సబ్ ఫీచర్

మత విశ్వాసాలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అరాచక శక్తులు, కుహనా సెక్యులరిస్టులు, మెజారిటీ సమాజం వారి విశ్వాసాలను అధిక్షేపించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని వితండ వాదాలతో యాగీచేస్తూ ఏదో విధంగా తమ పబ్బం గడుపుకోవాలి అని తెగ తాపత్రయ పడుతున్నారు. వీరికితోడు మీడియావారి కాకిగోల ఉండనే ఉన్నది. నిన్నమొన్నటివరకు ఆవుచుట్టు ప్రదక్షిణం చేసినవారు ఇప్పుడు హిందూ దేవాలయాల చుట్టూ పొర్లుదండాలు పెడుతున్నారు. కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కూర్ దేవస్థానం శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీచేసింది. దీనివల్ల దేశంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందంటూ ఒక మహిళ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించి సంజాయిషీ కోరుతున్నారు. ఇది నిజమైన భక్తుల చర్యకాదు. దురుద్దేశ పూర్వకంగా అరాచకశక్తులు వెనుక వుండి ఆడిస్తున్న నాటకం. ఎన్నో శతాబ్దాలనుండి కొన్ని ఆచారాలు, అలవాట్లు ఏర్పరుచుకొని ఆ విధంగా తమ ఇష్టదైవాలను ప్రార్థించుకొంటూ అన్ని మతాలవారు సహజీవనం చేస్తున్న దేశం మనది. మన దేశంలోని న్యాయస్థానానికి ఉన్నత గౌరవం ఉన్నది. కాని మతపరమైన విషయాలలో కలుగజేసుకొనడం అంత అభిలషణీయం కాదు.
ప్రార్థనా స్థలాలలో రకరకాల ఆచారాలు ఉన్నాయి. చర్చిలలోకి పాదరక్షలతో అనుమతిస్తారు. మసీదులలో ఆడవారికి అనుమతి లేదు. గురుద్వారాలలోకి తలపై ఆచ్ఛాదనం లేకుండా స్ర్తిలుగాని, పురుషులుకాని ప్రవేశానికి అనుమతి లేదు. ఆ విధంగానే శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించటానికి స్ర్తిలకు అనుమతి లేదు. అదే చిన్న పిల్లలకు వయసు పైబడినవారి ప్రవేశం ఉన్నది. అయ్యప్పస్వామిని దర్శించటానికి ఒక నిష్ఠగా మండలం రోజులు పూజచేసి దర్శించుకోవాలి. నిజంగా ఆలోచిస్తే ఆడవారికి 10 నుండి 50 ఏళ్ల వయసు వరకు ఎంతమంది శ్రద్ధగా పూజచేసి వెళ్ళటానికి వీలవుతుంది? వారి శరీరం అందుకు సహకరిస్తుందా? ఆడవారి హక్కులకు భంగం కలిగించే రీతిలో ఉన్నాయంటూ కోర్టువారు సంజాయిషీ కోరడం ఎంతవరకు సమంజసం?
మన పొరుగు రాష్టమ్రైన తమిళనాడులో ఆలయాలు దర్శించుకొనే భక్తులకు డ్రస్ కోడ్‌ను అక్కడి హిందూ దేవాలయ కమిటీ తప్పనిసరి చేసింది. ఈ విషయంమీద కూడా పెద్ద రాద్ధాంతాన్ని లేవనెత్తి అక్కడి హైకోర్టుద్వారా స్టే ఆర్డర్ తీసుకు వస్తున్నారు. దీని వెనుక కుహనా లౌకికవాదుల హస్తం లేకపోలేదు.న్యాయస్థానాలలో లాయర్లు, జడ్జిలు నల్లకోటు ధరించడం, పోలీస్ వ్యవస్థవారు ఖాకీ బట్ట ధరించడం. విద్యార్థులు కాన్వకేషన్స్‌లో ధరించే గౌనులు ఇలా ఎన్నోరకాల డ్రస్ కోడ్‌లను ఆచరిస్తున్నాం. అలాంటిది ఆధ్యాత్మిక విషయమైన ప్రార్థనా స్థలంలో డ్రెస్‌కోడ్ విధిస్తే నష్టం ఏముంది? ఇదంతా విదేశీ ఏజెంట్లు చేస్తున్న కుట్రలో భాగమే. మన సమైక్య భారతావనిలో అన్ని మతాలవారు సోదరభావంతో కలసిమెలసి ఉండి దేశాభివృద్ధికి పాటుపడటానికి అనువుగా రాజ్యాంగాన్ని రూపొందించుకొన్నాం. అలాంటిది కొన్ని మతాల మనోభావాలు కించపరచి మన సమైక్యతను భగ్నంచెయ్యటానికి దుష్టశక్తులు పన్నాగాలు పన్నుతున్నాయి.
ప్రధాని నరేంద్రమోది మన దేశానికి ఆశాజ్యోతి లాంటివారు. ఆయననాయకత్వంలో మన దేశం సాంకేతిక రంగంలో చైనాకన్నా మెరుగ్గా రెండంకెల అభివృద్ధిసాధించి ప్రపంచంలో అగ్రగామిగా నిలబడి ఇంకా ముందుకు దూసుకెళుతోంది. ఓర్వలేనితనంతో విపక్షాలవారు ఇలాంటి ఆగడాలు చేస్తున్నారు. ఈ కుహనా లౌకికవాదుల వ్యవహారశైలిని దేశ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. గత శీతాకాల సమావేశాలలో వీరు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. తగిన సమయంలో ఇలాంటి అవకాశవాదులకు ప్రజలు బుద్ధిచెబుతారనేది అక్షర సత్యం.

- జన్నాభట్ల లక్ష్మికామేశ్వరి