కృష్ణ

అర్బన్ బ్యాంక్‌కు పూర్వ వైభవం తీసుకు వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం అర్బన్ బ్యాంక్‌కు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమాన్ని మంగళవారం బ్యాంక్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పేద ప్రజలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు గాను ఏర్పాటైన అర్బన్ బ్యాంక్ లక్ష్యానికి అనుగుణంగా అంకిత భావంతో బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని పాలకవర్గానికి సూచించారు. అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షుడు రామబ్రహ్మంతో పాటు డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ అచ్చాబా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, తదితరులు పాల్గొన్నారు.

రోగుల పట్ల అప్యాయత కనబర్చాలి
* అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీబాల
మండవల్లి, ఫిబ్రవరి 25: ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల పట్ల అప్యాయత కనబర్చి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. లక్ష్మీబాల అన్నారు. మంగళవారం మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. పీహెచ్‌సీతో పాటు సబ్ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపర్చాలన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఎనిమియా ముక్త్ భారత్, మహిళా శిశు సురక్ష వంటి కార్యక్రమాలను అంకితభావంతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డా. విద్యులత, సూపర్‌వైజర్ నగేష్, సిబ్బంది కృష్ణమోహన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ రైల్వే జంక్షన్‌లో విద్యుద్దీకరణ పనులు పూర్తి
గుడివాడ, ఫిబ్రవరి 25: గుడివాడ రైల్వే జంక్షన్ పరిధిలో రైల్వే విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వేస్టేషన్ మేనేజర్ గాంధీ చెప్పారు. మంగళవారం రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ లోకో ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ నుండి గుడివాడ మీదుగా మోటూరు వెళ్తున్న ట్రైన్‌ను గుడివాడ రైల్వే జంక్షన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ 25వేల విద్యుత్ పోర్ట్ సామర్థ్యం కల్గిన విద్యుత్ లైన్‌కు ఛార్జింగ్ పూర్తయిన దృష్ట్యా గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజలు రైల్వే లైన్ దాటేటప్పుడు ఫ్లాట్‌ఫారంలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైల్వే లైన్ డబ్లింగ్, ఇతర అభివృద్ధి పనులు 90శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత రైల్వే స్టేషన్ మాస్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.