ఏడాదికి ఓ సినిమా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లజ్జ చిత్రాన్ని నా శైలిలోనే చిత్రీకరించా. అలాగే నా పంథాలోనే ఏదో ఒకరోజు భారీ కమర్షియల్ హిట్ కొడతానన్న నమ్మకం వుంది. స్నేహితులతో కలసి నేను స్థాపించిన సంస్థ ద్వారా ప్రతీ ఏడాది ఓ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నా’ అని దర్శకుడు సంపత్ నంది అంటున్నారు.
మధుమిత, శివ, వరుణ్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘లజ్జ’ చిత్రానికి సంబంధించిన అభినందన కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. 24 ఫ్రేమ్స్ అకాడమీ సంస్థ మంచి చిత్రాల్ని అభినందించాలన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘లజ్జ’ చిత్రం తర్వాత ‘బుడ్డారెడ్డి బ్రేకింగ్ న్యూస్’ అనే సినిమాని ఇప్పటికే చాలా భాగం చిత్రీకరించామని, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. డబ్బు గురించి ఆలోచించకుండా మంచి చిత్రాలు తీయాలని మొదట అనుకున్నానని, అయితే మనస్సు కమర్షియల్ చిత్రాలవైపు మొగ్గుచూపుతోందని అన్నారు. అయితే ప్రస్తుతం అలా చేయలేకపోయానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
అలాగే దర్శక నిర్మాత సంపత్ నంది కూడా డబ్బు విషయం గురించి ఆలోచించకుండా తనదైన శైలిలోనే సినిమాలు చేస్తున్నారని, ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల అభిరుచిలో మార్పువస్తోందని, కానె్సప్ట్ తరహా ఓరియంటెడ్ చిత్రాలకు ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఈ చిత్రం ద్వారా మరింత కలిగిందని ఆయన వివరించారు. మంచి సినిమాను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాము ఈ చిత్రానికి అవార్డు అందించామని విశ్వనాథ్ తన్నీరు తెలిపారు. కార్యక్రమంలో మధుమిత, శివ, వరుణ్, మురళీమోహన్‌రెడ్డి, సుక్కు తదితర యూనిట్ సభ్యులకు వి.సాగర్, నక్కిన త్రినాథరావు, తమ్మారెడ్డి భరద్వాజ జ్ఞాపికలు అందజేశారు.