కృష్ణ

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో అట్టహాసంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల కోసం రైతు భరోసా పధకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశ్యంతో ధరల స్థిరీకరణ నిధిని ఏటా మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే మాట తప్పకుండా మడమ తిప్పకుండా హామీలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అదేవిధంగా రైతుల కోసం నిరంతరం పని చేసే పాలకవర్గాన్ని మీముందుకు తీసుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం ఎంతవరకైనా పని చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఒక రాజకీయ నిరుద్యోగి అన్నారు. తన ఉనికిని కాపాడుకోవటం కోసం నిరంతరం రాద్ధాంతం సృష్టిస్తుంటాడన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను సైతం మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షులుగా నియమించి రైతు సంక్షేమంలో వారికి సముచిత స్థానం కల్పించారన్నారు. గతంలో ఇక్కడ జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా ఈప్రాంతానికి కనీసం సాగునీటిని కూడా ఇవ్వలేక పోయాడని ఆరోపించారు. పెడన శాసన సభ్యుడు జోగి రమేష్ మాట్లాడుతూ మైలవరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పామర్తి శ్రీనివాసరావును నియమించటం వైసీపీ ప్రభుత్వం గొప్పతనమన్నారు. ముఖ్యమంత్రి జగన్ ముందుచూపుతో పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాజధానిని వికేంద్రీకరిస్తున్నారని అందరూ దీనిని అర్థం చేసుకోవాలన్నారు. ప్రవాసాంధ్రులు లకిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్, మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ హయాంలో మైలవరం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మైలవరం అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఈకార్యక్రమంలో వైసీపీ నేతలు పామర్తి శ్రీనివాసరావు, అప్పిడి సత్యనారాయణరెడ్డి, జొన్నలగడ్డ గంగాధరరావు, గొట్టుముక్కల ఓంకార్, సభ్యులు పాల్గొన్నారు.