కృష్ణ

‘బాబు’పై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పీకల్లోతు అవినీతిలో మునిగి కోర్టుల చుట్టూ తిరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా దక్షుడు, దార్శనికుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం దొంగే దొంగా దొంగా అన్న చందాన ఉందని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం జగన్‌కు అర్జునుడు సవాల్ చేశారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న జగన్ కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. పింక్ డైమండ్, పోలవరం, అమరావతి ప్రాజెక్ట్‌లపై అవినీతి ఆరోపణలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆరోపణను ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన చంద్రబాబుపై లేని పింక్ డైమెండ్‌ను సృష్టించి ఇబ్బందులు పాలు చేయడాన్ని పైనున్న ఆ స్వామి చూస్తున్నాడని, త్వరలోనే స్వామి ఖచ్చితమైన తీర్పును ఇవ్వనున్నట్టు తెలిపారు. జగన్ సీఎం అయిన తర్వాత తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారని, ఏ ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి పర్యటన వివరాలు వెల్లడించకపోవడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. జగన్ తీసుకుంటున్న ఆసక్తికర నిర్ణయాలపై కేంద్రం జగన్‌ను నిలదీసినందుకే ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ నేడు తనపై ఉన్న కేసుల మాఫీ కోసం ఆయనే కేంద్రం ముందు తల వంచాడని విమర్శించారు. గతంలో ఎన్డీఎ నుండి తెలుగుదేశాన్ని బయటకురమ్మన్న జగన్ నేడు అదే ఎన్డీఎలో భాగస్వామ్యం అయ్యేందుకు వెంపర్లాడుతున్నాడన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం, రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసిన నిధులపై ప్రజలకు స్పష్టత ఇచ్చాకే జగన్ ఎన్డీఎలో చేరాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.