కృష్ణ

నాపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే విషం తీసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్లను రింగ్ చేసి పెద్ద ఎత్తున తాను అవినీతి చేసినట్టు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే విషం తీసుకుని చావడానికి తాను సిద్ధమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సవాల్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరు చేసిన పనులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి, ఎటువంటి టెండర్లు లేకుండా, వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేయించి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకున్నట్టు గత మూడు రోజులుగా మాజీ మంత్రి రవీంద్ర చేస్తున్న ఆరోపణలపై మంత్రి పేర్ని బుధవారం ఘాటుగా స్పందించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రవీంద్ర చేసిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. పేర్ని నాని అనే వ్యక్తి పరువు కోసం పాకులాడుతాడని, కీర్తికోసం పడి చస్తాడని.. అటువంటి తనకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. మీ ప్రభుత్వ హయాంలో మీరు రద్దు చేసిన పనులను నేడు నేను ఎలా రద్దు చేస్తానో నాకే అర్థం కావడం లేదన్నారు. 2015-16లో రూ.2.04కోట్లు, 2016-17లో రూ.3.46కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయన్నారు. తొలిగా వచ్చిన రూ.2.04కోట్లతో ఐదు వర్క్‌లకు టెండర్లు పిలిచి వారి బినామీ అయిన కెఆర్‌కె ప్రసాద్‌కు పనులు అప్పగించారన్నారు. అయితే ఆ పనులను సకాలంలో ప్రారంభించకపోవటంతో 2016 జూన్‌లో వాళ్లే రద్దు చేశారన్నారు. ఆ తర్వాత మంజూరైన రూ.3.46కోట్ల నిధులకు సంబంధించి తొమ్మిది పనులకు టెండర్లు పిలువగా అందులో రూ.2కోట్ల మేర వారి బినామీ అయిన కెఆర్‌కె ప్రసాద్‌కే కట్టబెట్టారని ఆరోపించారు. ఈ పనులను కూడా ప్రారంభించలేని రవీంద్ర ఆ విడత పిలిచిన టెండర్లను కూడా 2017 జూన్ 31వతేదీన రద్దు చేశారన్నారు. ఈ రెండు విడతలు మంజూరైన నిధులతో 2018 నవంబర్ 25వతేదీన మళ్లీ టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదన్నారు. అనేక పర్యాయాలు టెండర్లు పిలిచినా ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఆ రోజు నుండి మేము అధికారంలోకి వచ్చే వరకు ఆ నిధులు మున్సిపాల్టీలో మూలుగుతున్నాయన్నారు. తొమ్మిది నెలల క్రితం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం కింద రూ.19.75కోట్లు తీసుకు వచ్చామన్నారు. గత ఐదేళ్లుగా మూలన పడిన ఐదు కోట్లు, తాను తీసుకు వచ్చిన రూ.19.75కోట్ల నిధులతో గత టీడీపీ హయాంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో 125 పనులకు అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే కడుపు మంటతో తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో మంజూరైన నిధులతో పనులు చేయించుకోలేని రవీంద్ర తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆన్‌లైన్ టెండర్లలో ఎలా రింగ్ జరుగుతుందో వారికే తెలియాలన్నారు. మీ మాదిరి ఎస్సీ నిధులతో అగ్రవర్ణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం లేదన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఓ అధికారి బదిలీకి మీ సహచర మంత్రి సిఫార్సుకే రూ.20లక్షలు లంచం అడిగిన చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. కోటలు దాటే మాటలు మాట్లాడే రవీంద్ర ఊరు కోసం ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రవీంద్ర మంత్రిగా వ్యవహరించిన ఐదేళ్లల్లో బందరు నియోజకవర్గంలో తనకంటూ ఓ మైలు రాయిగా నిలిచే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారో లేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా వాస్తవ విరుద్ధ ఆరోపణలు చేసి ప్రజల్లో చులకన కావద్దని రవీంద్రకు మంత్రి పేర్ని నాని సూచించారు.