రివ్యూ

మార్క్ మార్చని పూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లోఫర్ (బాగోలేదు)

తారాగణం:
వరుణ్ తేజ్, దిశా పాట్ని, రేవతి,
పోసాని, ధన్‌రాజ్ తదితరులు
సంగీతం:
సునీల్ కశ్యప్
నిర్మాత:
శుభ శే్వతా ఫిలింస్
కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం:
పూరి జగన్నాధ్

ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా -మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్ తరువాత నటించిన కంచె సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. రెండు సాఫ్ట్ చిత్రాల తరువాత ఆయన నటించిన మాస్ సినిమా లోఫర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మాత సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాతో దిశాపాట్ని హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లోఫర్‌గా వరుణ్‌తేజ్ ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.
మురళి (పోసాని), లక్ష్మి (రేవతి) భార్యాభర్తలు. లక్ష్మిని ప్రేమించి పెళ్లిచేసుకుని -తరువాత ఆస్తి తేవాలని ఆమెతో గొడవ పడుతుంటాడు. తను అలా చేయనని అనడంతో మురళి కొడుకు రాజా (వరుణ్‌తేజ్)ని తనకన్నా లోఫర్‌లా పెంచాలని డిసైడై, అలా ఓరోజు రాత్రి తన కొడుకు రాజాని తీసుకొని నార్త్ ఇండియాలోని జోథ్‌పూర్‌లో సెటిలవుతాడు. మురళి కొడుకు రాజా (వరుణ్‌తేజ్) పెరిగి పెద్దవాడవుతూ -తండ్రిని మించిన లోఫర్ అవుతాడు. ఇద్దరు కలిసి దొంగతనాలు, కిడ్నాప్‌లు చేస్తుంటారు. అలా నడుస్తున్న కథలోకి హీరోయిన్ పారిజాతం (దిశా) ఎంట్రీ అవుతుంది. ఆమె ఫోన్ తండ్రి పోసాని కొట్టేస్తే, బ్యాగ్‌ను రాజు కొట్టేస్తాడు. ఆ అమ్మాయిని మొదటి చూపులోనే ఇష్టపడతాడు రాజు. మరోవైపు ముఖేష్ (ముఖేష్ రుషి) మనుషులు పారిజాతంని వెంటాడుతుంటారు. రాజా కళ్ళముందే కిడ్నాప్ చేస్తారు. అలా ఆమెను రక్షించే ప్రయత్నంలో లక్ష్మిని కలుస్తాడు రాజు. తరువాత అతనికి తెలిసిన విషయాలు ఏమిటి? అసలు లక్ష్మి తన తల్లి అని తెలుసుకున్నాడా లేదా? మరోవైపు పారిజాతంను ఎలా కాపాడాడు అనేది సినిమా.
సినిమాలో వరుణ్‌తేజ్ బాగా రెచ్చిపోయాడని చెప్పాలి. మొదటి రెండు సినిమాల్లో చాలా సైలెంట్‌గా కనిపించిన వరుణ్ ఇందులో చెలరేగిపోయాడు. మాస్ లుక్‌లో, మాస్ హీరో మానరిజమ్స్‌తో సినిమా మొత్తం ఆకట్టుకున్నాడు. పూరి సినిమాలో హీరో పాత్ర ఎలావుంటుందో అందరికీ తెలుసు. అలాంటి పాత్రకు వరుణ్ న్యాయం చేసాడు. మెగా హీరోల్లా మాస్ సినిమాలు చేయగలడా? అన్న అనుమానాన్ని చెరిపేశాడు. పూరి సినిమాలో అరిచినట్టుండే డైలాగ్ మెథడ్‌ని ఇందులో కూడా కొన్ని ఎపిసోడ్స్ విషయంలో ఇంకాస్త వర్కవుట్ చేయాలి. ఇకపోతే హీరోయిన్ దిశా పాట్ని కొత్తమ్మయి. పాత్రపరంగా బాగానే చేసింది. ఎప్పటిలానే సినిమాలో హీరోయిన్ పాత్ర గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే. కాని దిశాకి ఉన్నది కొన్ని సీనే్స అయినా ఆకట్టుకుంది. పాటలద్వారా మంచి డాన్స్ కనబర్చింది. కీలకమైన పాత్రల్లో కనిపించిన రేవతి, పోసాని ష్ణమురళిలు వారి పాత్రలకి వందశాతం న్యాయం చేశారు. సెకెండాఫ్‌లో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. విలన్స్‌గా ముఖేష్ రుషి, చరణ్‌దీప్‌లు మెప్పించగా పవిత్ర లోకేష్, ఉత్తేజ్‌లు గెస్ట్‌పాత్రలో కనిపిస్తారు. ఇకపోతే ఒక్కొక్క సీన్‌కి మాత్రమే పరిమితమైన అలీ, బ్రహ్మానందంలు మెరుపుతీగలా అలా కనిపించి వెళ్లిపోయారు తప్ప సినిమాకి ఉపయోగపడలేదు. సప్తగిరి, ధన్‌రాజ్‌లు ఫర్వాలేదనిపించారు. ముఖ్యంగా రన్నింగ్ పంచ్ కామెడీ బాగుంది.
