రాష్ట్రీయం

ఐదేళ్లలో హైదరాబాద్ విశ్వనగరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశమివ్వండి.. చేసి చూపిస్తాం: కెటిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 21: ఐదేళ్లలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని ఐటి మంత్రి కె తారకరామారావు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు అవకాశం కల్పించాలని, హైదరాబాద్ నగరం సమగ్రంగా అభివృద్ధిచెంది విశ్వనగరంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌కు చెందిన కెఎం ప్రతాప్, కట్టెల శ్రీశైలం యాదవ్ పెద్దసంఖ్యలో అనుచరులతోపాటు సోమవారం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఏదోకవైపు అని కాకుండా మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి చెందేలా విశ్వనగరంగా మార్చేలా ప్రభుత్వం పథకాల రూపకల్పన చేస్తోందని తెలిపారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, తెదేపాలు చేసిందేమీ లేదని, 18 నెలల తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చేసిందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి అంధకారమైందని, తెదేపాకు తెలంగాణలో ఉనికేలేదని అన్నారు. రాజధాని నగరంలో వసతులు అరకొరగానే ఉన్నాయని, అభివృద్ధి కోసం ఎంతో చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌కు ఏంచేశారో కాంగ్రెస్, తెదేపా నేతలను నిలదీయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని, గులాబీ జెండా ఎగురుతుందని వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలనే తపన ప్రజల్లో ఉందన్నారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు
గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను గెలిపించడం ద్వారా అభివృద్ధి పథకాలకు ఊతమివ్వాలని తెరాస నేత డి శ్రీనివాస్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని, అందువల్లే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, త్వరలో మరెన్నో కంపెనీలు రానున్నాయని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనేదే తెరాస లక్ష్యమని, ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడానికి తెరాసలో చేరినట్టు ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ , ఇతర నేతలు ప్రకటించారు.