క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులపై బోర్డును ప్రశ్నించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: లోధా కమిటీ చేసిన సిఫార్సులపై బిసిసిఐని ప్రశ్నిస్తే బాగుంటుందని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. సోమవారం ఇక్కడ జరిగిన పుణె జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీపై విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేకించి ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలు, వాటిపై లోధా కమిటీ చేసిన వ్యాఖ్యలు, సిఫార్సుల అమలు వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రశ్నలతో ధోనీ కొంత అసహనానికి గురయ్యాడు. లోధా కమిటీ నివేదికను తనకు సమర్పించలేదని వ్యాఖ్యానించాడు. కమిటీ సిఫార్సులు, తీసుకుంటున్న చర్యలపై వివరణ కావాలంటే బిసిసిఐని ప్రశ్నించమని సూచించాడు. ఐపిఎల్‌పై ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ టోర్నీ వల్ల జరుగుతున్న మంచిని కూడా చూడాలని ధోనీ అన్నాడు. యువ క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇదొక మంచి వేదిక అవుతుందన్నాడు. అదే విధంగా ఒత్తిడిని అధిగమించే అలవాటు కూడా వారికి ఐపిఎల్ ద్వారా వస్తుందన్నాడు.
చెన్నైతో అనుబంధం గొప్పది
చెన్నై సూపర్ కింగ్స్‌తో తనకు ఉన్న అనుబంధం గొప్పదని ధోనీ అన్నాడు. కొత్త జట్టుకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, మ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయా ఎదురుచూస్తున్నానని అంటే తాను అబద్ధం చెప్పినట్టే అవుతుందని అన్నాడు. నిజానికి చెన్నైపైనే తనకు ఎక్కువ మమకారం ఉందని అన్నాడు. ఎనిమిదేళ్లపాటు ఆ జట్టుతో, ఆటగాళ్లతో తనకు మంచి సంబంధాలున్నాయన్నాడు. వారిలో కొంత మంది పుణె జట్టులోకి వచ్చినప్పటికీ, చాలా మందిని తాను కోల్పోతున్నానని అన్నాడు. సుదీర్ఘకాలం ఒక జట్టుకు నాయకత్వం వహించి, ఇప్పుడు హఠాత్తుగా మరో జట్టుకు కెప్టెన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించడం అనుకున్నంత సులభం కాదన్నాడు. అయితే, తనపై నమ్మకం ఉంచిన పుణె యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని, జట్టు విజయాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ధోనీ అన్నాడు. చిరకాలం తనతో కలిసి చెన్నై జట్టులో ఆడిన సురేష్ రైనా ఇప్పుడు మరో కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రొఫెషనల్ క్రికెటర్లుగా తమకు ఇలాంటివి అలవాటేనని అన్నాడు. ఎవరి జట్టు విజయానికి వారు కృషి చేయడం సహజమని చెప్పాడు.