కృష్ణ

ఇసుక లభ్యతలో ఫిర్యాదులు రానివ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇసుక లభ్యతలో ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం నగరానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఇసుక సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. ప్రజలంతా హర్షించే విధంగా ఇసుక డోర్ డెలివరీ విధానం కొనసాగాలన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత కూడా సరైన సమయానికి ఇసుక ఇంటికి చేరకపోయినా, నాణ్యమైన ఇసుక అందకపోయినా, ఇసుక పరిమాణం తక్కువ వచ్చినా ఫిర్యాదు చేసేందుకు గాను ఫ్రీ కాల్ సెంటర్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వినియోగదారుల నుండి వచ్చే ఫ్రీ కాల్ ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత శాఖాధికారులపై చర్యలకు వెనుకాడమన్నారు. 96 శాతం ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏ మాత్రం ఇసుక పక్కదారి పట్టించకుండా పకడ్బందీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత మైనింగ్ అధికారులపై ఉందన్నారు. మీ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా వస్తున్న ఫిర్యాదులపై ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డోర్ డెలివరీ చేసే లారీలకు విధిగా జీపీఎస్ ఏర్పాటు చేయాలన్నారు. వేబ్రిడ్జి సక్రమంగా నిర్వహించడం లేదని వస్తున్న ఫిర్యాదులపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేబ్రిడ్జిపై లోపాలు, పరిణామాలు దృష్టికి వస్తే సంబంధిత వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందించాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. రొయ్యూరు స్టాక్ పాయింట్ నుండి సరఫరా అవుతున్న ఇసుక నాణ్యత సరిగ్గా లేదని వస్తున్న ఫిర్యాదులపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. నాణ్యత లేని పక్షంలో ఆ ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయొద్దని సూచించారు. ప్రజా ప్రతినిథులు ఇసుక పాలసీ అమలుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. డీ కాస్టింగ్ పట్టాలకు అనుమతులు ఇచ్చే సమయంలో నాణ్యత పరిశీలించుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే, బల్క్, వ్యక్తిగత అవసరాలకు వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారికి ఇసుకను సకాలంలో అందించడం లేదని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మచిలీపట్నం నగర పాలక సంస్థలో రూ.30కోట్లతో 150 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఆ మేరకు ఇసుక అందించేందుకు కూడా అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ చేపట్టే పనులకు పనుల వారీగా కాకుండా గ్రామ పంచాయతీలోని మొత్తం పనులు ఆధారంగా ఇసుక సరఫరా చేయాలని పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి పేర్ని మాట్లాడుతూ తాను తప్పు చేసిన వ్యక్తుల కోసం ఫోన్ చేసి సిఫార్సు చేయనని, ప్రజలకు సరైన దిశలో సేవలు అందించాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. మైనింగ్ అధికారులు తనతో కలిసి మాట్లాడవచ్చన్నారు. ఇసుక రవాణాలో కొంత మంది రవాణాదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారి లారీలను ఇసుక సరఫరా నుండి తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జేసీ-2 మోహన్ కుమార్, ఆర్డీవో ఖాజావలీ, మైనింగ్ డీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ జెవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.