కృష్ణ

దిశ పోలీసు స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటరు): నగరంలో ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను సోమవారం జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, అడిషనల్ ఎస్పీ సత్తిబాబు దర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం, మహిళలు సమాజపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చి ధైర్యంగా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దిశ మహిళా పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో నగరంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దిశ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. ఇంకా ఏమైనా సమకూర్చాల్సిన సౌకర్యాలు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట ఎస్‌బీ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మెహబూబ్ భాషా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ అజీజ్ తదితరులు ఉన్నారు.

శ్రీ భోగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.21.29లక్షలు
కలిదిండి, ఫిబ్రవరి 24: శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వార్షిక మహా శివరాత్రి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు స్వామివారి కానుకలు, మొక్కుబడులు, హుండీని సోమవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి కె శ్రీనివాస్ సమక్షంలో సోమవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.9లక్షల 59వేల 494 వచ్చిందన్నారు. వీఐపీ దర్శనం రూ.2లక్షల 77వేల 800, స్పెషల్ దర్శనం రూ.8,9,890, కానుకలు రూ.46,342, సైకిల్ పార్కింగ్‌కు రూ.లక్షా 42వేలు, షాపు అద్దెలు రూ.లక్షా 74వేల 700, కొబ్బరి చిప్పలు రూ.20వేలు, అభిషేకములకు రూ.2,560 వెరసి మొత్తం రూ.21లక్షల 29వేల 865 వచ్చినట్లు ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది రూ.2లక్షల 62వేల 680 అధికంగా ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడివి వెంకట గంగాధర శర్మ, సభ్యులు పాల్గొన్నారు.

ట్రంప్ రాకను నిరసిస్తూ సీపీఎం నేతల ధర్నా

పామర్రు, ఫిబ్రవరి 24: అమెరికా దేశంతో భారత ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీ రైతాంగానికి ఉపవృత్తిగా ఉన్న పాడి, కోళ్ల పరిశ్రమలకు నష్టం వాటిల్లే విధంగా ఒప్పందాలు చేసుకోవటం సహించరాని విషయమని పలువురు పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక పామర్రు సెంటరులో ధర్నా చేశారు. ట్రంప్ భారత రాకను వారు నిరసించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బరిగెల భీమేశ్వరరావు, ముళ్లపూడి విల్సన్, గంగాథర్ తదితరులు పాల్గొన్నారు.