కృష్ణ

కొత్తూరులో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో తహశీల్దారు వనజాక్షిని సోమవారం గ్రామస్థులు ఘోరావ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలకు భూమి సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సభ ఏర్పాటు చేశారు. అసైన్‌డ్ భూమితో పాటు వ్యవసాయ భూమిని సేకరించే సమయంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు చేరుకుని తహశీల్దారు వనజాక్షితో వాగ్వివాదానికి దిగారు. సమావేశంలో భూములకు చెందిన రైతులు మాత్రమే ఉండాలని, బ్రోకర్లు ఉండవద్దని సూచించారు. ఇక్కడ బ్రోకర్లు ఎవరూ లేరని, ఉన్నవారంతా రైతులమేనంటూ తహశీల్దారు వనజాక్షితో గొడవకు దిగారు. పలువురు మహిళలు తహశీల్దారు వనజాక్షిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తహశీల్దారు గో బ్యాక్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వనజాక్షిని సురక్షితంగా తీసుకువెళ్ళారు.

ఆడ శిశువును గర్భంలోనే చిదిమేసే సంస్కృతికి చరమగీతం పాడాలి

మచిలీపట్నం, ఫిబ్రవరి 17: ఆడ శిశువులను గర్భంలోనే చిదిమేసే సంస్కృతికి ముగింపు పలకాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్ అమలుపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలోనే గర్భంలో ఉన్న శిశువు ఆడ లేదా మగ అనే విషయం తెలుస్తుందన్నారు. ఆ సెంటర్లను నియంత్రిస్తే ఆడ పిల్లలను కాపాడినవురమవుతామన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా. టి శ్రీరామచంద్రమూర్తి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డా. లక్ష్మి, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ఆశాబాల, టీబీ అధికారి డా. జయంతి, డా. రవికృష్ణ, డా. ప్రియదర్శిని, స్వచ్చంద సేవకులు సుశీల, జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.