Others

మళ్లీ ఆర్యతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ల హీరో -ఆర్య. అతనితో కలిసి నటించేందుకు హీరోయిన్ ఎవ్వరైనా యస్ అంటారు, ఎగిరి గంతేస్తారు కూడా. పైగా ఒక్క సినిమాలో జతకట్టినా -ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉంటుందటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చేస్తుంటాడు. అతని ఖాతాలో సెనే్సషనల్ సినిమాలు పెద్దగా లేకపోయినా -ఆర్యతో జత కట్టేందుకు హీరోయిన్లు మాత్రం ఎప్పుడూ ఎవ్వర్రెడీనే. ఆ క్రెడిట్ ఆర్య నిలబెట్టుకుంటాడు కనుకే -తాజాగా నయనతార మరోసారి జత కట్టేందుకు డేట్లు అడ్జెస్ట్ చేసి మరీ ఇచ్చిందట. బాస్ ఎంగిర భాస్కరన్, రాజారాణి, ఆరంభం చిత్రాల్లో ఆర్యతో స్క్రీన్‌ను పండించిన నయన్, తాజాగా మరో సినిమాకు సైన్ చేసిందని అంటున్నారు. ఆర్య హీరోగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఆమెను సంప్రదిస్తే -ఖాళీలేని ఆమె డైరీలో ఓ పేజీ క్రియేట్ చేసి మరీ డేట్స్ ఇచ్చిందట. ఇష్టపడి చేస్తున్న సినిమా కనుక -కెమిస్ట్రీ ఇంకెంత గొప్పగా ఉంటుందో చూద్దాం.