కృష్ణ

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతోనే నూరు శాతం ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: విద్యా శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నామని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అప్సా)కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొమరగిరి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం స్థానిక బాలాజీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో నూరుశాతం ఫలితాల సాధనకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతైనా అవసరమన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెంచటంతో పాటు డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. అటువంటి పథకాన్ని ప్రైవేట్ స్కూల్స్‌కు కూడా వర్తింప చేయడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 80శాతం విద్యార్థులు అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందారన్నారు. దీని బట్టి తమ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద మధ్య తరగతి చెందిన వారేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం అమలును కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిథులుగా తామంతా హర్షిస్తున్నామన్నారు. అప్సా గౌరవ అధ్యక్షుడు వి సుందరరామ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలను, ప్రైవేట్ పాఠశాలలను వర్గీకరించాలన్నారు. ప్రధాన కార్యదర్శి మట్టా జనార్థనరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. వారికి కూడా ఫీజు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం కలుగ చేయాలన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ ఎన్ చౌదరి, రాష్ట్ర కోశాధికారి మేకల రవీంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు మోహనరావు, ఫైనాన్స్ సెక్రటరీ ఎం అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

పవర్ లిఫ్టింగ్‌లో మైలవరం విద్యార్థుల ప్రతిభ
మైలవరం, ఫిబ్రవరి 19: జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు హెచ్‌ఎం రవిప్రకాష్ బుధవారం తెలిపారు. జగ్గయ్యపేటలోని జడ్పీ హైస్కూల్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అండర్-17, అండర్-19 స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈపోటీలలో తమ స్కూల్‌కు చెందిన సీహెచ్ చార్లెస్, ఎం లీలాసాయి చందు అత్యంత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించటంతోపాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 24,25న జగ్గయ్యపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. విజేతలను వ్యాయామోపాధ్యాయులు వెంకయ్య, మెర్సీరోజీనా, ఉపాధ్యాయులు అభినందించారు.

మహాశివరాత్రి పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లింపు
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 19: ఈ నెల 21వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని కరకట్టపై ట్రాఫిక్ మళ్లించటం జరుగుతుందని తోట్లవల్లూరు ఎస్‌ఐ వై చిట్టిబాబు తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 21వ తేదీ ఉదయం నుంచి సాయంత్ర వరకు కృష్ణా కరకట్ట మీదుగా వెళ్ళే వాహనాలను దారి మళ్ళించటం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అవనిగడ్డ - విజయవాడ నడిచే ఎపీఎస్‌ఆర్‌టీసీ బస్సులను సర్వీసులను నిలుపుదల చేయటం జరుగుతుందని, ప్రజలు గమనించాలని తెలిపారు. తోట్లవల్లూరు మండలం ఐలూరు శివాలయంకు వచ్చు భక్తులకు సహకరించాలని కోరుతున్నాము. అవనిగడ్డ నుంచి విజయవాడ వైపునకు కరకట్టపై నుంచి వచ్చే వాహనదారులు లంకపల్లి మీదుగా వీరంకిలాకు, మంటాడ, ఉయ్యూరు మీదుగా విజయవాడ వెళ్ళాలని సూచించారు. అలాగే విజయవాడ నుండి అవనిగడ్డ వైపునకు కరకట్ట మీదుగా వెళ్ళు వాహనదారులు తోట్లవల్లూరు నుండి ఉయ్యూరు మీదుగా మంటాడ, పామర్రు మీదుగా అవనిగడ్డ వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఐలూరు శివాలయంకు వచ్చే భక్తుల కోసం అన్ని పక్కలా పార్కింగ్ సదుపాయం కల్పించటం జరిగిందని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. అలాగే కృష్ణానదిలో గల బోయలదిబ్బలో లోతు ఎక్కువ, సుడిగుండములు ఉన్నందున బోయలదిబ్బలో గల నదిలో భక్తుల స్నానాలను నిషేధించినట్లు, ఎట్టి పరిస్థితుల్లోను భక్తులు బోయలదిబ్బ వైపునకు వెళ్లవద్దని సూచించారు. భక్తులు ఐలూరు ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన జల్లుస్నానాలలోనే స్నానమాచరించాలని కోరారు.