మెయిన్ ఫీచర్

పెళ్లంటే నూరేళ్ల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ అనీ, ‘నూరు ఏళ్లపాటు సాగవలసిన పంట’ అనీ, ఒక తరానికీ మరో తరానికీ మధ్య సుమారు ఇరవై ఏళ్ల వ్యత్యాసం వుంటుంది కాబట్టి ఐదు తరాల వరకు మూడు పూలు ఆరు కాయలుగా పెరుగుతూ మాధుర్యాన్ని పెంచి అందరికీ పంచేదనీ, వేద సంప్రదాయాన్ని తు.చ తప్పకుండా పాటించే భారతీయులందరికీ తెలిసిన విషయం.
‘శత ఆయుష్మాన్ భవ’ - ‘ వంద సంవత్సరాలు ఆనందంగా జీవించు’ అనేది పెద్దలందరూ పిల్లలకిచ్చే ఆశీర్వాదం.
ఇంతకూ ‘పెళ్లి’ అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? దాని మూల రూపం ఏమిటి? అని ప్రశ్నించినపుడు మాత్రం చాలా మంది పండితులు సైతం సరైన జవాబు చెప్పలేక తల గోక్కొనడం తప్పకపోవచ్చు.
అయినా ‘పెళ్లి నూరేళ్ల పంట’ అనే విషయాన్ని గురించి చర్చిస్తున్నపుడు పెళ్లి అనే పదం ఎలా ఏర్పడిందో, దాని అసలు అర్థం ఏమిటో మనకు తెలియడం అవసరం కదా! కాని పెళ్లి అనే పదానికి మూలరూపం తెలియడం కొద్దిగా కష్టమే కావచ్చు.
ఎందువల్లనంటే ‘పెళ్లి’ అనే పదానికి పూర్వరూపం ‘పెండిలి’- దాని పూర్వరూపం ‘పెణిడవి’- దాని పూర్వ రూపం ‘పాణిధారణ’ అనగా ‘పాణిగ్రహణం’ అనగా వేదధర్మం ప్రకారం 16 ఏళ్ల యువతి 25 ఏళ్ల యువకుణ్ణి తన ప్రాణమిత్రుడుగా, తన రక్షకుడుగా, భర్తగా ఎన్నుకొని అతని చేతిని పట్టుకొనడం కాబట్టి.
‘్భర్త’ అనే పదానికి ఆంగ్ల పర్యాయ పదం హజ్బెండ్. కాని హజ్బెండ్ అనే పదానికి సంస్కృత మూలరూపం ‘అనుబంధు’ అనగా ‘ప్రాణమిత్రుడు’ అని ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు.
అందువల్ల ‘పెళ్లి’ అనగా ‘పాణిగ్రహణం’ అంటే 16 ఏళ్ళ యువతి 25 ఏళ్ల యువకుణ్ణి తన ప్రాణమిత్రుడుగా, భర్తగా ఎన్నుకొని తన కుడి చేతితో అతడి ఎడమ చేతని గట్టిగా పట్టుకొనడం అన్నమాట.
ఈనాటి ప్రజల ఆలోచనల ప్రకారం- అమ్మాయి 18 ఏళ్లు నిండి అబ్బాయి ఆమెకన్నా ఒకటి లేక రెండేళ్లు పెద్దవాడై ఉంటే- ఒకరినొకరు ఇష్టపడితే ఎట్టి సంశయం లేకుండా పెళ్లి చేసెయ్యవచ్చు.
కానీ ప్రాచీనుల నిశ్చితాభిప్రాయం దీనికన్నా కొంత భిన్నంగా ఉన్నది. వారు నిర్థారించిన విషయం.
ఊన షొడశ వర్షాయాం అప్రాప్తః పంచవింశతిం
నకోపి యువకోదిష్ట్యా గర్భాదానం నకారయత్
దిర్లక్ష్యా గర్భవిచ్ఛిత్తిః ప్రసూతేపి మృతో శిశుః
జీవితోపి భవేత్ రోగీ అర్థాయుష్కాహి నిశ్చియః
16 ఏళ్ల కన్నా తక్కువ వయసుగల యువతితో 25 ఏళ్లలోపు వయసున్న యువకుడు గర్భాదానం- లైంగిక సంపర్కం చేసినట్టయితే ఆమె గర్భం ధరించి ఆ గర్భంలోనే శిశువును కోల్పోతుంది. ఒకవేళ బిడ్డను ప్రసవించినా ఆ శిశువు కూడా మృతి చెందుతుంది. ఒకవేళ జీవించి యున్నా ఆ బాలుడు బాలిక ఏవో రోగాలతో బాధపడుతూ మధ్య వయస్సులోనే మృతి చెందడం జరుగుంతుంది అని దీని అర్థం.
