మెయిన్ ఫీచర్

ప్రేమంటే డేటింగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా వయసు 20 ఏళ్లు. మేమిద్దరం నాలుగేళ్లుగా ఒకరినొకరం తెలుసు. గంట సేపు ప్రయాణించి ఇక్కడకు వచ్చాం, ఇక్కడకు తమ తల్లిదండ్రులు రాలేరు అని ధీమాతో వచ్చాం’’ అని అంటున్నారు అష్మి,మయూర్ జంట. ఇరవై ఏళ్ల ప్రాయం ఉన్న ఈ జంట గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటుంది. ఇక్కడకు వచ్చి ఇద్దరం చేతులు పట్టుకుని మాట్లాడుకుంటాం. అంతే తప్పా మిగతావారిలా ముద్దులు పెట్టుకోం అని అష్మీ భయంగా చెప్పటం ఆమె ఎంత ధైర్యంగా ప్రేమిస్తుందో అర్థంచేసుకోవచ్చు.
........................................
‘‘మాకు ఏకాంతంగా గడపటానికి ఎంతో అనువైన ప్రదేశం.
ఇక్కడకు వస్తే తమ తల్లిదండ్రులు అసలు గుర్తించలేరు. అందుకే
ఇక్కడకు వస్తుంటాం.’’
- ఓ ప్రేమికుల జంట
.......................................

