మెగా జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాక్షసి’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైన లావణ్యా త్రిపాఠీకి ఈమధ్య వరుసగా రెండు విజయాలు దక్కాయి. నానితో భలేభలే మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో సూపర్‌హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు ఇప్పుడు అవకాశాల జోరు పెరిగింది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తున్న లావణ్యకు మరో క్రేజీ అవకాశం దక్కింది. వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కోట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో ఈమెను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం మెగా కుటుంబానికి చెందిన అల్లు శిరీష్ సరసన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్న ఈ భామ సందీప్‌కిషన్‌తో మరో సినిమా చేస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.