మెయిన్ ఫీచర్

టెక్నాలజీ మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ పెరగడం మంచిదే.. టెక్నాలజీ పెరిగితేనే మానవ అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడి విన్నాం కదా.. ఇప్పుడు ఈ టెక్నాలజీ మాయలో పడి మనుషులు విలువలు వదిలేస్తున్నారు. తన క్రేజ్ కోసం అవతలివాళ్లపై బురద చల్లే ప్రయత్నాలు ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా సినిమా స్టార్స్, పబ్లిక్ ఫిగర్స్ విషయంలో ఈ దారుణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. తాజాగా తెలుగు హీరో శ్రీకాంత్‌కు యాక్సిడెంట్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఆ వార్త ఎంత వేగంగా పాకిందంటే.. ఎక్కడ చూసినా ఈ న్యూస్ గురించే మాట్లాడేలా చేసింది. అసలు అందులో నిజం ఎంత ఉన్నది అన్న విషయాన్ని పక్కన పెట్టు.. కేవలం.. ఆ క్రేజ్ న్యూస్‌ని క్యాష్ చేసుకునేందుకు ఎవరో కల్పించారా? అన్న విషయాన్ని పక్కన పెట్టి అందరూ లైక్‌లు షేర్లు అంటూ ఆ న్యూస్‌ని పెద్ద దుమారం రేగేలా చేసారు. విషయం శ్రీకాంత్‌కు తెలిసి చాలా బాధపడ్డారు.. అసలు జరిగింది ఏమిటి? అన్నది తెలుసుకోకుండా పుకార్లను ఎలా నమ్ముతారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపిస్తుంది. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియెన్స్‌నే కాదు సెలెబ్రిటీలకు సైతం చిరాకు తెప్పిస్తోంది.. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లేక చూపించడమే జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు అని కొందరి భావన. ఇక ఇదంతా దేనికి అంటే.. ప్రస్తుతం కాలంలో కొంతమంది సోషల్ మీడియా వారు కల్పించి వ్రాస్తున్న న్యూస్‌లకు, క్రియేట్ చేస్తున్న వీడియోలకు చాలామంది సెలెబ్రిటీల మనోభావాలను దెబ్బతీశారు. బ్రతికి ఉన్న వారిని చంపేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితిలో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు.. ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రిటీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
తాజాగా హీరో శ్రీకాంత్ కు ఈరోజు యాక్సిడెంట్ అయిందంటూ ఓ యూ ట్యూబ్ ఛానల్‌లో వచ్చిన వీడియో న్యూస్‌ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దాంతో హీరో శ్రీకాంత్ ఈ వార్తను ఖండించారు. నేను బెంగుళూరు షూటింగ్‌లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా అంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారు పడి ఫోన్స్ చేశారు. అభిమానుల నుంచీ ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి. ఇలా అసత్య న్యూస్‌లతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్‌తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్‌సైట్లలో ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక ముందు ఇలాంటి అసత్య గాలి వార్తలు రాయొద్దు. ఎవరో ఓ వ్యక్తి తప్పుచేస్తే దాన్ని తీసుకుని మరికొన్ని వెబ్‌సైట్స్ యూట్యూబ్ చానెల్స్ పేపర్స్‌లో వేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. అలాగే అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్‌క్రైమ్ ఎస్.పి.రామ్మోహన్‌రావుకు ‘మా’ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు హీరో శ్రీకాంత్.
నిజమే.. ఈ తరహా వార్తల వల్ల మీ క్రేజ్ ఎలా ఉన్నప్పటికీ సదరు వ్యక్తి.. ఆ వ్యక్తి తాలూకు వాళ్లు ఎలా స్పందిస్తారన్న కనీస ఇంగితం మరచి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య అయితే ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ మరణించాడని వార్తలు క్రియేట్ చేసారు. ఈ వార్తలు ఆయనదాకా వెళ్లడంతో షాక్ అయిన వేణుమాధవ్.. ‘నేను బతికే ఉన్నాను మొర్రో..’ అంటూ మీడియా ముందట ఏడ్చేశాడు. కొన్ని వెబ్‌సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ వాళ్లు వాళ్ల క్రేజ్ కోసమే ఇంకా దేనికోసమో కానీ ఇలాంటి అసత్య వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కాకుండా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు వారి అనైతిక ప్రవర్తన దారుణంగా ఉంటున్నాయంటూ ఫిర్యాదు చేసారు. ఈ సంఘటనను చాలా దురదృష్టకరంగా ఎదుర్కొన్నానని చెప్పాడు వేణు. ఈ మధ్యే వేణుమాధవ్ ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. ఆయనకు అనారోగ్యమని అందుకే సినిమాల్లో నటించడం లేదని ప్రచారం చేసారు. ఈ వార్తకు వేణుమాధవ్ సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చింది. ఆ మధ్య హీరోయిన్ షకీలా మరణించారని పుకార్లు పుట్టించారు. ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తమిళ హాస్యనటుడు సెంతిల్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
మరికొన్ని యూ ట్యూబ్ చానల్స్ అయితే మరీ దారుణంగా టైటిళ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలానా హీరోయిన్.. ఆ హీరోతో డేటింగ్ అంటూ ఆ వార్తకు మరి మసాలా అద్ది ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకేసి ఫలానా హీరోయిన్ ఒక్కరాత్రికి ఇంత తీసుకుంటుందా? అంటూ మరో వార్త.. ఇలా సోషల్ మీడియాలో సినిమా తారల జీవితాలకు సంబంధించిన అనవసర వార్తలను ప్రచారం చేస్తూ తన యూ ట్యూబ్ చానల్స్ క్రేజ్ పెంచుకోవాలని దిక్కుమాలిన ఆలోచనతో ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. అసలు టైటిల్‌లో చెప్పేది ఏది ఆ వార్తలో కానీ సదరు వీడియో క్లిప్‌లో కానీ ఉండదు. కేవలం ఆ వార్తను ఆసక్తి కలిగేలా టైటిల్‌లో చెప్పి తమ యూ ట్యూబ్ చానల్‌ను ఎంచుకునేలా చేస్తున్నారు. ఒక రకంగా ప్రేక్షకులను వాళ్లు చీట్ చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు చెప్పుకుంటూ పోతే కొకొల్లలుగా ఉన్నాయి, యూ ట్యూబ్‌లో సెన్సార్ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణమైన వార్తలు వస్తున్నాయా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. హీరోయిన్స్ గురించి ఎక్కువగా రాస్తుంటారు. హీరోయిన్స్ మాత్రం మనుషులు కదా.. మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే దానిలో నిజానిజాలు ఎంతున్నాయన్న విషయాన్ని తేల్చుకుని దాన్ని రాయండి. అంతేకానీ ఏదో క్రేజీ న్యూస్ రాయాలి.. ఆ న్యూస్‌కి లైక్స్.. షేర్స్ పెరగాలని అనవసర అపవాదులను రుద్దుతూ వార్తలు రాయడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి దారుణమైన వార్తలు వచ్చే ఆస్కారం ఉండదు.

