రివ్యూ

కవ్వింపుల సుకుమారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** కుమారి 21 ఎఫ్ (ఫర్వాలేదు)

సుకుమార్ ఉరఫ్ సుక్కూ. -తెలుగు సినిమాకు ట్రెండ్ డైరెక్టర్. సుక్కూ సినిమాలు కొంచెం భిన్నం అన్నది ప్రేక్షకుడెరిగిన సత్యం. రెగ్యులర్ ఫార్మాట్‌ను పాతేసి -‘్ఫల్ థాట్’ను ప్రేక్షకుడికి అందించే రకం సుక్కూ. అలాంటి డైరెక్టర్ -ఈ సినిమాకు కథ, ప్లే రాసిపెట్టాడు. పైగా పెట్టుబడీ పెట్టాడు. టాప్ టెక్నీషియన్లు సినిమాకు టాలెంట్ అందించారు. పైగా సుక్కూ ట్రైనింగ్ స్కూల్లో నాలుగాకులు ఎక్కువ చదివిన కొత్త కుర్రాడు డైరెక్ట్ చేశాడు. ఇంకేముంది సినిమాపై క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్‌ని ఇంకొంత పెంచేస్తూ ప్రమోటింగ్ జరిగింది. అంతే -కుమారి 21 ఎఫ్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేసింది. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా అడ్డా ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ‘కుమారి’ ఎవరు? ఆమె కథేంటి? చూద్దాం.
హైదరాబాద్‌లోని కెబిఎన్ కాలనీలో ఉండే కుర్రాడు సిద్దు (రాజ్‌తరుణ్). అతని బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్ (నోయెల్), ఫొటోల సురేష్ (నవీన్), సొల్లు శీను (సుదర్శన్). ఫ్రెండ్స్ ముగ్గురూ ఎటిఎం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూంటే... హీరోవారికి సాయం చేస్తూంటాడు. అలాఉన్న తరుణంలో అదే కాలనీకి ముంబైనుంచి మోడల్ కుమారి (హెబ్బాపటేల్) దిగుతుంది. ఉన్నదున్నట్టు మాట్లాడటం ఆమె అలవాటు. నేటి కాలపు యూత్. అందరితో ఫ్రెండ్లీగా ఉండటం ఇష్టం. మనసులో ఏదీ దాచుకోని మనస్తత్వం. అలాంటి కుమారి మొదటి చూపులోనే సిద్దుని ప్రేమిస్తుంది. చాలా షార్ట్‌టైంలోనే ఇద్దరూ లవర్సవుతారు. కానీ కుమారి ఓపెన్‌గా ఉండటం, అలాగే కుమారి గురించి సిద్దు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నెగటివ్‌గా చెబుతుండడం (అయితే సిద్దు స్నేహితులకు కుమారిపై కన్నుపడుతుంది. ఎలాగైనా ఆమెను ముగ్గులోకి దించాలని ప్రయత్నిస్తూ ఉంటారు) వలన సిద్దుకి కూడా కుమారి మీద అనుమానం రావడంతో నిలదీస్తాడు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. అక్కడినుంచి కథ ఎలాంటి మలుపు తిరిగింది? చివరికి సిద్దు, కుమారిలు కలిసారా? లేదా? అన్నదే అసలు సినిమా.
నిజానికి సుక్కూ రాసిన స్టోరీ -ఇలాంటి అడల్ట్ కంటెంట్‌తో ఉంటుందని ఊహించలేదు. రైటర్ ఫాస్ట్ థాట్స్‌ను అంతే యాక్టివ్‌గా స్క్రీన్‌కు ఎక్కించాడు డైరెక్టర్. దాంతో సినిమా ప్రతీ ఫ్రేమ్‌లో సుక్కూ మార్కే కనపడుతుంది. కేవలం యూత్‌ని టార్గెట్‌చేసిన సినిమా ఇది అని చెప్పాలి. కెరీర్ ప్రారంభంలోనే రెండు వరుస హిట్లు అందుకున్న రాజ్‌తరుణ్, ఈ సినిమాలో కాస్త సెటిల్డ్ పాత్రలో కనిపించాడు. నిజానికి రాజ్‌తరుణ్ పాత్రలో ఎనర్జీ మిస్సయ్యింది. ఫస్ట్‌హాఫ్‌లో ఎప్పుడూ సీరియస్‌గా ఉండటం, సెకండాఫ్‌లో కొన్నిచోట్ల డైలాగ్స్‌వల్ల ఎక్స్‌ప్రెషన్ మారింది. అసలు హీరో పాత్ర ఎందుకంత డల్‌గా ఉందనే విషయంపై స్టోరీలో క్లారిటీ లేదు. హీరోయిన్ హెబ్బాపటేల్‌లో నటనపరంగా చెప్పుకునేదేమీ లేకున్నా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బండి లాక్కొచ్చింది. గ్లామర్‌ను చూపించేందుకు ఏమాత్రం తగ్గలేదు. కొన్ని సన్నివేశాల్లో కనిపించిన తీరు చూస్తే, స్కిన్‌షోలో హెబ్బా సూపర్‌ఫాస్ట్ అనుకోవచ్చు. యాక్టింగ్‌పరంగా యావరేజ్. మిగతా పాత్రల్లో నోయెల్ నెగటివ్ షేడ్స్ బాగా పండించాడు, కమెడియన్స్ నవీన్- సుదర్శన్‌లు తమ మార్క్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులకు కితకితలు పెట్టే ప్రయత్నం చేశాడు. హేమ, తాగుబోతు రమేష్‌లు తమ పాత్రల్లో పరవాలేదనిపిస్తే సెకండాఫ్‌లో సెకండ్ హీరోయిన్ కూడా స్కిన్‌షోతో ఒకలా మెప్పించింది.
సుకుమార్ కథే -సినిమాకు ప్రాణం. సుకుమార్ ఎంచుకున్న స్టోరీలైన్ బాగుంది. కానీ కథా విస్తరణ అంతంతమాత్రం. ఫ్రెష్‌ఫీల్‌ని వదిలేసి అడల్ట్ సీన్స్‌పై పడటంతో సుక్కూ ఇమేజ్‌కు కాస్త తక్కువగానే ఉంది. నిజానికి సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కథకాకుండా కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఓవర్‌డోస్ అడల్ట్ కంటెంట్‌ని చూపించేశారు. ఒక్కటంటే ఒక్క ట్విస్ట్ కూడా లేదు. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ మొత్తం ఊహించేయొచ్చు. కథనంలో ఆడియన్స్ ఎగ్జైట్‌గా ఫీలయ్యే సందర్భం తక్కువగానే ఉన్నాయి. డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రాసుకున్న సీన్స్‌లోని ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పైకి తీసుకురావడం, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ లెంగ్త్ విషయంలో, అనవసరమైన పాటలన్నీ తీసెయ్యడంలో, నేరేషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో హీరోయిన్స్‌ని చూపిన విధానం మరియు నాచురల్ లైటింగ్‌ని వాడుకున్న స్టయిల్ బాగుంది. దేవిశ్రీప్రసాద్ పాటలు బాగున్నాయి. కానీ అందులో చాలా పాటలకి సరైన సందర్భాలు లేవు. ఇకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ చెప్పుకునే స్థాయిలో లేదు. డైలాగ్స్ బాగున్నాయి. సుకుమార్ రైటింగ్స్- పిఎ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ఓకే. యువతకు నచ్చే అంశాలు, ఓవర్‌స్కిన్ షో సీన్స్ ఎక్కువే కనుక యూత్‌కు గాలం వేసే సినిమాగా వర్కవుట్ కావొచ్చు.

-త్రివేది