దీనివల్ల యువకుడు 25 ఏళ్ల వరకూ బ్రహ్మచర్య నిష్ఠతో ఉండి తనలోని వీర్యాన్ని వ్యర్థం చేయకుండా బలంగా ఉంచుకొనగలిగితే వివాహం తర్వాత అతడికి కలిగే సంతానం బలంగా వుంటుంది. లేకుంటే రోగిష్టులైన పిల్లలే కలగడం, వాళ్లు చిన్నపుడు కానీ, అర్థాయుష్కులుగా గాని మృతి చెందడం జరుగుతుంది. ఈ సృష్టి రహస్యాన్ని గ్రహించి మగవాళ్లు 25 ఏళ్ల వరకు నిష్ఠగా బ్రహ్మచర్యాన్ని పాటించడం అవసరం అవుతుంది.
ఇక ఈనాడు దాదాపు అందరూ అతిక్రమిస్తున్న నియమం- భార్యాభర్తలమధ్య వయోభేదం తొమ్మిది ఏళ్లు వుండాలి అనేది. భర్తకన్నా భార్య 9 ఏళ్లు చిన్నది కాకపోతే భార్యయే భర్తకన్నా బలం కలిగినదై వారికి అధికంగా స్ర్తి సంతతియే కలుగుతుంది అని తెలియవస్తున్నది.
ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక సృష్టి రహస్యం ఏమిటంటే- పురుషులు 25 ఏళ్లు వచ్చేనాటికి పొందే మానసిక పరిపక్వతను స్ర్తిలు 16 ఏళ్లు వచ్చేసరికి పొందగలుగుతారనీ, పురుషులు ప్రపంచ సంబంధ విషయాలను గురించి, ప్రపంచ అతీత విషయాలను గురించీ తీవ్రంగా యోచిస్తూ తరచుగా మనఃస్థైర్యాన్ని కోల్పోతూ, కోపతాపాలకు గురి అవుతూ ఉండగా స్ర్తిలు మాత్రం తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శ్రద్ధగా పరిశీలించి అర్థం చేసుకుంటూ జీవితాన్ని సాధ్యమైనంతగా సుస్థిరంగా, ఆనందమయంగా ఉండేట్టు చేసుకొనగల్గడమే.
నిజానికి స్ర్తిలలో ఉండే అద్భుతమైన శక్తి- ఎట్టి కష్టాన్నైనా సహిస్తూ సుస్థిరంగా, నిర్భయంగా నిలవగల్గడమే. భర్త తన జీవిత వ్యవహారాలలో ఎంతగా ఎదురుదెబ్బలు తిని ఇంటికి చేరినా అతడిని సేదదీర్చి, ధైర్యం చెప్పి, ఆనందపరిచి తిరిగి జీవిత యుద్ధంలో వీరుడై పోరాడగలిగే శక్తిని ఇచ్చేదీ- ఏది సరైన మార్గమో, ఏది సరియనది కాదో తెలియజెప్పేది భార్య మాత్రమే.
అందువల్లనే మన ప్రాచీనులు వేద ధర్మం ప్రకారం వివాహం చేసుకున్న యువతి లక్షణాలనూ, ధర్మపత్ని లక్షణాలను వివరిస్తూ-
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
క్రోధౌన అగ్నీ క్షమయా ధరిత్రీ
షట్కర్మ యుక్తా ఖలు ధర్మపత్నీ- అని ప్రకటించడం జరిగింది.
ఇలా సర్వశక్తిమంతురాలైన స్ర్తి ఎన్నడూ కోరుకొనేది తన భర్త తన కన్నా హెచ్చుగా శక్తిమంతుడై సామాజిక వ్యవహారాలలో వీరుడై ముందుకు సాగుతూ అందరి మెప్పు పొందుతూ ఉండాలి. అందుకు తగినట్లుగా ప్రతి భార్యా తన భర్తకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ అతడితోనూ, పెద్దలతోనూ తమ సంతానంతోనూ కలిసి నూరేళ్లపాటు మంచి ఆరోగ్యంతో ఆనందంతో జీలించగలుగుతూ అన్ని విధాలా కృషి చేస్తూనే వుంటుంది. ఇదీ వేద ధర్మం రహస్యం. సృష్టిరహస్యం.
‘పెళ్లి నూరేళ్ల పంట’ అంటే ఇంత అర్థం ఉందని ఈనాటి యువత గ్రహించగల్గుతుందా? వేదధర్మం విధించే నియమాలు ఈనాటి సైన్స్ నిష్పక్షపాతంగా చెప్పే కథన సత్యాలేననీ, వాటిని సంయమనంతో పాటించగల్గడమే మానవ జాతి సంపూర్ణ ఆనందంతో జీవించడానికి మార్గదర్శకం కాగల్గుతుందనీ నేటి యువతీ యువకులు అర్థం చేసుకొనగల్గుతారా? వేచి చూద్దాం!

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి