జాతీయ వార్తలు

లాలూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లాలూ కుటుంబంపై ముఖ్యంగా మాజీ సీఎం రబ్రీదేవిపై ఆ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ తండ్రి చంద్రికారాయ్ మండిపడుతున్నారు. అత్తింటికి వచ్చిన తన కుమార్తె ఐశ్వర్యారాయ్‌ను అత్త రబ్రీదేవి ఇంటి నుంచి గెంటేశారని ఆయన అన్నారు. గతంలోనూ ఇలాగే చేశారని, లాలూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని ఆగ్రహాంతో అన్నారు. తన కుమార్తెకే ఇలాంటి పరిస్థితి వస్తే రాష్ట్రంలో మిగిలిన మహిళల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాగా ఐశ్వర్యారాయ్ తల్లి పూర్ణిమారాయ్ మాట్లాడుతూ లాలూ కుటుంబ సభ్యులంతా వికృత మనస్తత్వం కలవారని అన్నారు. తన కుమార్తెకు కనీసం తిండి కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.