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: హీరో శ్రీకాంత్
ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియెన్స్‌నే కాదు సెలబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో లేక చూపించడమో జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బ తీసేలా ఉండకూడదు అని కొందరి భావన. ఇక ఇదంతా దేనికి అంటే.. ప్రస్తుతం కాలంలో కొంతమంది సెలెబ్రిటీల మనోభావాలను దెబ్బ తీశారు. బ్రతికి ఉన్న వారిని చంపేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితిలో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు. ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా హీరో శ్రీకాంత్‌కు ఈ రోజు యాక్సిడెంట్ అయింది అంటూ తెలుగు హంట్ అనే యూట్యూబ్ చానల్‌లో వచ్చిన వీడియో న్యూస్‌ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దాంతో హీరో శ్రీకాంత్ ఈ వార్తను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ చానల్ వాళ్ల లైక్స్ కోసం, సబ్స్‌క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. నేను బెంగళూరు షూటింగ్‌లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయిందట కదా ఎలా వుంది అంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న నా కుటుంబం సభ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారు పడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి. ఇలా అసత్య న్యూస్‌లతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్‌తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్‌సైట్స్‌లో ఇలాంటి వార్తలు పెట్టడం చాలాతప్పు. ఇలాంటి వారిపై చట్టరీతాయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక ముందు ఎవరూ ఇలాంటి అసత్య గాలి వార్తలు రాయొద్దు. ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకుని మరికొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ చానెల్స్ పేపర్స్‌లలో వేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్‌గా తీసుకుంటుంది. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్.పి.రామ్మోహన్‌రావు గారికి ‘మా’ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు హీరో శ్రీకాంత్.

-శ్రీ