మెయిన్ ఫీచర్

సత్కార్యానికి సంసిద్ధులవుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షయ అంటే క్షమము లేనిది. అంటే తరగనిది, పాడవ్వనిది అని పెద్దలు చెబుతారు. ఆ రోజున చేసే దానం, చెప్పే ధర్మం, ఆచరించే నీతి నియమాలు కోటిరెట్ల ఫలితాలనిస్తాయి.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
అక్షయ తృతీయనాడు గంగా మాత దివి నుంచి భువికి వచ్చింది. కాబట్టి ఆ రోజు వివిధ రకాల పుష్పాలతో గంగామాతకు కృతజ్ఞతలు తెలుపుదాం.
పాండవులు చేసుకున్న పుణ్యఫలితం కోటిరెట్లు అధికమై అక్షయ పాత్ర రూపంలో శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా లభించిన రోజు.
కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నా కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి సకల భోగ భాగ్యలను, నిత్యానందాన్ని పొందిన రోజు.
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ నాడు వివాహాలు చేసుకునే దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్లపాటు వర్థిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలలో వివాహాలు జరుపుతారు.
మన శాస్త్రాలు, పురాణాలు ఇంత అద్భుతంగా వివరిస్తున్న ఈ అక్షయ తృతీయనాడు బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరి సంపదలతో వర్థిల్లుతారనే విశ్వాసానే్న ఆధారం చేసుకుని బంగారం కొనేందుకు ఉబలాడపడటంలో తప్పలేదు. కాని ఏదో కొని తెచ్చుకోవటం కాదు ఉన్నది ఇచ్చుకోవటంలోనే ఆరోజు పొందే పుణ్యఫలాన్ని విస్మరిస్తున్నాం. కాబట్టి మనం మాత్రం ఆ రోజున ఒక మంచి పని ఆరంభిద్దాం. మంచిపని అంటే సమాజానికి హాని కలగనిది ఏదైనా సరే మంచిపని అవుతోంది. ఆ రోజు చేసే పుణ్య కర్మలు తరిగిపోకుండా తిరిగి మనకు ఉపయోగపడేందుకు సంకల్పిద్దాం. పాప పుణ్యాల తేడా తెలుసుకునే విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం భగవంతుడు మనిషికి ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అక్షయ తృతీయనాడు సత్కార్యాలకు సంకల్పసిద్ధులవుదాం.