మెయిన్ ఫీచర్

పేదల ఆశాజ్యోతి.. ప్రతిభా కృష్ణయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు సంపాదన మనకి మాత్రమే సంతోషాన్నిస్తుంది. ఇతరులకు సాయపడడం, అవసరమైనవారికి తోడునీడగా ఉండడం అనేది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని ఒక్కసారి అనుభవించినవారికే అందులోని మజా తెలుస్తుందని అంటోంది బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రతిభా కృష్ణయ్య.
అయితే మంచి సంపాదన, పెద్ద నగరంలోని జీవితం కూడా ఆమెకి సంతృప్తినివ్వలేదు. దాంతో ఆమె ఉత్తరాఖండ్ చేరుకుంది. అక్కడ ఖేతిఖాన్, తప్నీపాల్, ధాత్ వంటి గ్రామాల్లోని మహిళలకు స్వయం ఉపాధిలో శిక్షణనిస్తూ అక్కడి పేద మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళమీద తాము నిలబడేందుకు ఇతోధికంగా సాయపడుతోంది. అయితే ప్రతిభ ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పడు ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, మంచి జీతాన్ని, నగర జీవితాన్ని వదులుకుని ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూరికి వెళ్లి అక్కడి పేద మహిళలకు సేవలు చేయడం తెలివైన పనికాదని నచ్చచెప్పజూశారు. డబ్బు సంపాదన కంటే మరేదో సేవా దృక్పథంలో ఉందని, అందులో దొరికే మనశ్శాంతి, సంతోషం మరెక్కడా దొరకదని చెప్పి వారిని ఒప్పించింది.
మనం చేసే పనివల్ల తృప్తి, మనశ్శాంతి దొరికినట్లయితే ఆ పనిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదని ఆమె చెబుతుంటుంది. ప్రస్తుతం తాను చేస్తున్న పనివల్ల తనకి ఆ రెండూ దొరుకుతున్నాయని ఆమె అంటుంది. ఒకసారి భారీ వర్షాలు కురిసి తాను పనిచేసే చోట విద్యుత్ వారం రోజులపాటు నిలిచిపోయిందని, ఫోన్లు కూడా పనిచేయలేదని ఆ సమయంలో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయంది. అయినా కూడా అక్కడి గ్రాముస్థలు ఎలాంటి అసౌకర్యానికి లోనుకాలేదని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ప్రకృతితో మమేకం అయి జీవించడంవల్ల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అవసరం వారికి లేనట్లు అప్పుడే తాను గుర్తించినట్లు ప్రతిభ చెప్పింది.
గ్రామంలోని చాలామంది మహిళలు కుట్లు, అల్లికల్లో మంచి నేర్పరులని తాను గుర్తించానని, దాంతో వారిని ఆ విద్యలో మరింత నిపుణులుగా మలిచి రకరకాల వస్తువులు అల్లేలా వారిని ప్రోత్సహించినట్లు తెలిసింది. ఆ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం ద్వారా వారంతా మంచి ఆదాయం సంపాదించేలా వారిని ప్రోత్సహించడంతో ఆ పేద మహిళలు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకునేందుకు సాయపడినట్లు ప్రతిభ చెప్పింది.
అందమైన మఫ్లర్లు, షాల్స్, చిన్న చిన్న షూలు, సాక్స్‌లు, హెయిర్ క్లిప్పులు, హెయిర్ బాండ్లు తయారుచేయడం ద్వారా మార్కెట్‌లో పట్టు సాధించేలా గ్రామీణ మహిళలను ప్రతిభ తీర్చిదిద్దింది. అలాగే గ్రామీణ మహిళల ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్‌ని బెంగుళూరులో ఏర్పాటుచేసింది. దానికి మంచి స్పందన వచ్చింది.
రైతు కూలీలుగా పనిచేసే అక్కడి మహిళలు రోజుకి ఇరవై, ముప్ఫై రూపాయలు మాత్రమే సంపాదించేవారు. అలాంటివారు చేతికుట్లు, అల్లికల ద్వారా మంచి సంపాదన కళ్లజూసేలా తయారుచేసింది ప్రతిభ.
అలాగే స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీ
ఒకటి వారం దరితో స్థాపించి పెద్ద ఎత్తున ఉత్పత్తులను విక్రయించేలా తగిన చర్యలు తీసుకుంది. వారంతా ఇప్పుడు నెలలో తొలి రెండు వారాలు రోజుకి ఇరవై గంటలపాటు పనిచేస్తారు. పెద్ద ఎత్తున స్వెట్టర్లు, ఇతర కుట్టుపని చేయడం ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. వారు అల్లే ఒక్కో స్వెట్టరు 250 రూపాయలు మార్కెట్లో పలుకుతుంది. అలా గ్రామీణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రతిభ కృషిచేసింది. అలాగే పదిహేను నిమిషాల్లో క్లిప్పులు తయారుచేసి జత క్లిప్పులు పదిహేను రూపాయలకు విక్రయించేలా వారిని తీర్చిదిద్దింది. అలాగే ఒక మఫ్లర్‌ని వాళ్ళు మూడు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇప్పుడు.
బిఎఐఎఫ్ అనే ఎన్‌జిఓ సంస్థతో కలిసి ప్రతిభ గ్రామీణ మహిళలకు వృత్తి నైపుణ్యం సాధించేలా కృషి చేయడం ద్వారా పల్లెటూరి మహిళలు చక్కటి సంపాదనతో తమ తమ కుటుంబాలను సంతోషంగా సాకగలుగుతున్నారు. దీని గురించి అక్కడి మహిళలు మాట్లాడుతూ ప్రతిభ తమ గ్రామాలకు రాకపోతే తాము ఎప్పట్లాగే దుర్భర జీవితాలు గడుపుతూనే ఉండేవాళ్ళమని, ఆమె దయవల్ల ఇప్పుడు తామంతా చక్కటి జీవితాలను గడుపుతున్నట్లు చెబుతున్నారు.

- బాబు