మెయిన్ ఫీచర్

మంచి ఆరోగ్యం కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యం అంతా అంకెల్లోనే వుంది. కొలెస్ట్రాల్ 200 కంటే తక్కువ వుండాలి. రక్తపోటు 100/70, క్యాలరీలు రోజుకు పనిచేసే స్ర్తికి 1800, పురుషుడికి 2000, బాడీ మాస్ ఇండెక్స్ 25... చక్కటి ఆరోగ్యానికి ఇవన్నీ ఈ స్థాయిల్లోనే వుండటం అవసరం. బహుశా చాలామందికి ఈ వివరాలు తెలిసే వుంటాయి. ఇవన్నీ సరిగ్గా వున్నా, గుడ్ హెల్త్ కోసం తెలియాల్సిన,
పాటించాల్సిన గణాంకాలు ఇంకా వున్నాయి.
15 నిముషాలు: ఫిట్‌నెస్ వున్న వాళ్ళు రోజుకో మైలు నడవటానికి ఈ సమయం పడుతుంది. మీకు ఇంకా ఎక్కువసేపే పడుతున్నట్లయితే ఇలా చేయండి. మైలును నాలుగు భాగాలుగా చేసుకోండి. మొదటి పావు భాగాన్ని పూర్తి స్పీడుతో పూర్తిచేయండి. రెండో పావును మామూలుగా నడవండి. మూడో పావు మైలును మళ్లీ మొదటిసారంత వేగం.. చివరి నాలుగో వంతు దూరం మామూలు నడక.. ఇలా నాలుగు వారాలు ‘విరామాల వాకింగ్’ చేయండి. ఆ తర్వాత మొత్తం మైలు దూరాన్ని మీరు నడవగలిగినంత గరిష్ఠ వేగంతో నడిచేయండి.
287 క్యాలరీలు: కోకోనట్ స్కూప్ ఐస్‌క్రీంలో వుండే క్యాలరీల సంఖ్య ఇంత. వీటిని శరీరంలో పేరుకుపోకుండా కరిగించాలంటే 60 కేజీల మనిషి 10 నిముషాలకు ఒక మైలు వేగంతో 29 నిముషాలు నడవాల్సిందే. ఆలోచించుకోండి. ఒక నిముషం జిహ్వ తృప్తికోసం దాదాపు అరగంట సమయం ఖర్చు చేస్తారా?
10,000 అడుగులు: రోజూ 30 నిముషాలపాటు శారీరక శ్రమ చేసినంత ఫలితం ఈ సంఖ్యతో లభిస్తుంది. కారుంటే, వెళ్లాల్సిన చోటుకు ఇంకొంచెం దూరంగా పార్క్ చేయండి. రెండు అంతస్తుల వరకూ లిఫ్ట్ వద్దు. పక్క క్యాబిన్‌లో కొలీగ్స్‌కి ఇ-మెయిల్స్ ఇచ్చే బదులు రెండడుగులు వేసి వారితో నేరుగా మాట్లాడండి.. ఇలా ఇలా 10వేల అడుగులు పూర్తిచేయండి. అన్నట్లు, ఎన్ని అడుగులు నడిచిందీ చెప్పే మీటర్లు కూడా వచ్చాయి. బెల్ట్‌కు అదొకటి తగిలిస్తే ఎప్పటికప్పుడు ఎన్ని అడుగులు నడిచిందీ తెలిసిపోతుంది.
6 గ్రాముల కొవ్వు: కూరగాయల్లోనుంచి యాంటీ ఆక్సిడెంట్‌ను శరీరం గ్రహించడానికి ఈ పాటి కొవ్వు చాలు. యాంటీ ఆక్సిడెంట్లు జబ్బులతో పోరాడడానికి అవసరం. కొవ్వు లు మాత్రమే వీటిని తయారుచేసి అందించగలవు. ఓ అధ్యయనం ప్రకారం.. ఫ్యాట్స్ పూత లేకుండా తయారుచేసిన మిక్స్‌డ్ విజిటబుల్ సలాడ్ తిన్నవారిలో కొద్ది మొత్తంలోనే బీటా కెరోటిన్ వంటి కెరటాయిడ్స్ శరీరంలోకి చేరాయి. అలా అని కొవ్వుల్లో మునిగి తేలక్కర్లేదని, ఒక టీ స్పూన్ చాలని అధ్యయనంలో తేల్చారు.
2 నిముషాలు: గారపట్టకుండా పళ్ళు తోముకోవడానికి ఈ మాత్రం సమయం అవసరం. బ్రష్ పంటిమీద నుంచి చిగురుదాకా వెళ్ళేట్లు పట్టుకుంటే రెండు నిముషాలు సరిపోతుంది. లేదంటే అరగంట తోమినా ప్రయోజనం వుండదు.
5 కోట్లు: ఏటా ఇంతమంది పొగ తాగడంవల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ లో సగంమంది 30-69 ఏళ్ళ మధ్య వయస్సు వున్నవాళ్ళే.
10: పది ప్రధాన రకాల కండరాలపై దృష్టి సారించి వ్యాయామం చేయాలి. ఏదో ఒక భాగంలోని కండరాలకు పనిపెడితే సరిపోదు. దృఢమైన, సమగ్రమైన దేహం కోసం అన్ని కండరాలకూ వ్యాయామం కావాల్సిందేనని అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్‌ర్‌సైజ్ సంస్థ చీఫ్ ఫిజియాలజిస్ట్ సెడ్రిక్ ఎక్స్‌బ్రియాట్ చెబుతున్నారు. దీనికి 20 నిముషాలకంటే ఎక్కువ పట్టదని బ్రియాంట్ సలహా ఇస్తున్నారు.
86 నిముషాలు: రోజూ టీవీ చూస్తూ టైంపాస్ చేస్తే స్థూలకాయం మీ సొంతమయ్యే రిస్కుంది. రోజూ రెండు గంటలు టీవీ చూస్తే స్థూలకాయం రావడానికి 23 శాతం అధిక అవకాశం వుంటుంది. అదే నాలుగు గంటలైతే 46 శాతానికి రిస్క్ పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది రోజుకు ఐదు గంటలపాటు టెలివిజన్ చూస్తూ కాలం గడుపుతున్నారని అంచనా.

రోజుకు ఒక సాఫ్ట్ డ్రింక్
ఇది చాలు బరువు పెరగటానికి, వయసుతో రాగల టైప్ 2 డయాబెటిస్‌కూ అంటున్నారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు! వారానికి ఒకటి రెండుసార్లకు బదులు రోజుకు ఒకటి అంతకంటే ఎక్కువసార్లు కోలా డ్రింక్స్ తాగడం ప్రారంభించాక 4 ఏళ్ళలో సగటు 10 సార్లకంటే ఎక్కువ బరువు పెరిగారు. షుగర్ జబ్బు రాగల రిస్కు 83 శాతం ఎక్కువైంది. క్యాలరీలు తక్కువవుంటే ‘డయట్ కోలా’లు తాగిన వారిలోనూ ఇలానే జరిగింది. కారణం తెలియదు. కాబట్టి బెస్ట్ ఏమిటంటే, సాఫ్ట్ డ్రింక్స్ పూర్తిగా మానేయడమే.

32-34:
ఆరోగ్యవంతమైన భారతీయ స్ర్తిలకు, పురుషులకూ వుండాల్సిన నడుం కొలతలివి. దాటితే డయాబెటిస్‌కు దగ్గర అవుతున్నట్లే మరి!

- మున్నీ