కృష్ణ

బందరులో కదం తొక్కిన దళితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దళితులు ఆదివారం కదంతోక్కారు. భీంఆర్మి, ఎఐడిఆర్‌ఎఫ్‌ల పిలుపు మేరకు దళిత సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. స్థానిక లక్ష్మీటాకీసు వద్ద గల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి భారత రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరివెళ్ల రాఘవరావు, ఎస్సీ ఉద్యోగుల సంఘ నాయకులు అర్జా జస్వసంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించి కోనేరుసెంటరులో మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమం ప్రారంభమైందని, దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరిగతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సక్సెస్ ఫౌండేషన్ నాయకులు పి శోభన్‌బాబు, బి లంకేష్, ఎస్సీ ఉద్యోగుల సంయేమ సంఘం నాయకులు కె సునీల్ కుమార్, ఎం కృష్ణకుమార్, పి వెంకటేశ్వరరావు, దళిత నాయకులు ఎం నాగరాజ్, ఎం పాండు, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు అభూతం ఆలీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎం సురేష్, సిహెచ్ గంగాధర్, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, సీపీఐ నాయకులు లింగం ఫిలిప్, జనసేన పార్టీ నాయకులు వంపుగడల చౌదరి, వైకాపా నాయకులు వి విక్టర్‌ప్రసాద్, జె ఆనందబాబు, టీడీపీ నాయకులు చుక్కా జయంత్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నల్లబోలు కుమారి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సిహెచ్ మనోహర్, ఇ చైతన్య, జి సతీష్ తదితరులు పాల్గొన్నారు.