మెయిన్ ఫీచర్

షడ్రుచుల సంగమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చైత్రమాసే జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని, వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ’- అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి రుజువు వసంతం. నెల చైత్రం.. తిథి పాడ్యమి.. ఆదివారం. అంటే ఆ సమయంలో ఈ సృష్టి ప్రారంభమైందని లేదా ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. క్షయ అంటే నాశనమయ్యేది. ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే ఏడాది అన్నమాట. కాబట్టి చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయం కాలంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా నిర్ణయిస్తారు. చైత్రశుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం ప్రారంభమైన చైత్ర శుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ రస జగత్తును సృష్టించాడు. కాలగణన, గ్రహ నక్షత్ర, రుతు మాస వర్షాలను, వర్షాధిపులను ప్రసరింపజేశాడు. తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాలగమనంలో మార్పులు సహజం. కల్పంలో యుగాలు. ఈ యుగాలు మారేకొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృత్తం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఆ పేర్ల వెనుక భిన్న వాదనలు, కథనాలు ఉన్నాయి. ఓ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో వుంది. దక్షుడు కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు. హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ పండుగను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాది పేరుతోనూ, మహారాష్టల్రో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీగానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌గానూ జరుపుకుంటారు. అయితే పేర్లు మారినా పండుగలను జరుపుకోవడంలో మాత్రం పెద్దగా తేడాలు లేవు. ఇక మన తెలుగువారు మొదటి పండుగగా భావించేది ఉగాది. సంప్రదాయబద్ధంగా ప్రతి ఇంటిలో ఘనంగా జరుపుకునే పండగ. జీవితంలో తీపి, చేదు, పులుపు లాంటి ఎమోషన్స్ ఉన్నాయని ఈ ఉగాది పచ్చడి చెబుతుంది. అందుకే ఈ పచ్చడిలో అన్ని రకాల అంటే షడ్రుచులతో చేస్తారు. జీవితం కూడా అంతే అని దీని భావన. ఇక మన తెలుగు సంవత్సరాదిని మన సినిమా తారలు కూడా భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. ఉగాది పచ్చడిని రుచి చూస్తారు. మరి ఈ ఉగాదిని తారలు ఎవరెవరు ఎలా జరుపుకుంటారో చూద్దాం..

