతే పిచ్చి పిచ్చిగా టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే మా హీరోగారి లెవల్లో (చెత్తచెత్తగా చేతులూ కాళ్ళు అటూఇటూ ఊపే) డాన్స్ (గంతులు) కంపోజ్ చేయలేక! హీరో గారి మూవ్‌మెంట్స్ స్పీడ్‌కి తట్టుకోలేకపోయాడు కొరియోగ్రాఫర్. (వాయించండ్రా వీణ... గూబ గుయ్యిమందా? మనమేం చేయలేమంతే!) నిజం చెప్పాలంటే మా హీరోగారు స్ప్రింగ్ మింగినట్లు ఆ డానే్సంటి?... అబ్బ అబ్బబ్బా! (కొంకు కొంకు).
వాయించండి తబలా..
మా ‘తబలా తమ్ముడు’ సినిమాకు ఊహించని రెస్పాన్స్‌వస్తోంది. సర్వత్రా పాజిటివ్ టాక్ (రీసౌండ్ వచ్చేలా) వినిపిస్తోంది. ప్రీమియర్ షోల ఫస్ట్ రిపోర్ట్! (దిక్కులు) అదిరిపోయేలా వస్తున్నాయి. బహుశా బాక్సాఫీసుని సరదా సరదాగా క్యాష్‌తో ఏ వీరలెవల్లో బద్దలు కొడుతుందో ఏమో? అయిదువందల కోట్ల (తక్కువైందా! మరో అయదేస్కో.. వెయ్యకోట్ల) సినిమాగా మారబోతోందని ట్రేడ్ వర్గాల అంచనా! మిగతా సినిమాల కన్నా మా సినిమా రికార్డుల మీద రికార్డులు అలా ఎన్నో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి! (అహహ!.. చెవులో పువ్వెట్టండీ బాబూ.. నుదుట బొట్టెట్టండీ..!)
పోస్టరు చూసి సినిమా బొమ్మను అంచనా వేసే మహా మేధావి వర్గపు ప్రేక్షకులున్న కాలమిది! ప్రేక్షకులిలాంటి కల్లబొల్లి కబుర్లు విని థియేటర్లకు వచ్చే కాలం చెల్లింది. వాళ్ల దగ్గర దర్శక నిర్మాతల ప్లస్ బాకారాయుళ్ల కాకర కాయ సోది కబుర్ల పప్పులేం ఉడకడం లేదు.
సినిమా వాళ్ళ మ్యాజిక్కులు జిమ్మిక్కులు పనిచేయడం లేదు. అసలు పట్టించుకోవడం లేదెవరు. మా పిక్చర్ సూపర్‌గా ఉంటుందహో అని టీవీల్లో దండోరా వేస్తే చూసి నవ్వుకుంటున్నారంతే.. మా‘పిక్చర్’ని మించిన ‘మిక్చర్’ ఇంతవరకూ రాలేదని చెబుతుంటే విని ఊరుకుంటున్నారంతే. మా చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి నెగెటివ్ టాక్ తెచ్చే కుట్ర పన్నుతున్నారంటూ.. ప్రేక్షకుల సానుభూతికోసం కొత్త ఎత్తుగడ వేస్తే... ప్చ్! అయ్యో పాపం అలానా!...అంటూ పెదవి విరుస్తున్నారంతే.
కాబట్టి దర్శక నిర్మాతలబాకా రాయుళ్ళారా... జర, మైండ్‌సెట్ మార్చుకోండి. సినిమాలకు పబ్లిసిటీ అవసరమే, కాదనరెవరు? అలాగే నాలుగు మంచి ముచ్చట్లూ సినిమా గురించి చెప్పాలి, వద్దనరెవరు. అందుకే ‘కహానీ’లు మానేసి... ‘సరుకు’ గురించి సంచీలు విప్పండి. నచ్చిందా, ప్రేక్షకుడు బాక్సాఫీసుని నింపుకుపోతాడు. గుచ్చిందా, చెప్పేదేముంది నరుక్కుంటూపోతాడు.
మరి తస్మాత్ జాగ్రత్త! ఆవకాయ లోపల దాచి, బిర్యానీ ఉందంటూ ఊరికే ఊరించకండి. పెరుగు భోజనమైనా చాలు.. కమ్మగా అన్పిస్తే ప్రేక్షకుడు అదే విందు భోజనమని తరిస్తాడు.
*

-ఎనుగంటి వేణుగోపాల్