కృష్ణ

విజయవాడ విమానాశ్రయంలో బ్యాటరీ కార్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్‌లో మొట్టమొదటిగా రూ. 78 లక్షల రూపాయల వ్యయంతో ఆరు కాలుష్య రహిత బ్యాటరీ కార్లను విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరీ, ఎయిర్ పోర్టు డైరెక్టర్ జి మధుసూదనరావుతో కలిసి ప్రారంభించారు. సోమవారం ఎయిర్ పోర్టు ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాతావరణ కాలుష్యం ఏర్పడిన నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించే యత్నంలో భాగంగా భారత విమానయాన సంస్థ సౌజన్యంతో తొలిసారిగా ఆరు వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం గన్నవరం ఎయిర్ పోర్టు నుండి వారానికి దుబాయికి రెండు, శ్రీలంకకు రెండు, థాయ్‌లాండ్‌కు రెండు, సింగపూర్‌కు ఒక సర్వీసు ప్రవేశపెట్టాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, సీఈఓలకు కేంద్ర విమానాయాన మంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రూ. 45 లక్షల రూపాయల విలువ గల మొబైల్ కంబైన్డ్ వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి బాలశౌరి ప్రారంభించారు. తొలుత ఆయన జ్యోతి వెలిగించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాగల ఐదేళ్ళ కాలంలో గన్నవరం ఎయిర్‌పోర్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని, 40 విమానాలు పార్కింగ్ సామర్థ్యం గల అప్రాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భారత విమానయాన సంస్థ హరిత విమానాశ్రయాలుగా రూపొందించాలన్న ధ్యేయంతో కాలుష్య రహిత వాహనాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయ అభివృద్ధికి ఎంపీ బాలశౌరీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇఇఎస్‌ఎల్ జనరల్ మేనేజర్ తరుణ్, ఎంకెవి గుప్తా, పీవీ రామారావు, రెడ్డి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శాసనమండలి రద్దు నిర్ణయం
వైసీపీ నిరంకుశత్వానికి నిదర్శనం
మైలవరం, జనవర 27: శాసనమండలి నిర్ణయం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలుగుతమ్ముళ్ళు ధ్వజమెత్తారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏఎంసి మాజీ చైర్మన్ ధనేకుల సాంబశివరావు, మాజీ ఎంపిపి బాణావతు లక్ష్మి, మాజీ జడ్పీటిసి దొండపాటి రాము తదితరులు సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ శాసన మండలిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనమన్నారు. తనకున్న విచక్షణాధికారంతో చైర్మన్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారని దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరమని చెప్పిందే తప్ప ఎక్కడా దానిని తిరస్కరించలేదనే విషయాన్ని మంత్రులు గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దావోస్ వెళ్ళి వంద కోట్లు పెట్టుబడులు తెస్తే ఇక్కడి మంత్రులు మాత్రం పోడియం ఎక్కి చైర్మన్ వద్ద ఉన్న కాగితాలు ఎత్తుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా ఈసమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తాతా పోతురాజు, గంజి కృష్ణారెడ్డి, రాధాకృష్ణ, బాలకృష్ణ, షహానాబేగం, బాబూరావు, మద్దినేని శ్రీను, కన్నయ్య, అంజి, కరీమ్‌దాదా, బుజ్జి, దుర్గారావు, గౌస్, మస్తాన్, దాదర్, రోశయ్య, కరిముల్లా, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.

మా బతుకులు బజారుపాలు చేయకండి
* స్పందనలో 36 కుటుంబాల వినతి
పమిడిముక్కల, జనవరి 27: మండల పరిధిలోని తాడంకి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కనే వేసుకున్న ఇళ్లు తొలగించి తమ బతుకులు బజారు పాలు చేయవద్దని 36 కుటుంబాలకు చెందిన ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ పద్మకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాడంకి జడ్పీ హైస్కూలు ప్రహరీ పక్కన సుమారు 36 కుటుంబాలకు చెందిన 120 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులు కలిపి ఇళ్లు నిర్మించుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారని, వీరికి ఎన్‌ఆర్‌ఐలు, ఇతరుల వద్ద డబ్బులు వసూలు చేసి ప్రహరీ గోడ పక్కనే కాంప్లెక్స్‌లు కట్టి అద్దెలు వసూలు చేయటం సబబు కాదని పేర్కొన్నారు. మేము కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, లేబర్ లైసెన్సులు కట్టి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన విధంగా ప్రభుత్వ భూములలో నివాసాలు ఉన్న వారిని క్రమబద్ధీకరించాలని ప్రకటించిన విధంగా మమ్ములను కూడా క్రమబద్ధీకరించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, వి బాలకృష్ణ, వెంకట సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.