కృష్ణ

వీఎస్‌పీ మైన్స్‌ను సందర్శించిన కేంద్ర సహాయమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: జగ్గయ్యపేట మండల పరిధిలో గల వీఎస్‌పీ లైమ్‌స్టోర్ మైన్స్‌ను గురువారం కేంద్ర ఉక్కుగనుల శాఖసహాయమంత్రి పగ్గస్‌సింగ్ కులస్తే సందర్శించారు. ముందుగా కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన ఆయన పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లైమ్‌స్టోర్ ప్రాంతానికి మంత్రి సందర్శనకు రాగా అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూ ఫాయింట్ నుండి వీఎస్‌పీ మైన్స్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇక్కడ రోజువారి ఎంత మైనింగ్ జరుగుతుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు ఎంతమేర లైమ్‌స్టోర్ సరఫరా అవుతుంది, ఏవిధంగా తరలిస్తుంది అధికారులు ఆయనకు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే వ్యాగన్‌కు లైమ్‌స్టోర్ లోడ్‌చేసే యంత్రాలను కేంద్రమంత్రి ప్రారంభించారు. వీఎస్‌పీ అతిథిగృహంలో మొక్కలు నాటారు. ట్రేడ్ యూనియన్ నాయకులు తమ సమస్యలను తెలియపర్చి పరిష్కరించాలని కోరడంతో పాటు వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు అభిమన్యు, ధర్మరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వీఎస్‌పీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు బీకేరాథ్, ఆపరేషన్ డైరెక్టరు సక్షేనా, డీజీఎం గుమ్మన నరేష్, నాగరాజు, రాజేశ్వరరావు, విజయకుమార్, ఇన్‌చార్జీ డీజీఎం బీవీవీఎన్ రాజు, వివిధ యూనియన్ నాయకులు మనె్న శ్రీనివాసరావు, పీవీ సుబ్బరాజు, ఎస్‌వీవీడీ ప్రసాద్, పి కోటేశ్వరరావు, బజ్యా, పీఆర్‌కే రాజు, డీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.