మెయిన్ ఫీచర్

‘కెప్టెన్’ను నడిపేది ఆమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాదాసీదా విమర్శలే కాదు, రాజకీయంగా పెను దుమారం రేపేలా పదునైన వ్యాఖ్యలను ఆమె చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోపే అక్రమార్జన కేసులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్తారంటూ ప్రేమలత జోస్యం
చెబుతున్నారు.

‘పరిమిత అవకాశాలు ఉన్నాయని నిరాశపడేవారు సామాన్యులు. ఉన్న కొద్దిపాటి అవకాశాలను ఉపయోగించుకొనేవారు సమర్థులు.’ అన్న నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ మాటలు ఆమెకి అక్షరాలా వర్తిస్తాయి. ఎన్నికల్లో అధికారం ముఖ్యం కాదు, జన హృదయాలను చూరగొనడమే ప్రధానం అని నమ్మిన ఆమె ఇపుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలన వ్యక్తిగా మారారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అన్నాడిఎంకె అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత, రాజకీయ కురువృద్ధుడు, డిఎంకె అధినేత కరుణానిధి వంటి హేమాహేమీలకు సైతం ఆందోళన కలిగించేలా ఆ మహిళ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ నటుడు, డిఎండికె పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ భార్య ప్రేమలత పేరు ఇపుడు తమిళనాడులో మార్మోగుతోంది. ‘కెప్టెన్’గా ప్రజలందరికీ చిరపరిచితుడైన విజయ్‌కాంత్ వెన్నంటి ఉంటూ డిఎండికె పార్టీని ముందుకు నడిపించడంలో ప్రేమలత కీలకపాత్ర వహిస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపించడంతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు జరుపుతూ ప్రత్యర్థి పార్టీలైన అన్నాడిఎంకె, డిఎంకెలపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈనెలలో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మరోసారి అన్నాడిఎంకె ఆధిక్యత సాధించి ‘విప్లవ నాయకి’ జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటారని ఓ వైపు సర్వేలు ఘోషిస్తున్నా, ఏ మాత్రం అధైర్యపడకుండా భర్తకు బాసటగా ఉంటూ ప్రేమలత డిఎండికె గెలుపు కోసం శ్రమిస్తున్నారు. అనేక ఉచిత పథకాలను ప్రకటించి అధికారాన్ని నిలుపుకోడానికి జయలలిత, ఈసారైనా పగ్గాలు చేపట్టాలన్న తపనతో కరుణానిధి ఎన్నికల సమరాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి రాజకీయ దిగ్గజాలతో ఓ మహిళ తలపడడం అంటే నిజంగా సాహసమే. భర్త విజయ్‌కాంత్ విరుదునగర్‌లో పోటీ చేస్తుండగా ప్రేమలత ఈరోడ్ నుంచి బరిలో నిలిచారు. ఒక్క గంట కూడా వృథా చేయకుండా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అన్నాడిఎంకె, డిఎంకెలకు సరైన ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ఆమె జనం ముంగిళ్లలోకి వెళుతున్నారు.
ఈసారి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రేమలత తప్ప మిగిలిన పార్టీల నేతలెవరూ జయలలితను విమర్శించడానికి సాహసించడం లేదు. ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని పాలించిన అన్నాడిఎంకె, డిఎంకెలకు బదులు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రేమలత ఓటర్లను వినూత్న పంథాలో అర్థిస్తున్నారు. సినీ నటుడైనప్పటికీ ‘కెప్టెన్’ విజయ్‌కాంత్‌కు ప్రజల్లో జయలలితకు ఉన్నంత సమ్మోహన శక్తి లేదు. దీంతో డిఎండికె ప్రచార బాధ్యతలు ప్రేమలత స్వీకరించి జయలలితపై పదునైన విమర్శనాస్త్రాలు గురిపెడుతున్నారు. విజయ్‌కాంత్ కన్నా ప్రేమలత విలక్షణ రీతిలో ప్రచారం చేయడాన్ని పార్టీ కార్యకర్తలు కూడా ప్రశంసిస్తున్నారు. ముక్కోపిగా ప్రసిద్ధుడైన విజయ్‌కాంత్‌లో సహనం తక్కువని ఆయన పార్టీవారే చెబుతుంటారు. ఆయన మొండివైఖరి కారణంగానే ఎన్నికల ముందు పలువురు శాసనసభ్యులు, నాయకులు అన్నాడిఎంకె శిబిరంలో చేరారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో భర్తకు అండగా నిలవాలని భావించి ప్రచార బాధ్యతలను ప్రేమలత స్వీకరించారు. సాదాసీదా విమర్శలే కాదు, రాజకీయంగా పెను దుమారం రేపేలా పదునైన వ్యాఖ్యలను ఆమె చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోపే అక్రమార్జన కేసులో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ జైలుకు వెళ్తారంటూ ప్రేమలత జోస్యం చెబుతున్నారు. ఆమె మాటల్ని జనం ఎంతో ఆసక్తిగా వింటున్నా ఓట్ల విషయానికొస్తే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
2011లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికె అధినేత విజయ్‌కాంత్ అన్నాడిఎంకెతో పొత్తు పెట్టుకుని 35 స్థానాలను కైవసం చేసుకున్నారు. శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా సంపాదించారు. అభిప్రాయ భేదాల కారణంగా విజయ్‌కాంత్ అన్నాడిఎంకెకు దూరమై తన సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తను ముఖ్యమంత్రిని చేయడానికి రంగంలోకి దిగిన ప్రేమలత ప్రత్యర్థి పార్టీలపై బలమైన ఆరోపణలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గత ఎన్నికల్లో జయలలితతో పొత్తు పెట్టుకోవడమే తమ పార్టీ చేసిన పెద్ద పొరపాటని ఆమె ఎన్నికల సభల్లో విశే్లషిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జయలలిత దారుణంగా విఫలమయ్యారని ఆమె అంటున్నారు. చాలా ప్రాంతాల్లో పరిశ్రమలు లేవని, అభివృద్ధికి నోచుకోని జిల్లాలు ఎన్నో ఉన్నాయని ఆమె వివరిస్తున్నారు. ఉచిత పథకాల వల్ల ప్రగతి సాధ్యమవుతుందా? అని ప్రత్యర్థులను నిలదీస్తున్నారు. కరుణానిధి అధికారంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన కుమారుడు స్టాలిన్ ఏనాడూ జనంలోకి రాలేదని ఆమె విమర్శిస్తున్నారు. ‘నా భర్త విజయ్‌కాంత్ సినిమాల్లో నటిస్తారు.. గానీ జనంలో నటించలేరు.. మిగతా పార్టీ నాయకులకే ఇది సాధ్యం..’ అంటూ ప్రేమలత చేస్తున్న ప్రసంగాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఎండతీవ్రతో వీధుల్లో పిల్లలు చనిపోతూంటే జయలలిత మాదిరి తాను ఏసీ గదుల్లో కూర్చోలేనని ఆమె అంటున్నారు. అక్రమాస్తులు, క్రిమినల్ కేసులు తన భర్తపై లేవంటున్నారు. బిజెపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు తమిళనాడులో స్థానం లేదని, మార్పు కోరుకునే ప్రజలు ‘కెప్టెన్’కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మిగతా పార్టీల తరఫున కూడా కొంతమంది మహిళలు రంగంలో నిలిచినప్పటికీ ప్రచార పర్వంలో వారు ప్రేమలతలా ప్రభావం చూపలేకపోతున్నారు.

-పి.హైమావతి