క్రీడాభూమి

మా అనే్న నాకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: తన అన్న అజిత్ తనకు స్ఫూర్తినిచ్చాడని, అతని కారణంగానే తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టగలిగానని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అన్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ వెస్టిండీస్‌తో చివరి టెస్టు ఆడిన తర్వాత కూడా తాను అవుటైన విధానంపై అజిత్‌తో చర్చించానని చెప్పాడు. ‘అదే నా చివరి టెస్టు. మళ్లీమళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడేది లేదని నాకు తెలుసు. అయినప్పటికీ నేను డిస్మిసల్‌పై మా అన్నతో చర్చించాను. అతనే నా చిన్నతనంలో ఆచ్రేకర్ దగ్గర చేర్పించాడు. అతని ప్రోత్సాహంతోనే నేను క్రికెటర్‌గా ఎదిగాను. ఎవరికైనా అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన తోడు అవసరం’ అన్నాడు. స్కూల్ క్రికెట్ ముగిసిన వెంటనే తాను ముంబయి రంజీ జట్టులో, జాతీయ జట్టుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించడం ఆరభించానని సచిన్ చెప్పాడు. అందుకే ఆచ్రేకర్‌ను ఎక్కువసార్లు కలవలేకపోయానని, అలాంటి సమయాల్లో తన అన్న అజిత్ నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నాడు. ఎలాంటి విమర్శలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. నిరంతరం శ్రమించడమే జీవితంలో ఎదుగుదలకు మార్గమని అన్నాడు. చిన్నతనంలో భారత జట్టు ప్రపంచ కప్‌ను గెల్చుకోవడాన్ని టీవీలో చూశానని, ఆ ట్రోఫీని తాను స్వయంగా స్వీకరించడానికి ఎంతోకాలం వేచి చూశానని సచిన్ అన్నాడు. 2011 వరల్డ్ కప్‌లో తన కోరిక నెరవేరిందన్నాడు.