రాష్ట్రీయం

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసునూరు, డిసెంబర్ 19: తనకున్న పొలంలో వరుసగా మూడు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో పంటలు పండక, బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక ఒక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దయనీయ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలం కొత్తూరులో శనివారం జరిగింది. కొత్తూరువాసి జోనుబోయిన నాగరాజు(40) తనకున్న రెండున్నర ఎకరాల్లో వ్యవసాయ సాగుకు ఒకటి తరువాత ఒకటి వరుసగా మూడు బోర్లు వేయించాడు.
అయినా నీరు పడలేదు. దీంతో బోర్లు వేసేందుకు చేసిన అప్పులు సుమారు రూ.4లక్షలకు చేరాయి. ఆ మొత్తం తిరిగి తీర్చలేక, అటు పంటలు పండక ఆవేదన చెందుతుండేవాడని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. శనివారం వేకువఝాజామున తోటలోకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన నాగరాజు తిరిగి రాకపోయేసరికి భార్య, పిల్లలు వెదికారు. చివరకు గ్రామం చివర ఉన్న చెరువులో శవమై ఉండటం చూసిన పశువుల కాపరులు సమాచారం అందించారు. నాగరాజు బంధువులు, గ్రామస్తులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. నాగరాజు భార్య బేబి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.