ఉత్తరాయణం

మరో ఏటీఎంను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లో మరొక ఎటిఎమ్ యొక్క అవసరం ంతైనా వుంది. ప్రస్తుతం శాంతినగర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ ఎటిఎమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఎటిఎమ్ వినియోగించేవారు ఎక్కువ కావడంతో, డబ్బులు త్వరగా అయిపోతున్నాయి. అంతేకాదు సాంకేతిక కారణాలతో ఏదైనా ఎటిఎమ్ పనిచెయ్యకపోతే, మరో ఎటిఎమ్‌పై ఆధారపడాలి. అందులో డబ్బులు అయిపోతే దిక్కుతోచని పరిస్థితి. శాం తినగర్ మడల కేంద్రం కావడంతో చాలామంది ప్రజలు ఎటిఎమ్ సేవలను వినియోగిస్తున్నారు. వడ్డేపల్లి మండలంవారు మాత్రమే కాకుండా, ఇతర మండలాల వారు సైతం ఇక్కడి ఎటిఎమ్ సేవలు వినియోగిస్తున్నారు. అంతర్‌రాష్ట్ర రహదారి కావడంవల్ల చాలామంది వాహనదారులు సైతం ఈ ఎటిఎమ్ సేవలను వినియోగిస్తున్నారు. ఎటిఎమ్ సేవ లు వినియోగించేవారు ఎక్కువగా ఉన్నందున ఏదైనా ఒక బ్యాంక్ శాంతినగర్‌లో ఎటిఎమ్ ఏర్పాటుచేస్తే చాలా బాగుంటుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

ముత్యాలప్పకు రూ. 20 లక్షలు చెల్లించాలి
నవంబరు 21న గొందిరెడ్డిపల్లె సమీపంలో అదుపుతప్పి బస్సు గోతిలో పడింది. డ్రైవరు ముత్యాలప్ప చాకచక్యంగా బస్సును అదుపుచేసి నడపడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన జరిగిన 20 నిమిషాల తరువాత ఆందోళనకు గురైన డ్రైవరు గుండెపోటుతో మరణించాడు. బస్సులో 50 మంది వున్నారు. ప్రాణం విలువ లెక్కించలేము కదా! గనుక ఆర్టీసివారు డ్రైవరుకు 20 లక్షలు చెల్లించాలి.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు

అందరూ అందరే..!
మాట తప్పితే తల నరుక్కుంటా, మాట తప్పితే రాళ్ళతో కొట్టి చంపండి-తెలంగాణ సియం కెసిఆర్ మాటలకు కాంగ్రెసు, భాజపా వంటి రాజకీయ పార్టీల నేతలు ఎన్నిసార్లు తల నరుక్కుంటావ్? వంటి మాటలు తిరిగి అనవచ్చు. అవేవీ జరిగేవి కావు, అందరూ అందరే! వదిలేయండి. కాని ఒక బాధ్యత కల్గిన పదవిలో వుండి రాళ్ళతో కొట్టి చంపండి తననూ అంటూ హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడినందుకు చట్టం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్

కాంగ్రెస్ కపట నాటకం
అమీర్‌ఖాన్ సతీమణి, ఖాన్ అమీర్ దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడ్డానికి అతడొక పీకే, ఒక ఈడియట్, ఒక గజిని. ప్రధాని నరేంద్రమోదీకి ప్రపంచంలో పెరుగుతున్న ఆదరణను చూచి ఓర్వలేని కాంగ్రెస్ ఆడిస్తున్న ఆట, కమ్యూనిస్టుల మాట, ముస్లిం వర్గం బాట. ఖాన్‌ను సమర్ధించడానికి రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, కుహనా ముల్లా ఆయంసింగ్, లల్లులు, మిగిలిన ఖాన్‌లు ఎగబడ్డారు. అనురాధపోడ్వల్ భర్త సంగీత కళాకారుడు అతన్ని చంపినప్పుడు అసహనం ఎందుకు కలుగలేదు? కుహనా నాయకులకు, ఎందుకు కలుగలేదు? అప్పుడు గడ్డి తినేవాళ్ళా? భారతీయులను ముంబాయిలో ఉండో పేదవాళ్లను ‘స్లండాగ్స్’గా సినిమా తీసి అవమానిస్తే, అప్పుడు అసహనం ఎందుకు కలుగలేదు?
- గుడ్ల జగదీశ్వర్, హైదరాబాద్

మితిమీరిన స్వేచ్ఛ
రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఫలితంగా కొందరు ప్రముఖులు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా ప్రముఖ నటుడు షారూఖ్‌ఖాన్ ప్రకటనలు చేసి నెలరోజులు గడవకముందే, ముస్లింలపై అసహనం పెరుగుతున్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాలనిపిస్తోందంటూ మరొక బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్‌ఖాన్ ప్రకటించడం మితిమీరిన స్వేచ్ఛకు నిదర్శనం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధమైన మత కలహాలు జరగలేదు సరికదా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఆయన ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా, అసహనం ప్రతిబింబించే ఏ సంఘటనలు జరిగాయని అమీర్‌ఖాన్‌కు దేశం విడడిచిపోయే కష్టం వచ్చిందో అర్ధంకావడం లేదు. మోదీ ప్రభుత్వానికి వస్తున్న అపూర్వ ఆదరణకు తట్టుకోలేక కొన్ని కుహనా లౌకిక శక్తులు తెరవెనుక నుండి నడిపిస్తున్న నాటకం ఇది! నటుడిగా గుర్తింపు ఇచ్చిన దేశంపై విమర్శలు చేయడం దేశద్రోహంతో సమానం! లౌకికవాదం అంటే మత సామరస్యానికి ప్రతి రూపమైన హిందువులను విమర్శించడం, పర మతస్థులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రదర్శించడం అన్నట్లు మన సెక్యులర్ విపక్షాలు ప్రవర్తించడం బాధాకరం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

వివరణతో మరింత గందరగోళం
తన వ్యాఖ్యలపై అలజడి రేగడంతో అమీర్‌ఖాన్ ఇచ్చిన వివరణ మరింత గందరగోళ పరిచింది. భారత్‌లో పుట్టినందుకు గర్విస్తా. దేశం విడిచిపోను అంటూనే తన మీద వస్తున్న విమర్శలే దేశంలో అసహనం పెరుగుదలకు నిదర్శనం అన్నాడు. దర్శకురాలు ఫరాఖాన్ ఇతరులు కూడా వంత పాడారు. మేము మేధావులం అనుకునే వారితో ఇదే చిక్కు. తాము ఇతరుల్ని విమర్శిస్తే అది భావప్రకటనా స్వేచ్ఛ. ఇతరులు తమని విమర్శిస్తే మాత్రం అది అసహనం! ముంబాయిలో బాంబు దాడులు జరిగినప్పుడు ఒక్క మేధావీ నోరు మెదపలేదు. దేశం విడిచిపోతా అనలేదు. ఉగ్రవాదికి ఉరిశిక్ష అమలుచేస్తే దాన్ని ఆపడానికి శతవిధాలా ప్రయత్నించి చివరకు ప్రభుత్వాన్ని నిందించారు. ఇదీ మేధావుల తీరు!
- స్నేహమాధురి, పెద్దాపురం