‘ప్రేమ అంటే ప్రియభావన అంటారు. తాను ప్రేమించే మనిషిని గానీ, వస్తువును గానీ తనదిగా భావించటం. కాని ఆత్మీయతా భావం లేకుండా ఏదో ఆశించి సాన్నిహిత్యాన్ని కోరుకునేదానిని కూడా నేటి యువత ప్రేమగానే భావిస్తోంది. ఈ భావనే నేడు డేటింగ్‌కు దారితీస్తోంది. ఇలాంటి ప్రేమను గుడ్డిది అనటంలో ఏమాత్రం సందేహించనక్కర్లేదు. వాస్తవానికి ప్రేమికులు రెండు రకాలుగా ఉంటారు.‘ ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం’
అంటూ జీవితాలనే త్యాగం చేసేవారు. మరికొం దరు స్పర్శను కోరుకునేవారు .
ఇలాంటివారు అందమైన లోకాన్ని నిర్మించుకుని అందులో విహరించాలని తహతహలాడుతుంటారు. ఇందుకోసం తమకు అనువైన ప్రదేశాలను అనే్వషిస్తుంటారు. స్పర్శను కోరుకునే ప్రేమికులు ఒకరినొకరు తాకడంలో ఆనందపడిపోతుంటారు. అందుకోసం ఏకాంత ప్రదేశాలకు వెళ్లతారు. వాటికోసం అనే్వషిస్తుంటారు.
ఆర్థిక నగరంగా ప్రసిద్ధిచెందిన ముంబయిలోని బంద్రా శివారు ప్రాం తం ప్రేమికుల డేటింగ్ కేంద్రంగా మారిపోయింది. తల్లిదండ్రుల నిఘా కళ్ల నుంచి తప్పించుకునేందుకు ఇంతకన్నా సురక్షితమైన ప్రదేశం లేదని బాహాటంగా ప్రేమికులు చెప్పటం గమనార్హం. మీరు ఇక్కడకు వస్తే ఎక్కడ చూసినా ప్రేమికులే కనిపిస్తుంటారు. అందరూ కూడా ముద్దులు పెట్టుకుంటూ తమ ప్రేమను వ్యక్తంచేయటం ఇక్కడ పరిపాటి అని ఈ సముద్ర ప్రాంతంలో పల్లీలు అమ్ముకునే రమాశంకర్ అనే కుర్రాడు సైతం అంగీకరిస్తాడు. సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రాంతంలో రాళ్లమీద కూర్చొని డజన్లకొద్దీ ప్రేమికులు ఇక్కడ గడుపుతుంటారు. చేతులు ఒకరి నడుం చుట్టూ మరొకరు వేసుకని ప్రేమికురాలు ప్రియుడు భుజం మీద సేదతీరే దృశ్యం, లిప్ లాకింగ్, బహిరంగంగా ముద్దు లు పెట్టుకోవటం తదితర దృశ్యాలు బాలీవుడ్ సినిమాల్లో చూడక్కర్లేదు. బంద్రాలో బహుచక్కగా చూడవచ్చు.
వికృత రూపం దాల్చుతున్న
డేటింగ్ సంస్కృతి...
ఇలాంటి డేటింగ్ సంస్కృతి దేశంలో నేడు వికృతరూపం దాలుస్తోంది. ముంబయిలో చదరపు కిలోమీటరుకు 20,000 మందికి పైగా జనాభా నివశిస్తున్నారు. దీంతో చాప కింద నీరులా డేటింగ్ సంస్కృతి పాకుతుంది. సామాన్య, మధ్యతరగతి యువతకు ఏకాంత ప్రదేశం దొరక్క ఇలా తల్లిదండ్రులు నిఘా నుంచి తప్పించుకుని ముద్దుల పేరుతో హద్దులు దాటేస్తున్నారు. తల్లి దండ్రులు చూసే సరైన జోడీ కోసం ఆగకుండానే బాయ్ ఫ్రెండ్‌తో, గరల్ ఫ్రెండ్ తో ప్రేమ పేరు తో ఇలాంటి డేటింగ్ కు పాల్పడుతున్నారు. ముం బయి పో ర్టు కు శివారు గా ఉండే ఈ బంద్రా నేడు ప్రేమికులకు స్వర్గసీమగా మారిపోయింది. ప్రేమ త్యాగాన్ని, ధైర్యాన్ని కోరుకుంటుందంటారు. మరి ఇలాంటి జంటల ప్రేమకు ఎలాంటి నిర్వచనం ఇవ్వాలి?.
ఒకే అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండే కీర్తి,ఆషిష్ మధ్య మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం సాగుతుంది. ఇంట్లో వారికి తెలియదు. తరచూ ఇక్కడకు వచ్చి ఏకాంతంగా కాలం గడుపుతుంటారు. అపుడపుడు ముద్దులు కూడా పెట్టుకుంటామని అంగీకరించారు. ప్రేమికులు ముద్దు పెట్టుకునే సంస్కృతి ఇపుడు మనదేశంలో నేరం కాదని వారే బాహాటంగా అంటున్నారు. కీర్తికి ఆషిష్ సొగసుగాడుగానూ, ఆషిష్‌కు కీర్తి అందగత్తెగా కనిపించటంతో వీరిలో ఆకర్షణ పెరిగి అదే ప్రేమగా భావించటం జరిగింది. బాలీవుడ్ సినిమాలో ప్రేమ పేరుతో రోమాన్స్‌ను విచ్చలవిడిగా చూపిస్తుండటం అది నిజ జీవితంలో యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇలా డేటింగ్ పేరుతో వచ్చేవారిలో యువతే కాదు ప్రొఫెషనల్స్ సైతం ఉండటం విశేషం. ప్రేమ పేరుతో ఇలాంటి పోకడలు పోతున్న ప్రేమికులను పోలీసులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. భార్యాపిల్లలతో వచ్చి గడుపుదామనుకునే ఎన్నో కుటుంబాలు వీళ్ల ముద్దూమురిపాలు చూడలేక రాలేకపోతున్నారు. డేటింగ్ చేస్తున్న యువతను పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు ప్రశ్నిస్తే.. తాము ఆరు నెలల కిందటే పెళ్లి చేసుకున్నామని అబద్దాలు చెప్పటం ఈ ప్రేమికులకు అలవాటుగా మారిపోయింది. వెండితెర మీద సినిమా అయిపోయేంతవరకు అలా సాగిపోతూనే ఉంటుంది. ఆకాశం హద్దుగా.. బలంగా సాగిపోతునే ఉంటుంది. వాటిని అనుక రించే వీరి ప్రేమ ఎన్నాళ్లు సాగుతుందో అర్థంకాని పరిస్థితి.
ఎటు సాగుతుంది
ప్రేమికుల ప్రయాణం?
పరిపక్వం చెందని వయు లోనే డేటింగ్ పేరుతో ప్రేమకు నిర్వచనం పలుకుతున్న ఇలాంటి ప్రేమికులను చూస్తుంటే ప్రేమ ఎటువైపు ప్రయాణిస్తోందో అర్థంకాని పరిస్థితి. మమ్మల్ని ఇలా చూస్తే మా తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే ఐడియా లేదు. కేవలం గర్ల్‌ఫ్రెండ్ చేతిలో చెయ్యి వేసి నడవాలనే ఉద్దేశ్యంతోనే వచ్చానని రెండు పదులు కూడా నిండని మయూర్ అనే యువకుడు చెప్పటం చూస్తేంటే ఇది కేవలం స్పర్శకు సంబంధించిన ప్రేమగానే భావించకతప్పదు. మనం ప్రేమిస్తున్న వారి లోపాలను క్షమించగలగడం, వారి భావాలను అర్థంచేసుకునే సహనాన్ని కలిగి ఉండటం, ఏకాస్త ప్రగతిని సాధించగలిగినా, హృదయ పూర్వకంగా అభినందించి ప్రోత్సహించటం. ప్రేమకు తార్కణంగా నిలిచే అభినందనలో కౌగిలింతలు, ముద్దులు తప్పనిసరి. కాని శారీరక వాంఛతో ఇలాంటి ఏకాంత ప్రదేశాలో లప్రేమ పేరుతో బహిరంగా చేసే ఇలాంటి పోకడలతో ఎకాంత ప్రదేశాలను కలుషితం చేయటం చూస్తుంటే ప్రేమ ఎటు పోతుంది అని అనిపించక మానదు.

- harichandana