మెయిన్ ఫీచర్

బతికి.. బతుకునిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిపై కిరోసిన్ వాసన గుప్పుమని కొడుతుంది. ఒక్కొక్క అగ్గిపుల్ల గీస్తుంది. పారేస్తుంది. ఆఖరి అగ్గిపుల్లకు వచ్చేసింది. ఆలోచనల నుంచి బయటపడి మండే ఆఖరి అగ్గిపుల్లను ఒంటిపై వేసుకుంది. నాలుకలు చాస్తూ ఒంటిని ఆక్రమించిన మంటలకు తాళలేక బాత్‌రూమ్‌లో నుంచి ఒక్కసారిగా బెడ్‌రూమ్‌లోకి పరుగెత్తుకు వచ్చింది. ఆ తరువాత కళ్లు తెరిచి చూసే సరికి ఆసుపత్రి బెడ్‌పై ఉంది. రెండు రోజులు కోమాలో ఉండి కళ్లుతెరిచిన ఆమెను చూసి కన్నతండ్రి పరువు పేరుతో ఈసడించుకున్నాడు. సగం కాలిపోయిన శరీరంతో మంట లు బాధపడుతుంటే ఇదీ ఓ బతుకేనా అని బాధపడిన ఆమె నేడు తనలాంటి వందలాది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు చేతనైన సాయం చేస్తోంది. సగం కాలిపోయిన శరీరాలతో జీవచ్ఛవాల వలే బతుకుతున్న అనేకమందికి ఉచితంగా సర్జరీలు చేయించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. Burn Survivor Mission Trust అనే సంస్థను ఏర్పాటుచేసి అగ్నిప్రమాదాలు, యాసిడ్ దాడుల వల్ల కాలిన బాధితులకు చికిత్స అందిస్తోంది. అం దం కాదు అత్మస్థయిర్యం ముఖ్యం అనే నమ్మకం తో ముందుకు సాగుతున్న ఈమె పేరు మండలి నిహారీ.
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన నిహారీ అందరి ఆడపిల్లల వలే ఆనందంగా ఆడుతూపాడుతూ డిగ్రీ పూర్తిచేసింది. పై చదువులు వద్దంటూ పెళ్లి చేశారు. కాని అత్తిల్లు నరకానికి ఆనవాలుగా నిలిచింది. భర్త స్ర్తిలోలుడు. భార్య శీలానికి సైతం వెలకట్టేంత నీచుడు. జగుప్సాకరమైన మాటలతో వేధించేవాడు. పుట్టింటికి వచ్చినా ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించేవాడు. అలాంటి శాడిస్టుతో కాపురం చేయలేక పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు ఆదరించారు కానీ పరువు పేరుతో మళ్లీ అత్తారింటికి పంపేవారు. ఓనాడు పుట్టింటికి వచ్చి ఇక నేను వెళ్లను అని ఖచ్చితంగా చెప్పింది. అప్పటికే గర్భిణీ. ఆడపిల్లలకు ఇలాంటివి సహజం అంటూ నచ్చజెప్పబోతే ఇలా ఏడేళ్ల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బీఎస్‌ఎంఎస్ సంస్థ ఏర్పాటు
దాదాపు యాభైశాతం కాలిపోయిన ఆమెకు ఎనిమిది ప్లాస్టిక్ సర్జరీలు మనసున్న ఓ వైద్యురాలు ఉచితంగా చేసి ఆదుకుంది. ఎందుకు బతికానా అన్న స్థితి నుంచి తనలాంటి వారికోసం ఏమైనా చేసే స్థితి వచ్చేలా ఆమె తనను తాను మలుచుకుంది. అనేకమంది మానసిక విశే్లషకుల వీడియోలు చూసేది. అలా మానసిక బలాన్ని కూడగట్టుకొని గత ఏడాది ‘‘బీఎస్‌ఎంఎస్’’ అనే సంస్థను ఏర్పాటుచేసింది. భర్త వేధింపులకు గురవుతున్న మహిళలకు నేనున్నానంటూ చేయూతనిస్తోంది. కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ఆరు జిల్లాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి వారికి మందులు ఉచితంగా అందిస్తోంది. క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నవారికి ఆమె ఉచితంగా కౌనె్సలింగ్ ఇప్పిస్తూ నలుగురి మధ్యకు వచ్చి ఆత్మవిస్వాసంతో బతికేలా చేతనైన సాయాన్ని చేస్తోం ది. తనలాంటి బాధితులను మూడు వందల మంది వరకు గుర్తించి వారి వద్దకు వెళ్లి కౌనె్సలింగ్ కేంద్రాలకు తీసుకువస్తోంది. బతుకు మీద ఆశ కల్పిస్తోంది.
జర్మనీ నేషనల్ అవార్డు
ఆమె తన స్నేహితురాలి సాయంతో తనవలే గాయాలపాలైనవారిపై ‘ఇన్‌విజిబుల్’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం జర్మనీలో జాతీయ అవార్డుకు ఎంపికవ్వటం విశేషం. యాసిడ్ దాడు లు, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే పేద, మధ్యతరగతి మహిళలకు పూర్తిగా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించేందుకు ఓ ఆసుపత్రి ఏర్పాటుచేయాలనేదే తన జీవిత ఆశయం అంటూ ముందుకు సాగుతోంది. ఆమె ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.