అనుష్క: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సౌత్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క బాహుబలి సినిమాలోని దేవసేనగా రెండు షేడ్స్‌లో నటించి తనకు ఎదురేలేదని నిరూపించింది. ఆ పాత్ర చేయడానికి ఆమె తప్ప మరెవరు లేరనే స్థాయిలో అదరగొట్టింది. ఆ తరువాత భాగమతిగా అటు బాక్సాఫీస్‌పై తన సత్తా మరోసారి చాటింది. ప్రస్తుతం స్లిమ్ అవతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్న అనుష్క మళ్లీ గ్లామర్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఉగాది పండుగ అంటే తనకు ఏంతో ఇష్టమని.. తాను కన్నడ అమ్మాయిని కాబట్టి ఉగాది పండగ బాగా జరుపుకుంటామని చెప్పింది. తెలుగువారు ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడం, ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాల మధ్య ఆనందంగా జరుపుకోవడం బాగా నచ్చుతుందని, ఈ పండగ స్పెషల్‌గా ఉగాది పచ్చడి అంటే ఇష్టమని పేర్కొంది.
తమన్నా: దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తమన్నాకు సౌత్‌లో మంచి క్రేజ్ ఉంది. అందరి హీరోలతో సినిమాలు చేసిన తమన్నాకు ఈమధ్య కాస్త వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్లీ తన క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్న తమన్నా ఉగాది గురించి చెబుతూ.. నేను సింధీల పిల్లని. మా న్యూ ఇయర్ కూడా ఈ రోజే! దీనిని మేం ‘చేటీ చంద్’ అంటాం. కుంకుమ పువ్వు కలిపి చేసే సాప్రాన్ రైస్, చక్కెర పొంగలి, రవ్వ కేసరి చేస్తాం. గణపతి, మాతాదేవికి పూజ చేస్తాం. తర్వాత అందరం కూర్చుని హాయిగా భోజనం చేస్తాం. ఈ పండగ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది.
శృతిహాసన్: తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఈమధ్య ఏ సినిమాకు ఓకె చెప్పడంలేదు. ఈమధ్యే కమల్‌హాసన్ తెరకెక్కించిన శభాష్ నాయుడు సినిమా ఒక్కటే చేసింది. ప్రస్తుతం ఈమె ఓ మ్యూజిక్ ఆల్బం విడుదల చేసే పనిలో పడింది. ఉగాది పండుగను తాము కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని, ఈ రోజు కుటుంబం అంతా కలిసి ఆనందోత్సాహాలతో నిర్వహిస్తామని, ఉగాది సందర్భంగా వండే ప్రత్యేక వంటకాలు బాగా ఇష్టమని చెప్పింది శృతి.
రకుల్‌ప్రీత్‌సింగ్: టాలీవుడ్‌లో చాలా స్పీడ్‌గా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఓవైపు స్టార్ హీరోలతో జత కడుతూనే మరోవైపు కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. ప్రస్తుతం తమిళంలో బిజీగా వున్న రకుల్ ఉగాది గురించి ఏమి చెప్పిందో తెలుసా.. ఉగాది గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఢిల్లీలోనే అయితే ముంబైలో వున్నపుడు అక్కడ గుడిపడ్వా పేరుతో జరుపుకుంటారు. తెలుగు పరిశ్రమకు వచ్చాక అసలు ఈ పండగ గురించి తెలిసింది. ఉగాదిని తెలుగు ప్రజలు చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ రోజు చేసే ఉగాది పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. దాంతోపాటు ఆ రోజు చేసే ప్రత్యేక వంటకాలు కూడా బాగా నచ్చుతాయి.
‘కలర్స్’ స్వాతి: తెలుగు అమ్మాయి స్వాతి హీరోయిన్‌గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో కంటే తమిళంలోనే ఈమెకు ఎక్కువ పేరు. మరి తెలుగు పిల్ల స్వాతి ఉగాది గురించి చెప్తూ- ఉగాది పండగకు మా బంధువులు అందరూ ఇంటికి వస్తారు. మేం చిన్నప్పటినుంచీ మన రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పటికీ పండగలన్నీ బాగానే తెలుసు. ఉగాది పచ్చడి బాగా ఇష్టం. షడ్రుచుల సమ్మేళనం హాయిగా వుంటుంది. అలాగే నాకు స్వీట్స్ బాగా ఇష్టం. బొబ్బట్లు బాగా లాగిస్తా అని చెప్పింది.
అంజలి: తెలుగు భామ అంజలి ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో స్లిమ్ అవతారంలో మళ్లీ అవకాశాలు పట్టేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి తెలుగు భామ అంజలి ఉగాది గురించి ఏమంటుందో చూడండి.. నేను తెలుగు అమ్మాయినే కాబట్టి చిన్నప్పటినుండి ఉగాది అంటే చాలా ఇష్టం. ఈ రోజు అందరూ సాంప్రదాయబద్ధంగా పండగ జరుపుకోవడం చాలా నచ్చుతుంది. రకరకాల పిండివంటలు చేస్తాం. పొద్దునే్న భక్తితో స్నానం చేసి పూజ చేస్తాం. ఆ తర్వాత అందరం కూర్చుని పిండివంటలని ఓ పట్టుపడదాం అని చెప్పింది.
మరి ఈ పండగలను ఇష్టపడే హీరోయినే్లనా.. హీరోలు కూడా ఉన్నారు.
రానా: నేను పుట్టి పెరిగింది సిటీలోనే అయినా మన పండుగలు, సంప్రదాయాలు అన్నీ నాకు తెలుసు. వాటికి మా ఇంట్లో ఎంతో విలువ ఇస్తారు. ఇక ఉగాది అంటే మన తొలి పండుగ కదా.. ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. చాలామంది కొద్దిగా తీసుకుంటారు. నాకు అలా సరిపోదు.. ఓ గ్లాసు నిండా తీసుకుని లాగించేస్తా. అంత ఇష్టం నాకు.
ఇక మిగతా హీరోయిన్స్ కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాకే ఉగాది గురించి బాగా తెలిసిందని చెప్పారు. ఏదేమైనా తెలుగు ప్రజలు సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే ఉగాది మనందరికీ సంతోషాలకు యుగాది కావాలని కోరుకుందాం.

-శ్రీ