మెయిన్ ఫీచర్

అమ్మాయలూ జాగ్రత్త..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకం పోకడ అంతగా తెలియని టీనేజీ యువతీ యువకులు తాము చూసిందల్ల నిజం అని నమ్మేస్తారు.. తాము చేసిందల్లా ‘కరక్టే’ అని భ్రమిస్తుంటారు. చదువుకోవాల్సిన వయసులో కొంతమంది ప్రేమపేరుతో కాలాన్ని వృథా చేస్తూ సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా టీనేజీ యువతులు ప్రేమమోజులో పడి సులువుగా మోసపోతున్న ఉదంతాలు నేడు నిత్యకృత్యమైపోయాయి. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు నానాటికీ మితిమీరుతుండగా ప్రేమముసుగులో ఎందరో యువతులు వంచనకు గురవుతున్నారు. లైంగిక నేరాలను నివారించేందుకు ప్రభుత్వం ఎనె్నన్ని కొత్త చట్టాలు తెచ్చినా మహిళల పట్ల అకృత్యాలకు అంతం లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా కొంతమంది యువతులు ఊహాలోకాల్లో తేలిపోతూ టీనేజీ ప్రేమలన్నీ నిజమేనని నమ్ముతూ కష్టాల పాలవుతున్నారు. కాలేజీకి ఎందుకు వెళుతున్నామనే విషయాన్ని మరచిపోయి కొంతమంది యువతీ యువకులు ప్రేమవ్యవహారాల్లో కూరుకుపోతూ తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. తెలివైన కొంతమంది అమ్మాయిలు సైతం ప్రేమపేరుతో చదువును నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ప్రేమించడం తప్పు కాకపోయినా, చదువు, కెరీర్ పట్ల ముందుగా శ్రద్ధ చూపాలి. తమకాళ్లమీద తాము నిలబడినపుడుప్రేమించి పెళ్లిచేసుకున్నా ఎవరూ కాదనలేరు. చదువుకునే వయసులో ప్రేమపేరుతో దగ్గరవ్వాలనుకునే అబ్బాయిల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రేమిస్తున్నానంటూ వెంటపడే యువకుల మనస్తత్వాన్ని సరైన రీతిలో అంచనా వేయగలిగితే అమ్మాయిలు సమస్యల బారిన పడకుండా ఉంటే అవకాశం ఉంటుంది. నిత్యం తమ అందచందాలను పొగుడుతూ, ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు సిద్ధపడే యువకుల నిజాయితీ ఎంతటిదో అమ్మాయిలు తెలుసుకోవాలి. ప్రేమపేరుతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించే అబ్బాయిల గురించి వాస్తవాలు తెలుసుకుంటే ఆ తర్వాత చింతించాల్సిన అవసరం ఉండదు.
- అందచందాలను వర్ణిస్తుంటే ఏ అమ్మాయైనా ఇట్టే బుట్టలో పడాల్సిందేనని కొందరు యువకులు భావిస్తుంటారు. ఇలాంటి పొగడ్తల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలి.
- అమ్మాయిల హృదయాలను దోచుకోవడానికి కొందరు అబ్బాయిలు బహుమతులను ఎరగా వేస్తుంటారు. ఖరీదైన కానుకలను స్వీకరిస్తూ ప్రేమంటే ఇదే అని భ్రమపడుతుంటారు కొందరు అమ్మాయిలు. బహమతుల్ని అందుకుంటూ మనసు ఇచ్చేయడం తొందరపాటు చర్య అని టీనేజీ యువతులు తెలుసుకోవాలి.
- ప్రేమిస్తున్నానంటూ వెంటపడే యువకుల ప్రవర్తన, వారి కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీయాలి. ప్రేమికుడు మిగతా అందరితో సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడా? లేదా? అని తెలుసుకోవాలి. వారి ప్రేమలో నిజాయితీ పాలు ఎంతో లెక్క కట్టి అడుగేయాలి.
* చదువు, చిరునామా, ఉద్యోగం, కుటుంబ విషయాలు.. ఇలా పూర్తి వివరాలు రాబట్టగలగాలి. బైక్‌లు, కార్లు స్నేహితులవైనా తనవేనని చెబుతూ బురిడీకొట్టించే ప్రమాదముంది. డబ్బుకు లోటులేదని చెప్పడానికి చేసే ప్రయత్నాల్లో నిజానిజాలను గ్రహించాలి.
* గర్ల్‌ఫ్రెండ్ సరదా కోసమో, కాలక్షేపానికో అనుకునేవారున్నారు. ఇదివరకే పెళ్లి అయిన వాళ్లు, పిల్లలున్నవాళ్లు కొత్త స్నేహాల కోసం వెంపర్లాడుతుంటారు. ఇలాంటివారి మోసాలకు గురికాకుండా అమ్మాయిలే జాగ్రత్తపడాలి.
* పబ్బులు, పార్టీలు ఇలా దేనికైనా ఒంటరి ప్రయాణం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. ఒంటరిగా రావాలంటూ ఒత్తిడి చేసే ప్రేమికుడి పట్ల అప్రమత్తత అవసరం. ఒంటరిగా వెళ్లే యువతుల పట్ల ఎలాంటి అకృత్యాలైనా జరిగే ప్రమాదం ఉంది.
* బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్‌కి పోవడం, ఒకే గదిలో వుండడం, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, రాత్రివేళల్లో కలిసి తిరగడం అత్యంత ప్రమాదకరం.
* అంతగా పరిచయం లేని వారు ఇచ్చే డ్రింకులు, ఆహారం విషయంలో అమ్మాయిలు జాగ్రత్తపడాలి. మత్తుపానీయాల జోలికి వెళ్లకపోవడం మరీ శ్రేయస్కరం.
*ప్రేమికుడితో ఎక్కడికి వెళ్లినా అది నలుగురూ అందుబాటులో ఉండేదై ఉండాలి. ఏకాంతం కోసం అని నిర్జన ప్రదేశాలకు వెళ్లడం మంచిది కాదు.
* బాయ్‌ఫ్రెండ్ వెకిలి చేష్టలకు పాల్పడితే ఎప్పటికప్పుడు నిరోధించగలగాలి. అలాంటివారి ప్రేమను ఆదిలోనే తిరస్కరించాలి.
* అవకాశం చిక్కినపుడల్లా తన ప్రేమికుడికి ఇంకెవరితోనైనా సంబంధాలున్నాయా? లేదా? అని కనిపెడుతూ ఉండాలి.
* ఒకరికై ఒకరు వెచ్చిస్తున్న డబ్బు ఎంతో గుర్తుపెట్టుకోవాలి. బాయ్‌ఫ్రెండ్ ఎక్కువగా ఖర్చు చేస్తున్నా, అతడి కోసం అమ్మాయి ఎక్కువ డబ్బు వెచ్చిస్తున్నా అది ఆర్భాటం కోసం, ఆర్థిక స్థితిని గొప్పగా చెప్పుకోవడం కోసమే. ఆ ప్రేమలో నిజాయితీ లేనట్లే.
జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అతను అందగాడా? ధనవంతుడా? అని చూసుకోవడం కంటే, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. శాశ్వతం కాని అందం, ధనం, ఆకర్షణ అనే భ్రమల్లో పడి అదే ప్రేమ అనుకుంటే- చివరికి మనశ్శాంతి కరవవుతుంది.

-ముసునూరి మురళీకృష్ణ