క్రీడాభూమి

మెక్‌కలమ్ ఆఖరి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్‌లో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకూ 97 టెస్టులు ఆడిన అతను శనివారం న్యూజిలండ్‌తో ప్రారంభంకానున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ అతర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్టు అతను ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన న్యూజిలండ్ అత్యంత కీలకంగా మారిన రెండో టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌ను డ్రాగా ముగించాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ మెక్‌కలమ్‌కు విజయంతో ఘనంగా వీడ్కోలు పలడాలని కివీస్ క్రికెటర్లు ఆశిస్తున్నారు. ఈ కారణంగా వారంతా సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, ఇప్పటికే టెస్టుల్లో 100 సిక్సర్లుకొట్టి, టెస్టు క్రికెట్ చరిత్రలో ఎక్కువ సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆడం గిల్‌క్రిస్ట్‌తో కలిసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్టులో ఒక్క సిక్సర్‌ను కొట్టినా గిల్‌క్రిస్ట్‌ను రెండో స్థానానికి నెట్టేస్తాడు. క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరు సంపాదించిన మెక్‌కలమ్ తన చివరి టెస్టును ఏ విధంగా ముగిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.