పూరి జగన్నాథ్ ఈమధ్య కథల గురించి కష్టపడకుండా సింపుల్‌గా హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాని లాగించేస్తున్నాడు. అందుకే చెప్పుకోతగ్గ స్థాయిలో హిట్స్ రావడంలేదు. ఇపుడు లోఫర్ విషయంలోనూ అదే రిపీటైంది. ఎప్పటిలాగే హీరో క్యారెక్టరైజేషన్‌లో తన మార్క్ మాస్ మసాలా కలిపి కథ అల్లేశాడు. ప్రతి సినిమాలోని హీరోలానే ఇందులోనూ హీరో పాత్ర ఉంది. దాంతో రొటీన్ అనిపిస్తుంది. కానీ వరుణ్‌తేజ్‌ని మాస్ యాంగిల్‌లో చూడటం కొత్తకాబట్టి బాగానే ఉందన్న ఫీలింగూ కలుగుతుంది. ఇక కథాపరంగా రాసుకున్న కొన్ని సీన్లు తప్ప మిగతా అంతా ఇదివరకే పూరి సినిమాలో చూసేసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక పూరి స్క్రీన్‌ప్లే, నేరేషన్ అంటే చాలా స్పీడ్‌గా ఉంటుందనే పేరు. కాని ఇందులో స్పీడ్ విషయంలో పూరి మార్క్ తగ్గిందిని కనిపిస్తుంది. కానీ దానికి కారణం సినిమా రెగ్యులర్ పూరి స్టైల్‌లో సాగుతూ ఉండటం, అలాగే ఉన్న ఒక్క ట్విస్ట్ దాదాపు ఫస్ట్‌సీన్‌లో చెప్పేయడం, మిగిలిన బాలెన్స్‌ని ఇంటర్వెల్‌లో రివీల్ చేసెయ్యడమే. సెకెండాఫ్‌ని పూర్తి ఎమోషనల్ దారిలోకి తీసుకెళ్లిపోవడం వలన బాగా స్లోగా ఉంటుంది. వరుణ్‌తేజ్- రేవతిల మధ్య కొన్ని సీన్లు వర్కవుట్ అవ్వడంవలన సెకెండాఫ్ స్టార్టింగ్ బాగుందనిపిస్తుంది. తర్వాతంతా మామూలే. ఇక డైరెక్టర్‌గా తను రాసుకున్న డైలాగ్స్‌ని అందరి చేత బాగానే చెప్పించాడు. అలాగే వరుణ్‌తేజ్‌ని బాగానే ప్రెజెంట్ చేశాడు. ఇక మిగిలిన టెక్నికల్ టీం గురించి మాట్లాడాలంటే పిజి విందా సినిమాటోగ్రఫీ గురించే. ముఖ్యంగా జోథ్‌ధ్‌పూర్, రాజస్థాన్‌లోని పలు లొకేషన్స్‌ని చాలా బాగా చూపించడంవలన ఫస్ట్‌హాఫ్‌లో ఆడియన్స్‌కి విజువల్స్ పరంగా ఓ కొత్తదనం కనపడుతుంది. ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటలు బాగున్నాయి. కానీ వాటిని పిక్చరైజ్ చేసిన విధానం అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కానీ రీరికార్డింగ్ బాగుంది. తల్లీ కొడుకుల సెంటిమెంట్స్ సీన్లు పండాయి. ఎస్‌ఆర్ శేఖర్ ఎడిటింగ్‌పై ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. చివరగా సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ విలువలు బాగున్నాయి.
సినిమాలో కథ గురించి కొత్తగా చెప్పుకోవాల్సినంత విషయం లేదు. నిజానికి వరుణ్‌తేజ్‌కి మాస్ హీరో ఇమేజ్ తీసుకురావాలి అని చెప్పడం కోసమే తీసినట్టుంది. కేవలం రెండు మదర్ సెంటిమెంట్ సీన్లు, హీరో పాత్రతోనే సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ చెయ్యాలనుకోవడం సిల్లీ అనే చెప్పాలి. పూరి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌పరంగా ఎక్కువ కేర్ తీసుకోలేదు. సినిమా విషయంలో కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. మొత్తానికి పూరి స్టైల్ మాస్ మసాలా అంతే.

-త్రివేది