కృష్ణ

సచివాలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): సచివాలయ ఉద్యోగులు బాధ్యతాయుతమైన సేవలు అందించాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. బుధవారం స్థానిక 22వ వార్డు జలాలపేటలో రూ.1.60కోట్లతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.19లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, రూ.6లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్‌ల నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో ఆరు నెలల్లో రక్షిత మంచినీటి పథకం నిర్మాణాన్ని పూర్తి చేసి స్థానికంగా నెలకొన్న మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయన వార్డు సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యత చాలా అవసరమన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్, రేషన్, నివేశన స్థలాలు, అమ్మఒడి తదితర పథకాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. వాస్తవ లబ్ధిదారుడు ప్రభుత్వపరంగా లభించే పథకానికి అనర్హులుగా చేస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలుసు హరిబాబు, విక్టర్ ప్రసాద్, ఎఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

మొవ్వ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు
కూచిపూడి, ఫిబ్రవరి 19: మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కూచిపూడిలోని ఉప ఆరోగ్య కేంద్రాలను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధానాచార్యులు డా. సరసజాక్షి, డా. ఆర్ నాగమల్లేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ, ఆరోగ్య ఉప కేంద్రం నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య ఉప కేంద్రంలో వాక్సిన్ వేయించుకునే తల్లులు పిల్లలతో సహా ఉండటంతో వారి నుండి వివరాలు తీసుకున్నారు. అలాగే సబ్ సెంటరులో రోజు వారి వచ్చే రోగుల వివరాలు, మందుల వివరాలను ఎఎన్‌ఎం నిర్మల ద్వారా సేకరించారు. ఈ తనిఖీల్లో పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శొంఠి శివరామకృష్ణ, అంగన్‌వాడీ కార్యకర్త వీర కుమారి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.