మెయిన్ ఫీచర్

‘నిర్భయ’త్వం ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ సంఘటన ఆసేతుహిమాచలం మహిళల్ని కదిలించి వేసింది.. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా నారీలోకం
నిరసన గళం విప్పి కదం తొక్కింది.. ఆందోళన కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో కేంద్ర ప్రభుత్వం జడత్వాన్ని
వదిలించుకుని మహిళలకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.. కేసులు, శిక్షల సంగతలా ఉంచితే- లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అతివలు ఇపుడు ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు.. ఇదంతా ‘నిర్భయ’ ఉదంతం తర్వాత దేశంలో
చోటు చేసుకున్న పరిణామాలు..
***
సరిగ్గా మూడేళ్ల క్రితం ( డిసెంబర్ 16, 2012) దేశ రాజధాని దిల్లీ మహానగరంలో రాత్రి వేళ బస్సులో తన స్నేహితుడితో కలిసి వెళుతున్న 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని (నిర్భయ)పై ఆరుగురు ఆగంతకులు దాడి చేసి, శారీరకంగా హింసించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సామూహిక అత్యాచార సంఘటన వెలుగు చూసిన వెంటనే దిల్లీతో పాటు అనేక ప్రాంతాల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నష్టనివారణ చర్యలను ప్రారంభించిన పాలకులు ‘నిర్భయ’ను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న తుది శ్వాస విడిచింది. నిర్భయ కేసులో ఆరుగురు నిందితులపై కేసులు నమోదు కాగా, విచారణ దశలో ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగతా నిందితుల్లో నలుగురికి జీవితశిక్షలు పడగా, మైనర్ అని భావించి ఓ వ్యక్తిని జువనల్ హోంకి తరలించారు. నిర్భయ కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ మహిళలు దే శవ్యాప్తంగా ఉద్యమించడంతో లైంగిక వేధింపుల నిరోధానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ సిఫారుసులను పరిగణనలోకి తీసుకున్నాక, పార్లమెంటు ఆమోదం అనంతరం 2013లో ‘నిర్భయ చట్టం’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అత్యాచార కేసుల్లో బాధితులను ఆదుకునేందుకు వంద కోట్ల రూపాయలతో కేంద్రం ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలను ఆదుకునేందుకు నిర్భయ తల్లిదండ్రులు ‘నిర్భయ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. లైంగిక నేరాలు, అత్యాచారాల కేసులు మన దేశంలో కొత్తేమీ కాకున్నా- నిర్భయ ఉదంతం మాత్రం సంచలన ఉద్యమానికి దారిచూపింది. దేశవ్యాప్తంగా మహిళలను సంఘటితం చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా- ‘నిర్భయ చట్టం’ కూడా ‘కోరలు లేని పులి’లాంటిదని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా లైంగిక వేధింపులు, అత్యాచారాల సంఖ్య అసంఖ్యాకంగా పెరగడం, కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం, నిందితులకు శిక్షలు పడుతున్న దాఖలాలు లేకపోవడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.
దేశ రాజధానిలోనే...
నిర్భయ ఉదంతం చోటు చేసుకున్న దిల్లీలో మహిళలకు భద్రత ప్రశ్నార్థకమైంది. దేశానికే కాదు, అత్యాచారాలకు సైతం ఈ నగరం రాజధానిగా మారిందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. దిల్లీలో రోజుకు ఆరు అత్యాచారాలు, 14 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయని జాతీయ నేరగణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) చెబుతోంది. పదేళ్లలోపు వయసు కలిగిన బాలికలపై 2013-14లో 364 అత్యాచారం కేసులు ఈ నగరంలో నమోదయ్యాయి. 2012 డిసెంబర్ నుంచి 2014 మార్చి వరకూ 1,492 లైంగిక నేరాల కేసులు నమోదయ్యాయి. 90 శాతం కేసుల్లో నిందితులంతా బాధితురాళ్లకు పరిచయస్తులేనని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దిల్లీలో 1,551 అత్యాచార కేసులు, 3.076 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులు అందిన ప్రతిసారీ ‘నిర్భయ చట్టం’ కింద కేసులు పెడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా, కేసులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా కొలిక్కిరావడం లేదు.
నేరాల్లో వృద్ధి...
దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. 2013లో అత్యాచారం కేసులు 14.4 శాతం మేరకు పెరిగాయి. ఈ తరహా కేసులకు సంబంధించి 2013లో 48,193 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టులకు సంబంధించి 2013లో 37.7 పెరుగుదల చోటుచేసుకుంది. 2014లో దేశం మొత్తమీద మధ్యప్రదేశ్‌లో అత్యాచారాల కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయి. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో 5,076 రేప్ కేసులు నమోదు కాగా, 3,759 కేసులతో రాజస్థాన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులే కాదు.. మహిళల్ని హత్య చేయడం, కిడ్నాప్‌లు, అక్రమంగా తరలించడం, బలవంతంగా వేశ్యావృత్తిలోకి దింపడం, వరకట్నం వేధింపులు, బాలికలపై లైంగిక దాడులు వంటివి దేశవ్యాప్తంగా అధికం అవుతున్నాయి. విద్యాసంస్థల్లో సైతం అమ్మాయిలపై లైంగిక వేధింపులకు సంబంధించి అనునిత్యం అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి దిల్లీ నగరంలో 2014లో 15,265 కేసులు, 2013లో 12,888 కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసులు ఎంపిలో 15,170 కేసులు, మహారాష్టల్రో 15,029 కేసులు, యుపిలో 12,425 కేసులు, రాజస్థాన్‌లో 10,149 కేసులు నమోదయ్యా. సామూహిక అత్యాచారాల సంగతి చూస్తే యుపిలో గత ఏడాది 573, రాజస్థాన్‌లో 414, దిల్లీలో 147 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది మహిళల కిడ్నాప్‌లకు సంబంధించి 58,592 ఫిర్యాదులు రాగా, యుపిలో 10,628 కేసులు, ఎంపిలో 5,738 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 5,062, బిహార్‌లో 4,760, దిల్లీలో 4,227 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు ఘోషిస్తున్నాయి.
*

నిర్భయ కేసులో దోషులు