కృష్ణ

జిల్లాలో ఆలయాల అభివృద్ధికి రూ.10కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరైనట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయ అవరణలో రూ.20లక్షలతో నిర్మించనున్న పాల పొంగళ్ల భవన్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ నవశకం పథకం కింద 201 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు కోసం ఒక్కో దేవాలయానికి నెలకు రూ.5వేలు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో మరో 400 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పురాతన ఆలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్యాలకు నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని దేవాలయాలు అభివృద్ధికి పరిశీలించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం గొడుగుపేటలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 200 దేవాలయాలకు ట్రస్టు బోర్డులు వేసుకునేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కైకలూరు తదితర ఆలయాలకు ట్రస్టు బోర్డుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే కొండలమ్మ ఆలయ పరిసరాలలో భవిష్యత్తులో భూమి అవసరమైనందున చుట్టు పక్కల భూములు ఉంటే కొనుగోలు చేయాలని ఇఓ నటరాజన్ షణ్ముగంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ వైకాపా నాయకుడు పాలేటి చంటి, మండల కన్వీనర్ శాయన రవి కుమార్, సహకార బ్యాంక్ డైరెక్టర్ పడమటి సుజాత, పెనే్నరు ప్రభాకరరావు, శేషం గోపి తదితరులు పాల్గొన్నారు.