కృష్ణ

అమ్మా.. ఈ స్థలాలు మాకొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల: మండలంలోని కొన్ని గ్రామాలలో ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు నివాస యోగ్యంగా లేవని, మాకొద్దంటూ ఆయా గ్రామస్థులు తహశీల్దార్ పద్మకుమారికి సోమవారం మొర పెట్టుకున్నారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాల పెద్దలు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం నుండి గ్రామసభలు నిర్వహించి లాటరీ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, మండలం మొత్తం మీద 1920 మంది దరఖాస్తులు చేసుకున్నారని తహశీల్దార్ తెలిపారు. మండలంలోని 25 గ్రామాలలో ప్రభుత్వ భూమి ఏడు ఎకరాలు ఉందని, మిగతా భూమిని కొనేందుకు రూ.26కోట్లు కేటాయించారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది నాటికి అందరికీ పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. తాడంకికి చెందిన చినబాబు తాడంకిలో పొలం కొన్నట్లు ఎవరికీ తెలుసని, 170 మంది అర్హులు ఉంటే ఎక్కడో ఊరికి రెండు కిలో మీటర్లు దూరంలో ఎకరం రూ.46లక్షలు కొనుగోలు చేయటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రెవెన్యూ ఆఫీసులో పని చేసే అధికారి పొలం అధిక ధర పెట్టి కొన్నారంటే బాగోతం అందరికీ అర్ధమవుతుందని, అసలు ఎకరం ధర రూ.15లక్షలు ఉంటే రూ.46లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం ఏమిటన్నారు. అలాగే ముళ్లపూడి గ్రామస్థులు శ్మశానం పక్కన స్థలాలు మాకొద్దుని, మంటాడ లబ్ధిదారులు తాడంకి వెళ్లమని కరాఖండీగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహశీల్దార్ సలీమ్, ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.