మెయిన్ ఫీచర్

ఓటమి నుంచి విజయ శిఖరానికి! (తేనెపట్టుతో ఆరుకోట్ల టర్నోవర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ స్థితి నుండి వ్యాపారవేత్త స్థాయకి చేరుకున్న ఛాయ తన వ్యాపార దక్షతతో నేషనల్ బెస్ట్ ఎంటర్‌ప్రీనియర్స్ అవార్డును కాన్ఫిడరేషన్ ఆఫ్ ఒమెన్ ఎంటర్‌ప్రీనియర్స్ ఆఫ్ ఇండియా నుండి దక్కించుకుంది.

ఒడిదుడుకుల వైవాహిక జీవితం.. ఎటూ పాలుపోని జీవన పయనం.. ఆసరా ఇచ్చి ఆదుకోవలసిన కన్నవారు కూడా ఆర్థికంగా చితికిపోయిన దశలో ఏ మహిళ అయినా ఏం చేయాలో దిక్కుతోచక బేలగా మారుతుంది. అయితే కూర్గ్‌కి చెందిన ఛాయా నంజప్ప మాత్రం కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడే మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసి తన కాళ్లపై తాను నిలబడడమే కాకుండా మరింత మంది ఆపన్నులకు బ్రతుకుతెరువు చూపించింది.
భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితోనే బతుకుబండిని లాగాలని నిర్ణయంచుకుంది. దీనికితోడు బ్యాంకు అప్పుతో 2007లో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించింది. తమిళనాడులో ఉన్న సెంట్రల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో బేసిక్ కోర్సు చేయడానికి తన పేరు నమోదు చేసుకుంది. తేనెటీగల పెంపకం ద్వారా తేనెను సేకరించి దానిని విక్రయించే పనిలో మెళకువలు నేర్చుకుంది. ఆ పనిలో నైపుణ్యం సంపాదించిన తర్వాత సిద్ధిస్, జేనుకురుబాస్ తెగలకు చెందిన ఆటవికులు, రైతులనుండి తేనెటీగలు, తేనెపట్టు సేకరించడం మొదలుపెట్టింది.
అలా సేకరించిన తేనెను శుద్ధిచేసి, బాటిళ్ళలో నింపి మాల్స్‌కి సప్లై చేయడం మొదలుపెట్టింది. తొలుత చిన్నగా ప్రారంభమై ఆమె వ్యాపారం తర్వాత మెల్లగా పుంజుకుంది. ముందు ఛాయ ఒక్కతే ఆ పని మొత్తం చేసేది. వ్యాపారం పుంజుకున్న తర్వాత తన చేతి కింద మరికొందరు మహిళలని పనిలో పెట్టుకుంది.
మొక్కవోని దీక్ష, పట్టుదల, కష్టపడే తత్వంవల్ల ఇప్పుడు ఆమె సంస్థ దేశంలోనే నాణ్యమైన తేనెను అందించే అయిదు పరిశ్రమల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
బొమ్మనహళ్లిలోని మార్కెట్‌లో తేనె ఉత్పత్తులను అందించేది. ఆ తర్వాత ఆమె తన నివాసాన్ని సంజన్‌గూడకి, అక్కడినుండి శ్రీరంగపట్నానికి మార్చింది.
ఇప్పుడామె 6 కోట్ల టర్నోవర్ సాధించి, రెండు వందల టన్నుల తేనెను బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్కండ్‌తోపాటు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఉత్పత్తి చేస్తోంది.
తేనె పరిశ్రమలో విజయం సాధించిన ఛాయ బ్రెడ్, జామ్స్ రంగంలో కాలు పెట్టాలని భావిస్తోంది. అలాగే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలని, తనలా జీవితంలో కష్టాలతో కుదేలైన మరింత మంది మహిళలను ఆదుకోవాలని, వారికి ఉపాధి చూపించి, వారి కాళ్లమీద వారు నిలబడేలా కృషిచేయాలని భావిస్తోంది.

- లావణ్య