మెయిన్ ఫీచర్

పడిలేచిన కెరటం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనీ చౌరాసియా.. పడి లేచిన కెరటంలాంటిది. అందమైన జీవితం గురించి కలలు కన్నది. అత్తింటి ఆరళ్లు ఆమె భావి జీవితాన్ని చిధ్రం చేశాయ. ప్రస్తుతం గినె్నస్ బుక్ రికార్డులకెక్కిన నృత్యకారిణిగా ప్రధాని మోదీతోపాటు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలందుకున్న ముప్ఫై ఏళ్ల వనిత. ఏప్రిల్ 4వ తేదీన వారణాసిలోని వౌంట్ లిటెరా పాఠశాలలో ఈ నృత్య ప్రదర్శన ప్రారంభించి 124గంటలు నిర్విరామంగా కథక్ నృత్యం చేసి గినె్నస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు సోనీ చౌరాసియా.
ఈ ప్రదర్శనలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి 20 నిమిషాలపాటు విరామం తీసుకొని తన ప్రదర్శనను కొనసాగించారు. గతంలో 2011లో కేరళకు చెందిన కళామండల్ హేమలత అనే నృత్యకారిణి 123 గంటల 20 నిమిషా లు మోహినీ అట్టం చేసి సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి, 123 గంటల 30 నిమిషాలు కథక్ నృత్యం చేసి సరికొత్త రికార్డు సృష్టించారు చౌరాసియా.
సోనీ చౌరాసియా అందుకున్న ఈ ఘనత అంత ఆషామాషీగా వచ్చిందేమీ కాదు. దీని వెనుక అకుంఠిత దీక్షతోపాటు ఆమె చేసిన వెన్నుచూపని పోరాటం కూడా దాగి వుంది. పాన్ అమ్ముకుని జీవనం సాగించే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సోనీ చౌరాసియా 2009లో తన వివాహానంతరం భర్తతోపాటు ఢిల్లీ వెళ్లింది. అక్కడితో మొదలయ్యాయి ఆమె కష్టాలు. దాంతోపాటే ఆమె అభిరుచులు, ఆశయాలు అన్నిటికి తెరపడిపోయింది. ఎంతో ఇష్టంగా నేర్చుకున్న నృత్యం మరుగున పడిపోయింది. కష్టాలు, కడగండ్లు ఎదుర్కోవడమే నిత్య సాధనగా మారిపోయాయి.
అత్తింట్లో ఆమె భరించని బాధ లేదు. ఎదుర్కోని కష్టం లేదు. భర్తతోపాటు ఆమె అత్తమామలు కూడా ఆమెను పెట్టని హింస లేదు. కొన్ని రోజులపాటు ఒక గదిలో బంధించబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతకాలంపాటు ఈ బాధలన్నీ సహించిన సోనీ ఇక ఈ గృహహింసను భరించలేకపోయింది. కట్టుబట్టలతో అత్తింటినుంచి పారిపోయి బయటకు వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో టికెట్ లేకుండానే ప్రయాణం చేసి ఢిల్లీ నుంచి పుట్టిల్లు వారణాసికి చేరుకుంది. అత్తిల్లు ఆరళ్లకు గురిచేసినా పుట్టిల్లు ఆమెను ఆదుకుంది.
తల్లిదండ్రులు తమ కుమార్తెను అక్కున చేర్చుకున్నారు. తనకు ఎదురైన కష్టాలను తలచుకొని కుంగిపోకుండా, అక్కడితో వాటిని పక్కకు నెట్టేసి ముందుకు సాగిపోవాలనుకుంది. తన అభిరుచులకు మళ్లీ పదునుపెట్టడం ప్రారంభించింది సోనీ. ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని భరిస్తూనే కుమార్తె అభిరుచులను ప్రోత్సహించారు తల్లిదండ్రులు. తనకు వచ్చిన విద్య నృత్యానే్న తన జీవనోపాధిగా మలచుకొని హర్యానాలోని విద్యాదేవి జిందాల్ పాఠశాలలో నృత్య ఉపాధ్యాయినిగా ఐదు సంవత్సరాలు పనిచేసింది సోనీ.
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా ఏదో సాధించాలన్న తపనతోనే ఉన్న సోనీ తరువాత నృత్య ప్రదర్శనలో ఇంతవరకు ఉన్న రికార్డును అధిగమించి గినె్నస్ బుక్‌లో చోటు సంపాదించాలని తపన పడింది. ఆ ప్రయత్నంలోనే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తిరిగి వారణాసి చేరుకుంది. ఆచార్యులు రాజేష్ డోగ్రా ఆధ్వర్యంలో సాధన మొదలుపెట్టింది. తను అనుకున్నది సాధించింది. నిజానికి గినె్నస్ బుక్‌లో చోటు సంపాదించడం కోసం ఇది ఆమె రెండవ ప్రయత్నం. గత సంవత్సరం నవంబర్‌లో ఈ ప్రయత్నం చేసిన సోనీ 87 గంటలపాటు నృత్యం చేసిన తరువాత ఇక నిలదొక్కుకోలేకపోయింది. గతంలో అనుభవం ద్వారా మరింత పటుత్వాన్ని సంతరించుకోని ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరున తన ప్రయత్నంలో విజ యం సాధించింది సోనీ చౌరాసియా.
ఇప్పటికే ఈమె ఎన్నో పతకాలు, రికార్డులు సాధించింది. 2010లో రోలర్
స్కేట్స్‌తో నృ త్యం చేసి బం గారు పతకాన్ని సొంతం చేసుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించుకుంది. గంగా మహోత్సవాల్లో ఆమె చేసిన నృత్యానికి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రపంచ యాత్ర చేయడం, బాలీవుడ్ నృత్య దర్శకురాలు కావడం తన కోరిక అంటుంది సోనీ చౌరాసియా. తనకెదురైన సవాళ్లకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని ఎదురొడ్డి పోరాడి, గృహహింస నుండి బయటపడి తన అస్థిత్వాన్ని నిలుపుకోవడమే కాకుం డా అరుదైన ఘనతను సా ధించిన సోనీ ప్రస్తుతం కాశీ పట్టణానికి బేటీ బచా వో, బేటీ పఢావో కా ర్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గౌరవాన్ని దక్కించుకుంది. కథక్ నృత్యంలో డిప్లొ మా, హిం దూస్తానీ సంగీతంలో పోస్ట్ గ్రా డ్యుయేట్ డిగ్రీని సాధించిన సోనీ ఏదై నా సాధించాలన్న తపన, దానికి అకుంఠిత దీక్ష తోడైతే సాధించలేనిదేదీ లేదంటారు. సమాజం కోసం ఏదైనా చేయాలన్నదే తన ఆశయమని, దానికోసం నిరంతరం కృషి చేస్తానని చెప్తారు.

- గాయత్రి