కృష్ణ

కొండపల్లి ఉరుసు ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కొండపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ షాహ్ బుఖారి మహాత్యుల వారి ఉరుసు ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హామీ ఇచ్చారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు కలెక్టర్ ఇంతియాజ్‌ని కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్ ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 4,5,6న కొండపల్లిలో 423వ ఉరుసు మహోత్సవం జరగనుండటం సంతోషకర విషయమన్నారు. ఉరుసు ఉత్సవంలో ప్రభుత్వం తరపున తమ యంత్రాంగం కూడా పాలు పంచుకుంటుందని వెల్లడించారు. ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉరుసు ఉత్సవ కమిటీ చైర్మన్ మహ్మద్ అల్త్ఫా రజా మాట్లాడుతూ ఈ ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది లక్ష మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్ అలీ, ముస్లిం నాయకులు జీఎంసీ బాషా, వైసీపీ నాయకులు రూహుల్లా, న్యాయవాది ముక్తార్ అలీ, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్‌ను అల్త్ఫా రజా దుశ్శాలువతో సత్కరించారు.
బందోబస్తు ఏర్పాటు చేస్తాం : సీపీ
కొండపల్లి ఉరుసు ఉత్సవాల్లో పోలీసు యంత్రాంగం కూడా పాలుపంచుకుంటుందని ప్రధానంగా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామంటూ తనను కల్సిన ఉత్సవ కమిటీ ప్రతినిధుల బృందానికి పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు హామీనిచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ మహ్మద్ అల్త్ఫా రజా మాట్లాడుతూ ఈ ఉత్సవాలను గతం కంటే ఎంతో ఘనంగా నిర్వహస్తున్నామన్నారు. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉందంటూ ఈ దఫా లక్ష మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో ఈ ఉత్సవం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాల్సిందిగా పోలీసు కమిషనర్‌ను కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. ఈప్రతినిధి బృందంలో ఏపీ ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్ ఆలీ, ముస్లిం నేతలు జీఎంసీ బాషా, ఇంతేఖాబ్, చానా భాషా పాల్గొన్నారు. ఈసందర్భంగా శాలువాతో కమిషనర్ ద్వారకాతిరుమలరావును సత్కరించారు.