మెయిన్ ఫీచర్

ప్రగతి వైపు తొలి అడుగు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలీంగోట్ గ్రామస్తులు మద్యం తయారీని వీడి, తేయాకు పండిస్తున్న విషయం తెలుసుకున్న వరల్డ్ విజన్ ఇండియా సంస్థ గ్రామంలో టీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే టీ పొడికి ‘ఉర్లాంగ్’ అని పేరు పెట్టారు. ఉర్లాంగ్ అంటే స్థానిక భాషాలో ‘కలలు నిజమవ్వడం’ అని అర్థం. ఈ టీకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో రూ.11,000లు పలుకుతోంది.

‘‘ఒక ఆలోచన జీవితాలనే మార్చివేస్తుంది’’ అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మేఘాలయ రాష్ట్రంలోని వౌలీంగోట్ అనే గ్రామాన్ని చెప్పుకోవచ్చు. నాడు మద్యం బానిసలకు, అసాంఘిక శక్తులకు కేంద్రంగా విరాజిల్లిన ఆ గ్రామం నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వౌలీంగోట్. ఈ గ్రామంలో సారాను కుటీర పరిశ్రమల మాదిరిగా దాదాపు అన్ని గృహాలలో తయారుచేసేవారు. ఈ సారాను ‘పైర్సీ’ అని పిలిచేవారు. మేఘాలయలో ‘పైర్సీ’ తయారీకి వౌలీంగోట్ గ్రామం పెట్టింది పేరు. గ్రామంలో మద్యం ఏరులై పారడంవలన సదరు గ్రామంలోని పురుషులు నిత్యం మద్యం మత్తులో తేలియాడుతూ ఉండేవారు. చివరకు గ్రామంలోని పరిస్థితులు ఎలా మారాయంటే మహిళలు లేదా బాలికలు ఒంటరిగా చిల్లరకొట్టుకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. వౌలీంగోట్‌లో నెలకొని ఉన్న అరాచక పరిస్థితులను రూపుమాపడం కోసం డి.ఎల్.నూంగ్‌స్పూంగ్ అనే ఉపాధ్యాయుడు గ్రామంలోని కొందరు మహిళలను సమీకరించి, వారి చేత ‘టీ’ (తేయాకు) మొక్కలను నాటించారు.
2003వ సంవత్సరంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ తేయాకు మొక్కలను అందజేసింది. నాలుగు సంవత్సరాలపాటు మహిళలు తేయాకు మొక్కలను పెంచారు. 2007 నుంచి తేయాకులను సేకరించడం ప్రారంభించారు. తాము ఉత్పత్తి చేసిన తేయాకును విక్రయించడానికిగాను వారందరూ కలిసి వౌలీంగోట్ టీ గ్రోవర్స్ సొసైటీని ఏర్పాటుచేసుకొన్నారు. వౌలీంగోట్ గ్రామస్తులు మద్యం తయారీని వీడి, తేయాకు పండిస్తూన్న విషయం తెలుసుకున్న వరల్డ్ విజన్ ఇండియా సంస్థ, గ్రామంలో టీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే టీ పొడికి ‘ఉర్లాంగ్’ అని పేరు పెట్టారు. ఉర్లాంగ్ అంటే స్థానిక భాషాలో ‘కల లు నిజమ
వ్వడం’ అని అర్థం.
ప్రస్తుతం వౌలీంగోట్‌కు చెందిన 20 మంది రైతులు 50 హెక్టార్లులో తేయాకు తోటలు పెంచుతున్నారు. వీరిలో 11మంది మహిళా రైతులు ఉండటం విశేషం. గత రెండు సంవత్సరాలుగా ఈ గ్రామం నుంచి సాలీనా మూడు వేల కిలోల టీ పొడి ఆస్ట్రేలియాకు ఉర్లాంగ్ గ్రీన్ టీ పేరిట ఎగుమతి
అవుతున్నది. గ్రామంలో తేయాకు తోటలు పెంచడం ప్రారంభం అయిన తరువాత, ‘పైర్సీ’ తయారీ పూర్తిగా నిలిచిపోయింది. గ్రామంలోని మహిళలు, బాలికలకు మందుబాబుల బెడద తగ్గిపోయింది. వౌలీంగోట్ గ్రామ ప్రజల జీవితాలు మెరుగు అయ్యాయి. నాడు అభివృద్ధికి ఆమడదూరంలో వున్న వౌలీంగోట్ గ్రామం, నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నాడు మద్యం ఏరులై పారిన వౌలీంగోట్‌లో నేడు సిరిసంపదలు ముంచెత్తుతున్నాయి.

- పి.హైమావతి