జాతీయ వార్తలు

బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీకి ఒప్పుకోం:మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: అసోంలో జరిగినట్లు బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీకి అనుమతించమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆమె కార్మిక సంఘాల సమావేశంలో మాట్లాడుతూ.. అసోం ఒప్పందం కారణంగానే అక్కడ ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ జరిగిందని అన్నారు. దీనివల్ల ఆ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారని ఆమె ధ్వజమెత్తారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నదని, ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో కూడా ఎన్‌ఆర్‌సీ అమలుకాకుండా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. బ్యాంకింగ్ రంగమంతా గజిబిజిగా ఉందని అన్నారు.