Others

జ్ఞాన సౌధానికి తరగతి గది పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్ని నేలమీద కూర్చోబెట్టి చదువు చెప్పే తరగతి గది అయినా.. కుషన్ కుర్చీల్లో కూర్చోబెట్టినా.. ఈబుక్ మీద మునివేళ్ళతో కంప్యూటర్ స్క్రీన్‌ని టచ్ చేయిస్తూ చదివే చదువు అయినా.. వాటి ఉద్దేశ్యం విద్యార్థి భవిష్యత్తుకు గట్టి పునాది వెయ్యటమే.

ఇంతకుముందు పిల్లలు వేలిగణుపులు లెక్కపెట్టుకుని లెక్కలు చేయటం... ఎక్కాలు బట్టీపట్టడం చేస్తే- ఇప్పుడు కాలిక్యులేటర్ బటన్లు నొక్కి కష్టపడకుండా, బుర్ర ఉపయోగించకుండా లెక్కలు చేస్తున్నారు.

ఎప్పటిలాగే మళ్లీ మరో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయింది. పిల్లలు నూతనోత్సాహంతో పుస్తకాల సంచులు భుజాన వేసుకుని కొత్త తరగతి గదిలో అడుగుపెడుతున్నారు. సంవత్సరం అంతా చదివిన క్లాసుకు ‘గుడ్‌బై’ చెప్పి ఇంకొంచెం పెద్ద క్లాసుకు వెళుతున్నందుకూ.. మరి కాస్త పెద్ద చదువు చదవబోతున్నందుకు! కొత్త టీచర్లు కొత్త క్లాస్ రూమ్.. కొత్త కొత్త సంగతులు.. ఓహ్.. అంతా కొత్తదనమే. అందుకే పిల్లల్లో అంతటి ఉత్సాహం ఉరకలు వేసేది..!
అధునాతన విద్యా విధానంలో వింత పోకడలు
ఇప్పుడు అన్ని రంగాలలో మార్పు వచ్చినట్లే విద్యారంగంలోనూ మార్పు వచ్చింది. పలకా బలపం చేతబట్టుకుని పంతులుగారి దగ్గర అక్షరాలు దిద్దటానికి బడికి వెళ్ళే రోజులు పోయి పుస్తకాల బరువు మోస్తూ కార్పొరేట్ స్కూలుకు వెళ్ళే రోజులు వచ్చి.. ఆ తరువాత అవీ పోయి ఇప్పుడు ‘ఈ బుక్’తో ఇంటర్నేషనల్ స్కూలుకు, టెక్నో స్కూలుకు వెళ్ళే అధునాతన పోకడల స్కూల్సు వచ్చేశాయి. ఫీజులు బాగా చెల్లిస్తే పిల్లలు ఎసి క్లాస్‌రూమ్స్‌లో హాయి గా కూర్చుని.. అధునాతన విద్యా పరికరాలతో సుఖంగా విద్య నేర్చుకోవచ్చును. ఒకప్పుడు ‘పిల్లలు కష్టపడాల్సిన వయసులో కష్టపడితేనే ముందు ముందు జీవితంలో రాటుతేల్తాడని’ అనుకునేవారు.. కారున్న బడాబాబులు కూడా

పిల్లల్ని స్కూలుకు ‘బస్సులో నలుగురితో కల్సి వెళ్ళమని’ శాసించేవారు. డక్కాముక్కీలు తింటేనే జీవితం విలువ అర్థమవుతుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు పిల్లవాడు కాలు కిందపెడితే మట్టి అంటుతుందేమో అన్నట్లు.. అపురూపంగా కారులో పంపించి- ఎండ పొడ తగలకుండా ఏసీ రూముల్లో కూర్చోబెడుతున్నారు. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, ఈబుక్‌లు ఇచ్చి చదువుకోమంటున్నారు. ఇంతకుముందు పిల్లలు వేలిగణుపులు లెక్కపెట్టుకుని లెక్కలు చేయటం... ఎక్కాలు బట్టీపట్టడం చేస్తే- ఇప్పుడు కాలిక్యులేటర్ బటన్లు నొక్కి కష్టపడకుండా, బుర్ర ఉపయోగించకుండా లెక్కలు చేస్తున్నారు. ఇవి అధునాతన విద్యావిధానంలో వచ్చిన కొత్త పోకడలు.
అయితే కాలాన్ని బట్టి చదువు చెప్పే పద్ధతుల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. చదువు ధ్యేయం మాత్రం ఒకటే- విద్యావంతులుగా పిల్లల్ని తీర్చిదిద్దటం.. వాళ్లకు తెలియని విషయాలను ఉపాధ్యాయుల చేత తెలియచెప్పించి వాళ్లను జ్ఞానవంతులుగా తయారుచేయటం! అందుకు తరగతి గది ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లల్ని నేలమీద వరుసగా కూర్చోబెట్టి చదువు చెప్పే తరగతి గది అయినా.. కుషన్ కుర్చీల్లో కూర్చోబెట్టినా ఈబుక్ మీద మునివేళ్ళతో కంప్యూటర్ స్క్రీన్‌ని టచ్ చేయిస్తూ చదివే చదువు అయినా వాటి ఉద్దేశ్యం విద్యార్థి భవిష్యత్ జ్ఞాన భవనానికి గట్టి పునాది వెయ్యటమే. అందుకే ప్రతి తరగతి గదీ పిల్లల మెదళ్ళను తొలిచే లోతైన ఒక కందకం.. ఒక గట్టి పునాది రాయి!
అలాగే ఎన్నో డిగ్రీలు గడించి.. ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి.. మూర్త్భీవించిన విజ్ఞాన సౌధంలా ఒక విద్యార్థి ఎదగాలంటే చిన్నప్పుడు తరగతి గదుల్లో నేర్చుకున్న ప్రాథమిక విద్యాబలమే తోడ్పడేది. కనుకనే ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుంచే మంచి స్కూలుకు, మంచి గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిస్తారు. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అన్న సూక్తిని వాళ్ళకు చెప్పి శ్రద్ధాసక్తులతో వాళ్లు విద్యను నేర్చుకునేలా చేస్తారు. ఎటు వంచితే అటు అవలీలగా వంగే వాళ్ళ మెదళ్ళను మనసులను చదువువైపు వంచి ఏపుగా, పుష్టిగా ఎదిగేలా చేస్తారు.
సంవత్సరకాలపు విద్యాబోధనలో ప్రతి తరగతికి ఒక ప్రత్యేకత విలువ వుంటాయి. ‘రోజూ నేర్చుకునేది ఏముంటుంది?’ అన్నట్టు కాకుండా ఏ రోజు తరగతి ఆ రోజు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ- ‘ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది ఎంతో వుంటుంది’ అన్న అవగాహనను పిల్లలకు కలిగిస్తూ వుంటుంది. ‘అన్నీ వచ్చేసాయి’ అన్న మిడిమిడి జ్ఞానం తాలూకు అహంకారం తొలగిపోయి ‘నేను నేర్చుకుంది ఈ జ్ఞాన సముద్రంలో ఒక్క బిందువు అంత మాత్రమే!’ అన్న జ్ఞానబోధ కలిగి మేధ కడిగిన ముత్యంలా మారిపోతుంది. పిల్లలు రోజూ తప్పకుండా వేళ తప్పకుండా తరగతి గదిలో హాజరై శ్రద్ధగా పాఠాలు విని కొద్ది కొద్దిగా జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదగాలి.

- కొఠారి వాణీచలపతిరావు